వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రవీణ్‌ను ఉరి తీయాలి....లేదంటే సర్పంచ్ పదవికి రాజీనామ చేసి.. అసెంబ్లీ ముందు ఆందోళన చేస్తా....

|
Google Oneindia TeluguNews

వరంగల్ నగరంలో తొమ్మిది నెలల అభం శుభం తెలియని చిన్నారీపై అత్యాచారం జరిగిన సంఘటన రాష్ట్ర్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే...సంఘటన జరిగిన తర్వాత నిందితుడిని ఉరి తీయాలంటూ రాష్ట్ర్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యేను సైతం స్థానిక యువకులు బహిరంగగానే నిలదీసిన పరిస్థితి. ఇలాంటీ పరిస్థితిలోనే యువకులు ,మహిళలు పెద్ద ఎత్తున చిన్నారీ కుటుంభానికి బాసటగా నిలుస్తున్నారు. నిందితుడిని ఉరి తీయాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.దీంతో ఓ మహిళ సర్పంచ్ సైతం నిందితుడిని ఉరి తీయాలని, లేదంటే పదవికి రాజీనామ చేసి ఆందోళన నిర్వహిస్తామని సీఎంకు లేఖ రాసింది.

అయితే తాజా ఆందోళనల నేపథ్యంలోనే ఓ సాధారణ సర్పంచ్ సైతం సంఘటనపై స్పందించింది. నిందితుడికి ఆరునెలల్లోగా ఉరిశిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ ఏకంగా సీఎంకు లేఖ రాసింది. లేదంటే తన సర్పంచ్ పదవికి రాజీనామ చేయడంతో పాటు రాష్ట్ర్ర రాజధానిలో ఇతర మహిళ సర్పంచ్‌లతో కలిసి ఆందోళన నిర్వహిస్తామని లేఖలో పేర్కోంది.

praveen shoud not be punished immidietly...i will resined for sarpanch...!

నల్గోండజిల్లా గుర్రంపాడ్ మండలం తేనపల్లితండాకు చెందిన మహిళ సర్పంచ్ వడ్త్య రజిత, వరంగల్‌లో జరిగిన తోమ్మిదేళ్ల చిన్నారీ అత్యాచారంపై తీవ్రంగా స్పందించింది. నిందితుడిని వదిలివేయకుండా శిక్ష విధించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాసింది. చిన్న పాప అని అత్యచార నిందితుడికి శిక్ష విధించకుండా వదిలేస్తే మరిన్ని ఘటనలకు అవకాశం ఉంటుందని ఆలే లేఖలో పేర్కోంది.నిందితుడిని ఆరునెలల్లోగా ఉరిశిక్ష విధించాలని లేదంటే తన సర్పంచ్ పదవికి రాజీనామ చేసి , రాష్ట్ర్ర అసెంబ్లీ ముందు ధర్నా నిర్వహిస్తానని లేఖలో పేర్కోంది.

English summary
praveen shoud be punished immidietly..who raped a nine months old girl in warangal recently. otherwise i resigned for sarpanch, warned to the cm kcr and wrote a letter to cm
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X