వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రవళి పరిస్థితి విషమం .. దాడిపై విద్యార్థుల రాస్తారోకో ... స్పందించిన మంత్రి ఈటెల

|
Google Oneindia TeluguNews

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వాగ్దేవి కళాశాల విద్యార్థిని రవళిపై ప్రేమోన్మాది అన్వేష్ దాడి చేశాడు. అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో 80 శాతం పైగా కాలిపోయిన యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను హైదరాబాదులోని యశోదా ఆసుపత్రికి తరలించారు. ఘాతుకానికి పాల్పడిన ప్రేమోన్మాది అన్వేష్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.

విద్యార్ధి సంఘాల రాస్తారోకో ..ప్రేమోన్మాదికి కఠిన శిక్ష వెయ్యాలి

విద్యార్ధి సంఘాల రాస్తారోకో ..ప్రేమోన్మాదికి కఠిన శిక్ష వెయ్యాలి

ప్రేమను నిరాకరించిందని పెట్రోల్ పోసి నిప్పంటించి దాడికి పాల్పడిన అన్వేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, అతనిని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు, విద్యార్ధి సంఘాలు ఎంజీఎం ఆస్పత్రి వద్ద రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే ఇటువంటి వారిపై చర్యలకు ఉపక్రమించాలని వారు డిమాండ్ చేశారు. ప్రేమ పేరుతో అత్యంత పాశవికంగా దాడులకు పాల్పడుతున్న వారిని శిక్షించాలని విద్యార్థి సంఘాలు, అటు తల్లిదండ్రులు కోరుతున్నారు.

స్పందించిన మంత్రి ఈటెల ...ఇలాంటి ఘటనలు సహించం ..మెరుగైన వైద్యం అందిస్తాం

స్పందించిన మంత్రి ఈటెల ...ఇలాంటి ఘటనలు సహించం ..మెరుగైన వైద్యం అందిస్తాం

ప్రేమోన్మాది అన్వేష్ దాడిలో 80 శాతానికి పైగా కాలిపోయి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న రవళి ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విద్యార్థిని రవళి పై జరిగిన పెట్రోల్ దాడిని ఖండించారు. ఇది అత్యంత హేయమైన చర్యగా ఆయన మాట్లాడారు. పెట్రోల్ దాడిలో గాయపడిన రవళికి మెరుగైన వైద్యం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఘటనకు పాల్పడిన వ్యక్తి కి తగిన శిక్షపడేలా చర్య తీసుకుంటామని ఈటెల రాజేందర్ తెలిపారు.

కన్నీటి పర్యంతమైన పంచాయితీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి

కన్నీటి పర్యంతమైన పంచాయితీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి

ఎంజీఎం ఆస్పత్రిలో కన్నీటి పర్యంతమవుతున్న విద్యార్థిని తల్లిదండ్రులను ఓదార్చారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఉషా దయాకర్ రావు. ప్రేమోన్మాది దాడిలో గాయాలపాలైన రవళి ని చూసి ఆమె కంటతడి పెట్టుకున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇటు హనుమకొండ నయిమ్ నగర్ లో ఉన్న వాగ్దేవి కళాశాల యాజమాన్యం , విద్యార్థులు సైతం ఈ దాడి ఘటనతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని కోరుతున్నారు.

ప్రేమోన్మాది అన్వేష్ దాడిలో గాయపడిన రవళి స్వగ్రామం వరంగల్ రూరల్ జిల్లా సంగం మండలం లోని రామచంద్ర పురం గ్రామం. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రవళి తల్లిదండ్రులు తమ బిడ్డ కోసం కన్నీటిపర్యంతం అవుతున్నారు .

English summary
Ravali, the woman who was set on fire by a stalker today morning in hanamkonda injured 80%. Ravil was severely injured in the attack and moved to Hyderabad Yashoda Hospital for better treatment. At present she is in a serious condition. the students portested and demanding that the exploitation of such attacks be severely punished.The Health Minister Etela Rajendar said that the government will not tolerate such attacks and will make it harder for those who attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X