వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Women Lecturer: డయల్ 100పై నమ్మకం లేదు: గన్ లైసెన్స్ ఇవ్వండి: మహిళా లెక్చరర్ విజ్ఞప్తి

|
Google Oneindia TeluguNews

వరంగల్: దేశవ్యాప్తంగా ప్రకంపనలను పుట్టించిన వెటర్నరి డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్యోదంతం మహిళా లోకాన్ని ఎంతగా అభద్రతా భావంలోకి నెట్టేసిందో తెలియజేసే ఉదంతం ఇది. ప్రియాంకా రెడ్డి హత్యోదంతాన్ని చూసిన అనంతరం ఇల్లొదిలి బయటికి వెళ్లాలంటే భయంగా ఉందంటూ ఓ మహిళా లెక్చరర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో ప్రియాంకా రెడ్డి, వరంగల్ మానస ఉదంతాలు తనను అభద్రతా భావానికి, భయాందోళనలకు గురి చేస్తున్నాయని అంటున్నారు.

గన్ లైసెన్స్ కావాలంటూ..

గన్ లైసెన్స్ కావాలంటూ..

తనకు గన్‌ లైసెన్స్ ను మంజూరు చేయాలంటూ నౌషీన్ ఫాతిమా అనే ఓ మహిళా లెక్చరర్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె వరంగల్‌ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ కు ఇమెయిల్ ద్వారా వినతిపత్రాన్ని పంపించారు. నౌషీన్ ఫాతిమా ఖమ్మంజిల్లాలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు. వరంగల్ నుంచి ఖమ్మం జిల్లాకు ఆమె రోజూ రాకపోకలు సాగిస్తుంటారు. ఉద్యోగరీత్యా తాను రోజూ వరంగల్‌ నుంచి ఖమ్మం జిల్లాకు ఒంటరిగా ప్రయాణం చేస్తుంటానని, విధులను ముగించుకుని స్వస్థలానికి చేరుకునేసరికి రాత్రవుతుందని అన్నారు.

డయల్ 100 ఫోన్ చేస్తే వస్తారనే నమ్మకం లేదు..

డయల్ 100 ఫోన్ చేస్తే వస్తారనే నమ్మకం లేదు..

ఏదైనా అనుకోని సంఘటన చోటు చేసుకున్నప్పుడు డయల్‌-100కు ఫోన్‌ చేసినా గానీ, మొబైల్‌ యాప్‌ ద్వారా సహాయాన్ని కోరినా.. సకాలంలో పోలీసులు వచ్చి రక్షిస్తారనే నమ్మకం తనకు ఏ మాత్రం లేదని ఆమె తన వినతిపత్రంలో రాసుకొచ్చారు. గన్‌ లైసెన్స్‌ ఇవ్వకపోతే ఉద్యోగాన్ని మానేసి ఇంట్లోనే కూర్చుంటానని స్పష్టం చేశారు. ప్రియాంకా రెడ్డి, మానస హత్యోదంతాలను నౌషీన్ ఫాతిమా తన ఇందులో ప్రస్తావించారు.

మానస హత్య జరిగిన చోటు మా ఇంటికి దగ్గరే..

మానస హత్య జరిగిన చోటు మా ఇంటికి దగ్గరే..

ఈ నెల 28న మానస హత్య చోటు చేసుకున్న హంటర్‌ రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్స్‌ మ ఇంటికి సమీపంలోనే ఉందని, తాను రోజూ అదే మార్గంలో వెళ్తుంటానని అన్నారు. మానస హత్యాచార వార్త చదివినప్పటి నుంచి ఇంటికి సురక్షితంగా వస్తానా?, లేదా? అనే భయం పట్టి పీడిస్తోందని చెప్పారు. అదే సమయంలో హైదరాబాద్‌లో ప్రియాంకరెడ్డి ఘటన చోటు చేసుకుందని అన్నారు.

అత్యుత్తమ పోలిసింగ్ ఉన్న దేశాల్లో కూడా..

అత్యుత్తమ పోలిసింగ్ ఉన్న దేశాల్లో కూడా..

మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడంలో అత్యుత్తమ పోలిసింగ్ వ్యవస్థ ఉన్న ఇంగ్లండ్‌, కెనడా, నెదర్లాండ్స్‌ వంటి దేశాల్లో కూడా తక్షణ సహాయం సాధ్యం పడట్లేదని చెప్పారు. ఆపదలో ఉన్నప్పుడు తనను తాను కాపాడుకోలేకపోతే జీవించే హక్కునకు విలువ ఉండదని అభిప్రాయపడ్డారు. గన్ లైసెన్స్‌ నిరాకరిస్తే, ఉద్యోగం వదిలేసి ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుందని అన్నారు. ఆత్మరక్షణ కోసం ‘ఆయుధాల చట్టం-1959, నిబంధనల' ప్రకారం లైసెన్స్‌ మంజూరు చేయాలని కోరారు.

English summary
Women Lecturer Nausheen Fatima has urged to the Police for Gun license after seeing Veterinary Doctor Priyanka Reddy and Manasa murder case in Warangal. She wrote a letter to Warangal Police Commissioner Viswanath Ravinder in this connection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X