• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

75 ఏళ్ళ వయసులో...భార్యపై అనుమానం..హతమార్చి, ఆపై ఆత్మహత్యాయత్నం చేసిన వృద్ధుడు

|

75 ఏళ్ల వృద్ధాప్యంలోనూ భార్యపై అనుమానంతో భర్త చేసిన దారుణం సమాజాన్ని షాక్ కి గురి చేస్తుంది. కాటికి కాళ్ళు చాపిన వయసులో వృద్ధురాలైన భార్య వివాహేతర సంబంధం నడుపుతుందని అనుమానించి ఆమెను హత్య చేసిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో సంచలనం రేపింది. భార్యను హతమార్చటమే కాకుండా తాను ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వృద్ధుడిని ఆస్పత్రికి తరలించారు.

అనుమానం పెనుభూతమై .. వృద్ధురాలైన భార్యను హతమార్చిన భర్త

అనుమానం పెనుభూతమై .. వృద్ధురాలైన భార్యను హతమార్చిన భర్త

సంఘటన వివరాల్లోకి వెళితే వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన 65 ఏళ్ల పల్నాటి చిలకమ్మను దారుణంగా హతమార్చాడు భర్త పల్నాటి బుచ్చయ్య. చిలకమ్మ బుచ్చయ్య దంపతులకు అయిదుగురు కుమార్తెలు ఒక కుమారుడు. అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇక మనవళ్లు మనవరాళ్లు కూడా పుట్టారు. అయితే ఇంత వయసు వచ్చినా బుచ్చయ్య కు భార్యపై అనుమానం మాత్రం పోలేదు . ఆమె ఎవరితో మాట్లాడిన వివాహేతర సంబంధాలు అంటగట్టి దూషించి తీవ్రంగా కొట్టేవాడు. చిలకమ్మ ఎటు వెళ్ళినా ఆమెతోపాటు వెళ్లేవాడు. ఇక పిల్లల ఇంటికి వెళ్లినా చిలకమ్మను సహించే వాడు కాదు.

 రెండుసార్లు భార్యను చంపేందుకు యత్నించిన వృద్ధుడు

రెండుసార్లు భార్యను చంపేందుకు యత్నించిన వృద్ధుడు

రోజురోజుకీ అనుమానం ఎక్కువై చిలకమ్మ ను హత్య చేసేందుకు రెండు సార్లు ప్రయత్నించాడు బుచ్చయ్య. ఓసారి ఇంటిముందు గొయ్యి తవ్వి అందులో వేసి హతమార్చాలని ప్రయత్నం చేశాడు. మరోమారు గ్యాస్ లీక్ చేసి చంపేయాలని చూశాడు .ఇక ఈ విషయాన్ని కుమార్తెలు చెప్పారు. ఇక రెండు సార్లు బుచ్చయ్య ప్రయత్నం సఫలం కాకపోవడంతో చివరికి చిలకమ్మ నిద్రిస్తున్న సమయంలో కత్తితో దాడి చేశాడు. చిలకమ్మ గొంతుకోసి ప్రాణం తీశాడు. ప్రతిఘటించిన చిలకమ్మ తీవ్రంగా గాయపరిచాడు.

భార్యను చంపి ఆత్మహత్యాయత్నం.. ఎవరో దాడి చేశారని కట్టుకథ అల్లిన వృద్ధుడు

భార్యను చంపి ఆత్మహత్యాయత్నం.. ఎవరో దాడి చేశారని కట్టుకథ అల్లిన వృద్ధుడు

ఇక చిలకమ్మ చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత తాను ఆత్మహత్య యత్నం చేశాడు బుచ్చయ్య. చిలకమ్మ హత్యకేసు తనపై పడుతుందన్న భయంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు . కానీ చనిపోయేందుకు ధైర్యం చాలక మళ్లీ మంటలను ఆర్పుకున్నాడు . తిరిగి చిలకమ్మను హతమార్చిన కత్తితోనే గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు బుచ్చయ్య. ఇక అంతేనా ఈ ఘటన బయటకు పొక్కడంతో గుర్తుతెలియని వ్యక్తులు తన భార్యను చంపేసి తనపై దాడి చేశారని కట్టుకథ అన్నాడు. ఇక కుమార్తెలు, కుమారుడు, గ్రామస్తులు బుచ్చయ్య తీరుపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కేసు నమోదు చేసిన పోలీసులు .. గాయపడిన బుచ్చయ్య ఆస్పత్రికి తరలింపు

కేసు నమోదు చేసిన పోలీసులు .. గాయపడిన బుచ్చయ్య ఆస్పత్రికి తరలింపు

గొంతు కోసుకుని గాయపడిన బుచ్చయ్య ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుమార్తెలు, కుమారుడు ఇచ్చిన సమాచారంతో బుచ్చయ్య పై కేసు నమోదు చేసిన పోలీసులు బుచ్చయ్య వైద్య చికిత్స అనంతరం ఈ కేసును సమగ్రంగా విచారించనున్నారు. ఏదేమైనా ఏడు పదుల వయసులో ఉన్న బుచ్చయ్య , 65 ఏళ్ల వయసున్న భార్య చిలకమ్మను అనుమానించడం, ఆపై హత్య గావించడం సభ్య సమాజం నివ్వెరపోయే అంశం. కాటికి కాళ్ళు చాపిన వయసులో పెళ్ళాన్ని అనుమానించిన సదరు వృద్ధుడు చేసిన హత్యోదంతం అందరినీ షాక్ కు గురి చేస్తుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The 65-year-old Palnati Chilakamma of the Neralla village of Kamlapur Mandaram, Warangal Urban District, has been brutally murdered by her husband, Palnati Buchaiah. Buchaiah attacked with a knife while Chilakamma was asleep.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more