• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వరంగల్ లో తొమ్మిది నెలల పసిపాపపై పాశవికం .. రేప్ చేసి చంపేసిన కామాంధుడు

|

వరంగల్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హన్మకొండ నడిబొడ్డున దారుణ సంఘటన జరిగింది. అభం శుభం తెలీని , తనపై జరుగుతున్న దారుణాన్ని కూడా చెప్పలేని ఓ చిన్నారి జీవితం మొగ్గలోనే తుంచేశాడు ఓ కామాంధుడు . ఓ మృగాడి కామ దాహానికి తొమ్మిది నెలల పసి పాప బలైపోయింది.

ప్రధాని మోడీని ప్రతి దానికీ పిలవాలా !.. కేంద్రం కాళేశ్వరానికి చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదన్న కేసీఆర్

తొమ్మిదినెలల చిన్నారిపై అత్యాచారం .. నగరం నడిబొడ్డున ఘటన

తొమ్మిదినెలల చిన్నారిపై అత్యాచారం .. నగరం నడిబొడ్డున ఘటన

ఓ మానవ మృగం రెచ్చిపోయింది. ఓ తొమ్మిది నెలల చిన్నారి పై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చిన్నారి ప్రాణం తీసిన ఘటన సభ్య సమాజాన్ని షాక్ కు గురి చేసింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లా హన్మకొండ టైలర్ స్ట్రీట్ లో నివాసం ఉండే దంపతులు ఎండాకాలం కావటంతో ఇంటి టెర్రస్ పైన తమ తొమ్మిది నెలల పాపతో పాటు నిద్రిస్తున్నారు. అందరూ నిద్రలో ఉండగా ప్రవీణ్ అనే కామాంధుడు నిద్రలో ఉన్న పాపను ఎత్తుకెళ్ళి ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశంలో పాపపై లైంగిక దాడికి దిగాడు . పాప గుక్క పెట్టి ఏడుస్తున్నా వదలకుండా చిన్నారిపై పాశవిక చర్యకు పాల్పడ్డాడు.

చిన్నారి మృతి ..అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి దేహ శుద్ధి .. పోలీసులకు అప్పగింత

చిన్నారి మృతి ..అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి దేహ శుద్ధి .. పోలీసులకు అప్పగింత

చిన్నారి కనిపించకపోవటంతో పాప కోసం వెతుకుతూ వెళ్ళిన తల్లిదండ్రులు చిన్నారిపై ప్రవీణ్ చేస్తున్న అఘాయిత్యాన్ని చూసి ప్రవీణ్ ను పట్టుకుని దేహ శుద్ధి చేశారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న పాపను తీసుకుని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్ళినా లాభం లేకపోయింది. అప్పటికే పాప ప్రాణాలు విడిచింది. దీంతో తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ప్రవీణ్ ను పోలీసులకు అప్పగించారు. పసిపాప అని కూడా లేకుండా అత్యంత హేయంగా ప్రవర్తించి అత్యాచారం చేసిన ప్రవీణ్ సమాజంలో ఉంటె చాలా ప్రమాదమని అతడికి కఠిన శిక్ష వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు పాప తల్లిదండ్రులు.

సమాజం మారాలి .. లేకుంటే ఇలాంటి ఘటనలతో సిగ్గుతో తలదించుకోవాల్సిందే

సమాజం మారాలి .. లేకుంటే ఇలాంటి ఘటనలతో సిగ్గుతో తలదించుకోవాల్సిందే

సమాజంలో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమైపోయాయి. నిర్భయ వంటి కఠిన చట్టాలు ఉన్నా కామాంధులు అన్నెం పున్నెం తెలియని బాలికలను పొట్టన పెట్టుకుంటూనే ఉన్నారు. చట్టాలు మాత్రమే కాదు, సమాజంలోమే మార్పు రావాలి. ఆ మార్పు ప్రతి ఇంటి నుండీ ప్రారంభం కావాలి. నైతిక విలువలు చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుండే తల్లిదండ్రులు నేర్పించాలి. విచక్షణా జ్ఞానంతో పిల్లలను ఎదగనివ్వాలి . అంతే కాదు ఇలాంటి ఘటనలకు పాల్పడే వారికి తక్షణ శిక్షలు అమలు చెయ్యాలి. అప్పుడు కొంతైనా మార్పు వచ్చే అవకాశం వుంటుంది. లేకుంటే పసి మొగ్గల బ్రతుకులు కూడా ఇలా చిద్రం అవుతూనే ఉంటాయి. సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a gruesome incident, a nine-month-old baby was raped here at Hanamkonda of erstwhile Warangal district. However, she died while being shifted to a hospital The accused identified as Praveen, abducted the child while she was sleeping on the terrace of her house along with her parents. He took her to an isolated place and raped and murdered her. Meanwhile, parents of the child who went in search of her noticed the act and caught the accused. He was thrashed and handed over to the police. The baby died in mid-way while being shifted to Maxcure hospital in Hanamkonda. The incident took place at Tailor street in hanamkonda .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more