constituency jangaon mla challenge bandi sanjay kishan reddy bjp trs నగ్నం నిరసన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కిషన్ రెడ్డి బీజేపీ టీఆర్ఎస్ politics
నగ్నంగా మోకాళ్లపై ప్రదర్శన చేస్తా..?: ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హాట్ కామెంట్స్..
కేంద్రం- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. నిధులపై మాటల యుద్ధం జరుగుతోంది. జీఎస్టీ- ఇతర నిధుల గురించి పదే పదే డిస్కషన్స్ జరుగుతున్నాయి. బీజేపీ- టీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. ఇవాళ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి లైన్లోకి వచ్చారు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పదే పదే కామెంట్స్ చేసేవారికి ఛాలెంజ్ చేశారు.
జీఎస్టీ ఇతర వాటా కింద తెలంగాణ రాష్ట్రానికి లక్షా 30 వేల కోట్ల నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉందని యాదగిరి రెడ్డి అన్నారు. కానీ ఏదో కారణం చెప్పి నిధులను మాత్రం విడుదల చేయడం లేదన్నారు. దీనిపై సీఎం కేసీఆర్/ మంత్రులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. అయినా మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు. కాలం గడుస్తోన్న ఒక్క పైసా రావడం లేదని చెప్పారు. దీనిపై బీజేపీ నేతలు మాట్లాడాలని యాదగిరి రెడ్డి సవాల్ విసిరారు.

రాష్ట్రానికి రావాల్సిన నిధులు వాస్తవం కాదని నిరూపిస్తే తాను దేనికైనా సిద్దమని ప్రకటించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి ముందుకొచ్చి నిరూపించాలని కోరారు. ఒకవేళ తాము చేస్తోన్న వ్యాఖ్యలు అబద్దమని తేలితే తన జనగామ నియోజకవర్గంలో నగ్నంగా తిరుగుతానని సవాల్ విసిరారు. మోకాళ్లపై ప్రదర్శన చేస్తామని యాదగిరి రెడ్డి అన్నారు. ఈ కామెంట్స్ చర్చకు దారితీశాయి. ఎమ్మెల్యే ఓపెన్ ఛాలెంజ్ చేయడం సర్వత్రా చర్చానీయాంశమైంది.