వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గంజాయి దందా చేస్తున్న ఇద్దరిపై పీడీ యాక్ట్ .. ఆ పని చేస్తే కఠిన చర్యలని సీరియస్ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

వరంగల్‌ నగరంలో గంజాయి దందాకు చెక్ పెట్టటానికి పోలీసులు చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులపై పీడీ యాక్ట్‌ ఉత్తర్వులు జారీచేసిన వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా.వి.రవీందర్‌ ఎవరైనా గంజాయి విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఈ కూలగొట్టుడేంది ? జగన్ కు ఎవరైనా మంచి సలహాలు ఇవ్వండయ్యా అంటున్న వీహెచ్ఈ కూలగొట్టుడేంది ? జగన్ కు ఎవరైనా మంచి సలహాలు ఇవ్వండయ్యా అంటున్న వీహెచ్

గంజాయి రవాణా మరియు విక్రయాలకు పాల్పడతున్న ఇద్దరిపై పీడీ యాక్ట్ పెట్టిన పోలీసులు

గంజాయి రవాణా మరియు విక్రయాలకు పాల్పడతున్న ఇద్దరిపై పీడీ యాక్ట్ పెట్టిన పోలీసులు


వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గంజాయి రవాణా మరియు విక్రయాలకు పాల్పడతున్న సూర్యాపేట జిల్లాకు చెందిన లావురి సంతోష్‌, ధరావత్‌ వంశీల పై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ మంగళవారం పీ.డీ యాక్ట్‌ ఉత్తర్వులు జారీచేసారు. పీ.డీ యాక్ట్‌ ఉత్తర్వులు అందుకున్న నిందితులు ఇద్దరితో పాటు మరో ఇద్దరు నిందితులు కలిసి గత మే 24వ తేదిన జనగాం పట్టణంలో కారులో లక్షా ముప్పై ఐదు వేల రూపాయల విలువ గల 45 కిలోల గంజాయిని తరలిస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులను గమనించిన నిందితులు తప్పించుకోని పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కారు. ఇద్దరు పోలీసులకు పట్టుబడగా మరో ఇద్దరు నిందితులు పరారయ్యారు. పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చేస్తున్నారు.

 గతంలో కేసులున్నా గంజాయి దందా మానని నిందితులు .. పీడీ యాక్ట్ తో కటకటాల వెనక్కు

గతంలో కేసులున్నా గంజాయి దందా మానని నిందితులు .. పీడీ యాక్ట్ తో కటకటాల వెనక్కు

పట్టుబడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసిన జైలుకు తరలించారు. నిందితులు ఇద్దరు గతంలో 2017 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ వైజాగ్‌ జిల్లాలోని కృష్ణాదేవిపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గంజాయి రవాణాకు పాల్పడటం చేసిన పాత నిందితులు ఇక వీరి తీరు మారకపోవటం, తిరిగి అదే దందా కొనసాగిస్తుండటంతో వారిపై పీడీ యాక్ట్‌ ఉత్తర్వులు జారీచేయడం జరిగిందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. పోలీస్‌ కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వులను జనగామ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఇన్స్‌స్పెక్టర్‌ డి. మల్లేష్‌ కేంద్రకారాగారంలో నిందితులకు జైలర్‌ సమక్షంలో పీ.డీ నిర్బంద ఉత్తర్వులను అందజేశారు.

 పీడీ యాక్ట్ పడితే సంవత్సరం దాకా నో బెయిల్ .. గంజాయి దందా చేస్తే పీడీ యాక్ట్ పెడతామని వార్నింగ్

పీడీ యాక్ట్ పడితే సంవత్సరం దాకా నో బెయిల్ .. గంజాయి దందా చేస్తే పీడీ యాక్ట్ పెడతామని వార్నింగ్

పీడీ యాక్ట్ నమోదైన నిందితులకు సంవత్సర కాలం పాటు బెయిల్ కూడా రాదనీ , ఎవరూ ఇలాంటి దందాలకు పాల్పడకూడదని పోలీస్ కమీషనర్ రవీందర్ పేర్కొన్నారు. దేశ భవిష్యత్తయిన యువతను మత్తుకు బానిసలుగా చేసి ఆక్రమసంపాదన కోసం గంజాయి రవాణాకు మరియు విక్రయాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్‌ క్రింద కేసులను నమోదు చేయడం జరుగుతుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ హెచ్చరించారు.

English summary
Warangal police commissioner has invoked Preventive Detention (PD) Act against two marijuana smugglers Lavuri Santhosh, Dharavath Vamshi they alleged involvement in a series of cases.The polcie commissioner ordered the officials to file cases under the PD Act and sent them to waranagal central prison. For the last few years they were involved in marijuana cases booked under the limits of AP Krishna district .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X