వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

9మంది వలస కార్మికుల డెత్ మిస్టరీ .. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కీలక విషయాలు

|
Google Oneindia TeluguNews

వరంగల్ లో గొర్రెకుంట ఇండస్ట్రియల్ ఏరియాలో బావిలో శవాలై తేలిన 9 మంది వలస కార్మికుల మరణాల మిస్టరీలో మృతుల మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయింది . ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 9 మంది బావిలో శవాలై తేలటం, ఇక ఈ కేసులో ఏం జరిగిందో ఇంకా అంతు చిక్కకపోవటంతో పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకంగా మారింది .

పోలీసులకు సవాల్ గా ..9మంది వలస కార్మికుల డెత్ మిస్టరీ ..కీలకంగా కండోమ్ ప్యాకెట్లు , బర్త్ డే పార్టీపోలీసులకు సవాల్ గా ..9మంది వలస కార్మికుల డెత్ మిస్టరీ ..కీలకంగా కండోమ్ ప్యాకెట్లు , బర్త్ డే పార్టీ

 మృతుల్లో నలుగురి ఒంటి మీద గాయాలు

మృతుల్లో నలుగురి ఒంటి మీద గాయాలు

ఇక ఇదే సమయంలో పోస్ట్ మార్టం నివేదికల్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. మృతుల్లో నలుగురి ఒంటి మీద గాయాలు ఉన్నట్టు గుర్తించారు వైద్య నిపుణులు . ఇక అంతే కాదు ఘటన జరగటానికి ముందు పెనుగులాట జరిగి ఉంటుందని భావిస్తున్నామని పోస్ట్ మార్టం చేసిన వైద్యులు చెప్తున్నారు. పోస్ట్ మార్టం వివరాలు చెప్పిన ఎంజీఎం మార్చురీ ఫోరెన్సిక్ విభాగం హెడ్ డాక్టర్ . రజామాలిక్ ఇక ఊపిరితిత్తుల్లో నీరు చేరటం వల్లనే తొమ్మిది మంది మృతి చెందారని చెప్తున్నారు .

 బావిలో పడే వరకు ప్రాణాలతోనే .. ఫోరెన్సిక్ ల్యాబ్ కు శాంపిల్స్

బావిలో పడే వరకు ప్రాణాలతోనే .. ఫోరెన్సిక్ ల్యాబ్ కు శాంపిల్స్

ఇక బావిలో పడే వరకు అందరూ ప్రాణాలతోనే ఉన్నారని , చనిపోయాక బావిలో పడేసిన వాళ్ళు ఎవరూ లేరని, అందరూ బావిలోనే తుది శ్వాస విడిచారని పేర్కొన్నారు . ఇక వీరి మీద ఏమైనా విష ప్రయోగం జరిగిందా ? ఇక వాళ్ళంత వాళ్ళే దూకారా ? లేదా ఎవరైనా తోశారా ? అన్నది తెలియాల్సి ఉంది. వారికి ఫుడ్ పాయిజన్ ఏమైనా జరిగిందా అన్న విషయానికి సంబంధించి నమూనాలు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్టు చెప్పారు పోస్ట్ మార్టం చేసిన వైద్యులు. ఇక ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చే సరికి పది నుండి పదిహేను రోజుల స‌మ‌యం పడుతుందని చెప్తున్నారు.

Recommended Video

Kim Jong-un Faked His Own Death To Expose Traitors In His Inner Circle
కాల్స్ డేటా , అదుపులోకి తీసుకున్న నిందితుల ఆధారంగా పోలీసుల దర్యాప్తు

కాల్స్ డేటా , అదుపులోకి తీసుకున్న నిందితుల ఆధారంగా పోలీసుల దర్యాప్తు


ఇక మరోవైపు ఈ కేసులో ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక అంతేకాదు మృతుల్లో ఏడుగురి సెల్ ఫోన్లు క‌నిపించ‌క‌పోవ‌డంతో వాటి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మక్సూద్ త‌న‌య‌ బుస్రాతో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని అనుమానిస్తోన్న‌ యాకూబ్ అనే వ్యక్తి ఫోన్ కాల్స్‌తో పాటుగా , ఇక ఘటన జరిగిన రోజు ఇతరులతో మక్సూద్ ఏం మాట్లాడ‌నే విష‌యాల‌పై కూడా పోలీసులు ఫోక‌స్ పెట్టారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే అదుపులో ఉన్న అనుమానితుడు యాకూబ్‌ను, అతడితోపాటు బీహార్‌కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇవి మాస్ సూసైడ్స్ కావని పోస్ట్ మార్టం నివేదికల ద్వారా కాస్త క్లారిటీ వచ్చింది. అయితే ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే అసలేం జరిగిందో పూర్తిగా తెలిసే అవకాశం ఉంది .

English summary
Interesting facts have emerged in the post mortem reports on the deaths of 9 migrant workers. Four of the dead were found to have injuries on their bodies by medical professionals. Doctors who have performed the post mortem say that the scramble is expected to occur before the deaths. Head of the MGM Mortuary Forensic Department who gave the post mortem details. Nine people are said to have died due to water accumulation in the lungs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X