వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం - బావిలోకి దూసుకెళ్లిన జీపు - ప్రయాణికుల కోసం గాలింపు

|
Google Oneindia TeluguNews

వరంగల్ రూరల్ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 15 మంది ప్రయాణికులతో వరంగల్ సిటీ నుంచి నెక్కొండకు బయలుదేరిన జీపు.. సంగెం మండ‌ల పరిధిలోని గ‌విచ‌ర్ల వ‌ద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. పైన ఎలాంటి సేఫ్టీ వాల్ లేకపోవడం, ఇటీవల కురిసిన వర్షాలకు బావి నిండిఉండటంతో పడటంతోనే అందరూ నీటమునిగారు.

Vehicle with 15 passengers falls into roadside open well near Warangal

అంకిదాస్ ఔట్ - ఫేస్‌బుక్-బీజేపీ ఉదంతంలో ట్విస్ట్ - పబ్లిక్ పాలసీ డైరెక్టర్ పదవికి రాజీనామాఅంకిదాస్ ఔట్ - ఫేస్‌బుక్-బీజేపీ ఉదంతంలో ట్విస్ట్ - పబ్లిక్ పాలసీ డైరెక్టర్ పదవికి రాజీనామా

ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే స్థానికులు రంగంలోకి దిగి.. ప్రయాణికులను కాపాడారు. 15 మందికిగానూ 12 మందిని స్థానికులు కాపాడగలిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు రెస్క్యూ టీమ్స్ తో ఘటనా స్థలికి చేరుకున్నారు. గల్లంతైన మరో ముగ్గురు ప్రయాణికుల కోసం గాలింపు చర్య కొనసాగుతున్నది. ప్రమాదం చోటుచేసుకున్న బావి పక్కనే ప్రభుత్వ స్కూలు కూడా ఉండటం గమనార్హం.

Vehicle with 15 passengers falls into roadside open well near Warangal

కాగా, జేసీబీ సాయంతో జీపును బయటికి తీసి, గల్లంతైన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. స్థానికులు కాపాడిన 12 మందిలో కొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే జీపు అదుపుతప్పి ఉంటుందని భావిస్తున్నారు.

చైనా ఉక్కిరిబిక్కిరి - భారత్-అమెరికా దోస్తీ ఎఫెక్ట్ - శత్రుత్వ బీజాలు నాటొద్దంటూ అక్కసుచైనా ఉక్కిరిబిక్కిరి - భారత్-అమెరికా దోస్తీ ఎఫెక్ట్ - శత్రుత్వ బీజాలు నాటొద్దంటూ అక్కసు

Vehicle with 15 passengers falls into roadside open well near Warangal
English summary
A Jeep with about 15 passengers fell into a roadside open well at Government Model School near Gaviherla village of Sangam mandal in warangal rural district, about 13 km away from Warangal city on Tuesday. While 12 passengers were rescued, search operations are on to trace out the remaining three. An earth digger has been pressed into service to take out the vehicle. The accident took place when the Jeep was proceeding to Nekkonda town from Warangal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X