వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భూ వివాదాల జోలికి పోకండి .. ఆ రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ పెట్టండి : వరంగల్ సీపీ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హన్మకొండ సీఐ ఒక భూ వివాదంలో తలదూర్చి బెదిరింపులకు పాల్పడిన నేపధ్యంలో ఆయనపై వేటు వేసి , కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే . ఇక ఈ క్రమంలో పోలీసులకు భూ వివాదాల్లో జోక్యం చేసుకోవద్దని వార్నింగ్ ఇచ్చిన సీపీ ప్రమోద్ కుమార్ భూ వివాదాల విషయంలో శాంతి భద్రతల సమస్య వస్తే సదరు వ్యక్తులను బైండోవర్ చెయ్యాలని మాత్రమే పేర్కొన్నారు .వరంగల్ కమీషనరేట్ పరిధిలో చాలా పోలీస్ స్టేషన్ లలో భూ వివాదాలకు సంబంధించిన సెటిల్ మెంట్లు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపధ్యంలో సీపీ పోలీసులకు ల్యాండ్ డిస్ప్యూట్స్ జోలికి వెళ్లొద్దు అని వార్నింగ్ ఇచ్చారు .

 భూవివాదంలో జోక్యం చేసుకుని బెదిరింపులు ... సిఐ పై కేసు నమోదు, ఏఆర్‌ విభాగానికి అటాచ్‌ భూవివాదంలో జోక్యం చేసుకుని బెదిరింపులు ... సిఐ పై కేసు నమోదు, ఏఆర్‌ విభాగానికి అటాచ్‌

భూ వివాదాల్లో తలదూర్చవద్దని పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన వరంగల్ పోలీస్ కమిషనర్

భూ వివాదాల్లో తలదూర్చవద్దని పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన వరంగల్ పోలీస్ కమిషనర్


పోలీస్ అధికారులు ఎట్టి పరిస్థితుల్లోను భూ వివాదాల్లో తలదూర్చవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించిన సీపీ సివిల్ తగాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు . వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అధికారుల పనితీరును మరింత మెరుగుపర్చడంతో పాటు ప్రజలకు పోలీసులు మరింత దగ్గరయ్యేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ నేడు పోలీస్ ఆధికారులకు పలుసూచనలు చేశారు.

 భూ వివాదాల్లో తల దూరిస్తే చిక్కుల్లో పడతారని హెచ్చరిక

భూ వివాదాల్లో తల దూరిస్తే చిక్కుల్లో పడతారని హెచ్చరిక

వీలైనంత వరకు సివిల్ మరియు భూ వివాదాలకు పోలీసు అధికారులు దూరంగా ఉండాలని చెప్పారు . ఒక వేళ ఎవరైనా పోలీస్ అధికారులు భూ తగాదాల్లో తలదూర్చితే చిక్కుల్లో పడుతారని హెచ్చరించారు . ఈ సమస్యల నుండి మిమ్మల్ని అధికారులు తప్పించే ప్రయత్నం చేసినా కోర్టు నుండి తప్పించుకోలేరని, ఇది గుర్తించి అధికారులు భూ తగాదాల జోలికి పోవడం మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు . ఒక వేళ ఎవరైనా భూ సమస్య సంబంధించి ఫిర్యాదులు చేస్త వాటిని ఇరువర్గాల వారు వీలైనంత వరకు కోర్టులో పరిష్కరించుకోవాల్సిందిగా ఫిర్యాదుదారులకు పోలీసు అధికారులు సూచించాల్సి వుంటుందని ఆయన పేర్కొన్నారు .

Recommended Video

Telangana Floods: Bhadrachalam Godavari Crosses Third Danger Warning | Oneindia Telugu
 భూతగాదాల్లో మధ్యవర్తిత్వం చేసే రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ పెట్టాలన్న సీపీ

భూతగాదాల్లో మధ్యవర్తిత్వం చేసే రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ పెట్టాలన్న సీపీ


ముఖ్యంగా భూ తగాదాల్లో మధ్యవర్తిత్వం చేసే రౌడీ షీటర్ల పట్ల పోలీస్ అధికారులు కఠినంగా వ్యహరించాల్సి వుంటుందని అన్నారు . వారిపై పీడీ యాక్ట్ క్రింద కేసులు నమోదు చెయ్యాలని చెప్పారు .నకీలీ దస్తావేజులతో చాలా మంది భూ కజ్జాలకు పాల్పడుతున్నారని , ఈ నకిలీ దస్తావేజులను తయారు చేసే వ్యక్తులను సైతం పోలీస్ ఆధికారులు గుర్తించాల్సిన అవసరం వుందని పేర్కొన్నారు . గతంలో ఇలాంటి నకిలీ దస్తావేజులు తయారీకి పాల్పడిన వ్యక్తులతో పాటు, ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇలాంటి దస్తావేజుల తయారీకి పాల్పడుతున్న వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సేకరించాలని, ఈ నకిలీ దస్తావేజుల గ్యాంగ్ కు చెక్ పెట్టాలని పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ అధికారులను ఆదేశించారు.

English summary
Warangal police commissionarate CP Pramod Kumar, who had warned the police not to interfere in land disputes, only said that if there was a law and order problem issue in the land disputes, the accused should be bindover.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X