• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సోనూసూద్ మరో సంచలనం, టెకీ శారదకు జాబ్, సోనూ తెలుగింటి అల్లుడే, అతని ఆస్తి ఎంతో తెలుసా..?

|

అడగందే అమ్మయినా పెట్టదంటారు. అవును ఏదైనా అడిగితేనే కదా ఎవరైనా ఇస్తారు.. కన్న తల్లిదండ్రులతో సహా.. ఇందులో సందేహానికి తావులేదు. మరీ అడగకుంటే ఇస్తే.. వారు దేవుడు అయి ఉండాలి. అవును కనిపించని భగవంతుడే వరాలు ఇస్తుంటారు. మరీ ఇప్పుడు ఈ నానుడి సరిగ్గా మన రియల్ హీరో సోనూ సూద్‌కు సరిపోతోంది. తన వద్ద ఉన్నంతలో సాయం చేస్తూ మిగతావారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆపద వచ్చిందంటే చాలు వారి సమస్యను ఇట్టే పరిష్కరిస్తున్నాడు. ఏపీకి చెందిన రైతు నాగేశ్వరరావుకు ట్రాక్టర్ ఇచ్చారో లేదో.. ఇప్పుడు ఓరుగల్లు టెకీ శారదకు కూడా జాబ్ ఇచ్చేశారు.

 Coronavirus: మీరే రియల్ హీరోస్, వైద్య సిబ్బందికి 'జుహూ’ హోటల్‌లో వసతి: సోనూ సూద్ Coronavirus: మీరే రియల్ హీరోస్, వైద్య సిబ్బందికి 'జుహూ’ హోటల్‌లో వసతి: సోనూ సూద్

టెకీ టు విజిటేబుల్ సెల్లర్..

టెకీ టు విజిటేబుల్ సెల్లర్..


కరోనా వైరస్ వల్ల విధించిన లాక్ డౌన్ మార్కెట్ కుదేలైపోయింది. సంస్థలు/ పరిశ్రమలకు కూడా సరైన పని లేకపోవడంతో తమ సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి. అలా వరంగల్‌కి చెందిన శారద.. సాప్ట్ వేర్ ఇంజినీర్ కానీ, ఉద్యోగం కోల్పోయింది. కానీ ఆమె కుంగిపోలేదు... బతకడానికి ఏదో ఒక పని చేసుకోవాలని అనుకొంది. కూరగాయాలు అమ్ముతూ తన ఇంటిని గడుపుతోంది. ఇంకేముంది కూరగాయాలు విక్రయిస్తూ జీవిస్తోన్న టెకీ అనే వార్త సోషల్ మీడియాలో జోరుగా వైరలైంది. ఈ విషయం కాస్తా మన హీరో సోనూసూద్ వద్దకు చేరింది.

శారదకు జాబ్ ఆఫర్


ఇంకేముంది వెంటనే తన ప్రతినిధిని సోనూసూద్.. వరంగల్ పంపించాడు. అతను శారదను ఇంటర్వ్యూ కూడా చేశాడు. శాటిస్‌పై కావడంతో ఉద్యోగం ఆఫర్ చేశాడు. ఈ విషయాన్ని సోనూసూద్ సోషల్ మీడియాలో తెలియజేశారు. తన ప్రతినిధి జాబ్ ఆఫర్ లెటర్ శారదకు అందజేశారని, జై హింద్ అని ట్వీట్ చేశారు. కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారికి కొత్త యాప్ తయారు చేయించి, అర్హతను బట్టి అందులో ఉద్యోగాలను కల్పిస్తున్నారు. అయితే బీపీఎల్ కుటుంాలకు మాత్రమే ఉద్యోగం ఇస్తారు. అందులోనే శారదకు కూడా జాబ్ కల్పించారు.

ఇదీ అతని నేపథ్యం.. మన తెలుగింటి అల్లుడే

ఇదీ అతని నేపథ్యం.. మన తెలుగింటి అల్లుడే

ఇంత మంచి పనిచేస్తున్న సోనూసూద్ ఎవరు అనే ప్రశ్న రావడం సహజం. ఆయన పంజాబ్‌కి చెందిన వ్యాపారవేత్త కుమారుడు. కానీ పంజాబ్‌లో పరిస్థితి బాగోలేకపోవడంతో వ్యాపారం చేసే వీలులేదు. నాగ్ పూర్ పంపించగా ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. తర్వాత ఎంబీఏ చేసే సమయంలో సోనాలి పరిచయమైంది. అలా వారి ప్రేమ.. పెళ్లికి దారితీసింది. సోనాలి నాగ్ పూర్‌లో సెటిలైన ఓ తెలుగు ఫ్యామిలీ.. వారి ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకరించాయి. దీంతో పెళ్లి చేసుకొన్నారు. చదువు పూర్తయ్యాక సోనూసూద్ ముంబై బాటపట్టి.. ఇండస్ట్రీలోకి వచ్చి మంచి ఆర్టిస్టుగా పేరు గడించాడు. కోట్లు కూడబెట్టి.. పేదలకు దానం చేస్తున్నాడు.

సినిమా ప్లస్ హోటల్ బిజినెస్ ద్వారా ఆస్తి ఇంత..

సినిమా ప్లస్ హోటల్ బిజినెస్ ద్వారా ఆస్తి ఇంత..

మరీ సోనూసూద్ ఆస్తులు ఎంత ఉంటాయనే ప్రశ్న కూడా వస్తోంది. దాదాపు 20 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉండి డబ్బులు పోగు చేశాడు. తెలుగు, తమిళ్, బాలీవుడ్‌లో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగాడు. దీంతోపాటు ముంబై, ప్రధాన నగరాల్లో హాటల్ బిజినెస్ కూడా ఉంది. సినీ పరిశ్రమ, హోటల్ బిజినెస్ ద్వారా అతను రూ.130 కోట్లు సంపాదించారని తెలుస్తోంది. కరోనా వైరస్ సమయంలో వివిధ వర్గాలకు రూ. 10 కోట్లు ఖర్చు చేశాడు. వందలు, వేల కోట్లు ఉన్నవారు కూడా చేయలేని పనిని.. సగటు మనిషిగా చేస్తోన్న సోనూసూద్.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలచిపోతాడు.

English summary
sonu sood offered a job to warangal techie sharada. she lost the software engineer job on the lockdown time
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X