వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిన్నారి అత్యాచారంపై అట్టుడుకుతున్న వరంగల్, అధికార పార్టీ ఎమ్మెల్యేకు నిరసన సెగ

|
Google Oneindia TeluguNews

వరంగల్ : 9 నెలల చిన్నారిపై లైంగికదాడితో వరంగల్ అట్టుడుకుతుంది. ఈ ఘటనను ఓరుగల్లు యువత ముక్తకంఠంతో ఖండిస్తోంది. నిరసనలు, ఆందోళనతో పోరుగల్లు ఓరుగల్లు మిన్నంటింది. స్థానిక ఎమ్మెల్య దాస్యం వినయ్ భాస్కర్‌ను యువత నిలదీశారు. నీచుడు ప్రవీణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు.

విద్యార్థుల కన్నెర్ర ...

అన్నెం పున్నెం తెలియని పసిపాపపై పాశవిక చర్యను విద్యార్థులు తప్పుపడుతున్నారు. వరంగల్ ఘటనను నిరసిస్తూ ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న వరంగల్‌లో యువత క్యాండిల్ ర్యాలీ తీసింది. అయితే అటుగా వెళ్తున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేను యువత ఆపారు. పసిపాప ఘటనపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. యువత అంటే ఏంటీ ఉడుకు రక్తం ర్యాలీ చేపట్టి ఊరుకుంటారా అని నిలదీశారు. ప్రవీణ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటని అడిగారు. ఇప్పటికే ఇంటర్ విద్యార్థులు చనిపోయినా స్పందించలేదు .. కీచకులు రెచ్చిపోయినా మిన్నకుండిపోయారు ... ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారు అని ఆవేశంతో రగిలిపోయారు. మరో నలుగురు చావాలా ? ఇందుకోసమేనా స్వరాష్ట్రం కోసం ఉద్యమించింది అని కడిగిపారేశారు. బంగారు తెలంగాణ తొలి ఐదేళ్లు పాలించింది మీరే .. మంచి చేస్తారని మరో ఐదేళ్లు అధికారం కట్టబెడితే చేసిందేంటీ అని మండిపడ్డారు. ఆగ్రహవేశంతో రగిలిపోయిన యువత ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నిమిలారు ఎమ్మెల్యే దాస్యం.

క్యాంపు కార్యాలయం ముట్టడి

క్యాంపు కార్యాలయం ముట్టడి

ధర్నాలు, ఆందోళనలు కాదు .. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి విద్యార్థి సంఘం పిలుపునిచ్చింది. ఆదివారం బాలసముద్రంలోని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపింది. ఇందుకోసం భారీగా జనం తరలిరావాలని కోరింది. దీంతో తమ సత్తా చాటి .. ప్రభుత్వానికి తామంటే ఏంటో తెలుపుతామని పేర్కొంది. కీచకుడు ప్రవీణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని .. అందుకోసం ఫాస్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.

 హోంమంత్రికి లేఖ ...

హోంమంత్రికి లేఖ ...

యువత తనను నిలదీయడంతో ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ స్పందించారు. పాపపై లైంగికదాడి చేసిన ప్రవీణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్ అలీని కోరారు. ఈ మేరకు రాసిన లేఖను మీడియాకు అందజేశారు. పసిపాపపై పాశవిక చర్యను ప్రస్తావించి .. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. మానవీయ కోణంలో చూసి నిందితుడిపై తక్షణమే సీరయస్ యాక్షన్ తీసుకోవాలని కోరారు.

English summary
The event is condemned by the youth of warangal. Locals are question by MLA Vinay Bhaskar. students demanded strict action against Praveen. The MLA's camp office was called for a siege on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X