వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిట్స్ నిర్వాహకులపై దాడి.. ముగ్గురి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

వరంగల్ పోలీసు కమీషనరేట్ పరిధిలో చిట్ ఫండ్ కంపెనీలు చేస్తున్నాయి. దీనిపై పోలీసులు స్పందించారు. చిట్‌ఫండ్ సిండికేట్‌కు సంబంధించి ముగ్గురు చిట్ వ్యాపారులపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మూడు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. హన్మకొండ, సుబేదారి, మట్టెవాడ పీఎస్ పరిధిల్లో కొందరు చిట్స్ యజమానులను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం వారిని ఆస్పత్రికి తరలించి.. తర్వాత అరిమాండ్ కు తరలించారు.

కాజీపేట,వరంగల్,హన్మకొండలో బృందాలుగా విడిపోయిన టాస్క్ ఫోర్స్ పోలీసు సిబ్బంది ముగ్గురు బడా చిట్ వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు చిట్‌ఫండ్ వ్యాపారుల కోసం గాలిస్తున్నాయి. చిట్స్ యజమానుల విచారణలో వెలుగు చూస్తున్న విషయాలను పోలీసులు రికార్డు చేశారు. సభ్యులు చిట్ పాడుకున్నా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుండటంతో బాధితులు పెద్ద ఎత్తున పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో చిట్ ఫండ్ యాజమానులతో వరంగల్ సీపీ తరుణ్ జోషి గతంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. సామాన్యులకు చిట్స్ డబ్బులు చెల్లించాలని చిట్స్ యజమానులకు సూచించారు.

police raid on chit fund traders. raid on warangal police commissionerate limits.

చిట్‌ఫండ్ డబ్బు చెల్లింపులపై చిట్‌ఫండ్ యజమానులకు పోలీసు కమీషనర్ కొంత సమయం ఇచ్చారు. చిట్స్ చీటింగ్‌పై అడ్డుకట్ట వేసేందుకు సీపీ నిర్వహించిన ప్రజాదర్బార్‌ను చిట్స్ సిండికేట్ పట్టించుకోలేదు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో చిట్ ఫండ్ బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. బాధితుల్లో అత్యధికులు చిరుద్యోగులు, పోలీస్, ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు ఉన్నారు. ఖాతాదారుల డబ్బుల చెల్లింపునకు బదులు చిట్స్ సిండికేట్ వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్లలో ప్లాట్స్ తీసుకోవాలని చిట్స్ వేసిన వారు వేధించారు. ఈ సిండికేట్‌లో వరంగల్‌లోని బడా రాజకీయ నాయకులు, చిట్స్ యజమానులు ఉన్నారు.

పేద, మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దని సీపీ తరుణ్ జోషి ఆదేశాలను భేఖాతర్ చేశారు. మీడియా కథనాలతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు.

English summary
police raid on chit fund traders. raid on warangal police commissionerate limits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X