వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రత్యేక పాఠాలు చెప్తానంటూ వరంగల్ లో అధ్యాపకుడి రోత పనులు , అసభ్య మెసేజ్ లు

|
Google Oneindia TeluguNews

విద్యార్థినులకు అసభ్య సందేశాలు పంపుతూ వేధిస్తున్నాడని ఓ అధ్యాపకుడిని అరెస్ట్ చేశారు వరంగల్ షీ టీం పోలీసులు. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న రంజిత్ కుమార్ అనే వ్యక్తి వాట్సాప్ మెసేజ్ ల ద్వారా విద్యార్థులతో అసభ్యంగా మాట్లాడుతున్నాడు. రోత పనులు చేస్తున్నాడు. ఒక విద్యార్థిని ఫిర్యాదు తో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

ములుగు జిల్లా ఇంచర్ల గ్రామానికి చెందిన రంజిత్ కుమార్ హనుమకొండ నుండి ఒక ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. అయితే అదే కళాశాలలో చదువుతున్న కొందరు విద్యార్థులు చదువులో వెనుకబడి ఉండటం తో వారికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తానని చెప్పి వారికి తన సెల్ నెంబర్ ఇచ్చారు. సందేహాల కోసం ఫోన్ చేసిన విద్యార్థినులతో క్రమంగా అసభ్య సందేశాలను పంపడం, అభ్యంతరకర పోస్ట్ లను పెట్టడం తో పాటుగా, వారిని లైంగిక వేధింపులకు గురిచేశాడు రంజిత్ కుమార్.

vulgar messages to students by lecturer in warangal

అధ్యాపకుడి తీరుతో విసిగిపోయిన బాధిత విద్యార్థిని తల్లిదండ్రుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకు రావడంతో తల్లిదండ్రులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నంబర్ కు ఫిర్యాదు చేశారు.

దీంతో వరంగల్ షీ టీమ్ పోలీసులు వరంగల్ పోలీస్ కమీషనర్ రవీందర్ ఆదేశాల మేరకు కళాశాల సిబ్బందిని, విద్యార్థులను విచారించారు. సదరు అధ్యాపకుడి ప్రవర్తన పై ఆరా తీశారు. విద్యార్థులు చేసిన ఫిర్యాదు కరెక్ట్ అని నిర్ధారణ కావడంతో సదరు అధ్యాపకుడిని అరెస్టు చేశారు. అంతేకాదు మహిళలు విద్యార్థినులపై ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే తాట తీస్తాం అని హెచ్చరిస్తున్నారు వరంగల్ పోలీస్ కమీషనరేట్ పోలీసులు.

అనంత రైతన్న ఆగ్రహం .. వేరుశనగ విత్తనాల కోసం రోడ్ పై బైఠాయించి పోరాటంఅనంత రైతన్న ఆగ్రహం .. వేరుశనగ విత్తనాల కోసం రోడ్ పై బైఠాయించి పోరాటం

English summary
Ranjit Kumar, from the village of Incharla in Mulluga district, is working as a lecturer in a private college in Hanamkonda. However, the lecturer gave his cell number to some students in the same college saying that they would be taking special classes with them lagging behind. Ranjit Kumar has been accused of sexually harassing students, regularly sending obscene messages and objectionable posts with students who have phoned him for suspicion.A student complained about his messages and the police arrested him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X