• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

warangal murders mystery : సైకిల్ సవారీనే సంజయ్ ను పట్టించింది .. హంతకుడి ఫోన్ లో షాకింగ్

|

వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంట ఇండస్ట్రియల్ ఏరియాలో చోటుచేసుకున్న 9 మంది వలస కార్మికుల దారుణ హత్యకేసులో ఒళ్ళు జలదరించే విషయాలు వెలుగులోకి వచ్చాయి . 24 ఏళ్ళ సంజయ్ కుమార్ యాదవ్ గొర్రెకుంటలో హతమార్చిన తొమ్మిది మందినే కాక అంతకు మందు రఫీకా అనే మరో మహిళను హతమార్చినట్టు పోలీస్ కమీషనర్ పేర్కొన్నారు. మొత్తం 10 హత్యలు చేసిన సంజయ్ కుమార్ యాదవ్ నేరప్రవృత్తి ఎలాంటిదో తెలుసుకోవటానికి అతని మొబైల్ సాక్ష్యంగా నిలిచింది .

ఇంటర్నెట్ వినియోగంలో దిట్ట సంజయ్ కుమార్ యాదవ్

ఇంటర్నెట్ వినియోగంలో దిట్ట సంజయ్ కుమార్ యాదవ్

వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో తొమ్మిది మందిని బావిలో పడేసి హతమార్చిన నరరూప రాక్షసుడు సంజయ్ కుమార్ యాదవ్ విచారించే కొద్దీ పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఇక అతనిలో పది మందిని చంపిన భయం కానీ, బాధ కాని, పశ్చాత్తాపం కనిపించకపోవడం పోలీసులకి షాకింగ్ గా అనిపించింది. ఏమాత్రం చదువుకోకపోయినా,విద్యా జ్ఞానం లేకపోయినా, ఇంటర్నెట్ వాడకంలో దిట్ట అయిన సంజయ్ కుమార్ యాదవ్ ఇన్ని హత్యలను చేయడానికి ఇంటర్నెట్ వినియోగించినట్లు గా తెలుస్తుంది.

విచారణ చేస్తున్నాం .. 9మంది వలస కార్మికుల మరణాలు విషాదకరం : మంత్రి ఎర్రబెల్లి

 గతంలో ఢిల్లీలో సెల్ రిపేర్ షాప్ లో పని చేసిన నేరస్థుడు

గతంలో ఢిల్లీలో సెల్ రిపేర్ షాప్ లో పని చేసిన నేరస్థుడు

బీహార్ రాష్ట్రంలోని బిగుసరయి జిల్లా నుర్లపూర్‌ లో పుట్టిన సంజయ్‌ చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిపోయి చాలా కాలం తర్వాత తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇక ఈ మధ్య కాలంలో ఢిల్లీలోని ఒక సెల్‌ ఫోన్‌ రిపేర్‌ షాపులో సంజయ్‌ పనిచేశాడు. అక్కడ పనిచేసిన అనుభవం ఈ హత్యల విషయంలో ఉపయోగపదిందని తెలుస్తుంది. ఇక హత్యలు చేయడానికి కావలసిన సమాచారాన్ని గూగుల్‌ వాయిస్‌ అసిస్టెంట్‌ టూల్‌ లోని 'ఓకే..గూగుల్‌' ఆప్షన్‌ ద్వారానే తెలుసుకున్నట్లుగా అతని సెల్ ఫోన్ సెర్చ్ హిస్టరీ చెబుతుంది.

గూగుల్‌ వాయిస్ టూల్ ద్వారానే అన్ని విషయాలు తెలుసుకున్న హంతకుడు

గూగుల్‌ వాయిస్ టూల్ ద్వారానే అన్ని విషయాలు తెలుసుకున్న హంతకుడు

తొమ్మిది మందిని హతమార్చడం కోసం ప్లాన్ చేసిన సంజయ్ కుమార్ యాదవ్ గూగుల్‌ వాయిస్ టూల్ ద్వారానే ఎక్కువ కాలం మత్తునిచ్చే టాబ్లెట్ల పేర్లు ఏమిటో అవి తెలుసుకుని వాటిని కొనుగోలు చేసి తినే ఆహార పదార్థాల్లో కలిపి మత్తులో జారుకున్న తర్వాత ఈ హత్యలు చేసినట్టు పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్టు సమాచారం. అయితే సంజయ్ కుమార్ యాదవ్ కు అన్ని మత్తు టాబ్లెట్స్ మెడికల్ షాప్ వాళ్ళు ఎలా అమ్మారు అన్నది కూడా ప్రశ్నే. ఇక సంజయ్ సెల్ ఫోన్ లో ఉన్న సెర్చ్ హిస్టరీ చూసిన పోలీసులు షాక్ తిన్నారు.

 మొబైల్ సెర్చ్ హిస్టరీ అంతా నేర పూరిత అంశాలు, బ్లూ ఫిలిమ్స్

మొబైల్ సెర్చ్ హిస్టరీ అంతా నేర పూరిత అంశాలు, బ్లూ ఫిలిమ్స్

అతని మొబైల్ సెర్చ్ హిస్టరీ అంతా నేర పూరిత అంశాలు, బ్లూ ఫిలిమ్స్ తోనే నిండి ఉందని సమాచారం. చాలా మంది మహిళలతో అతడు వివాహేతర సంబంధాలు కొనసాగించినట్లుగా మొబైల్ ఆధారంగా తెలుస్తోంది. అంతేకాదు మహిళలతో అతను బెడ్‌ రూమ్‌ లో ఉన్న ఫోటోలు, నెట్‌ లో డౌన్‌లోడ్‌ చేసిన అశ్లీల వీడియోలు వందల కొద్దీ ఆ ఫోన్ లో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.ఇక ఈ కేసులో కీలకంగా మరి సంజయ్ పట్టించింది మాత్రం అతను చేసిన సైకిల్ సవారీ.

 సంజయ్ ను పట్టించిన సైకిల్ సవారీ

సంజయ్ ను పట్టించిన సైకిల్ సవారీ

హత్యకు కొద్ది రోజుల ముందు నుండి మక్సూద్ నివాసం ఉంటున్న గోదాం దగ్గరకు సంజయ్ కుమార్ యాదవ్ నిత్య సైకిల్ మీద వస్తూపోతూ ఉండేవాడు. ఇక హత్యలు జరిగిన రోజు కూడా జరిగిన బర్త్ డే పార్టీకి సంజయ్ కుమార్ యాదవ్ సైకిల్ మీద వచ్చాడు. హత్య జరిగిన తర్వాత రోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో సంజయ్ కుమార్ యాదవ్ సైకిల్ మీదనే గోదాం నుండి బయటకు వెళ్ళినట్లుగా సీసీ టీవీ ఫుటేజ్ లో గుర్తించారు పోలీసులు. అతనికి సైకిల్ సవారీ మీద ఉన్న మోజు పోలీసులకి పట్టుబడేలా చేసింది. అలా సీసీ కెమెరాల్లో రికార్డయిన ఆ సైకిల్ సవారీయే సంజయ్ కుమార్ యాదవ్ ను పట్టుకోవడంలో పోలీసులకు కీలకంగా మారింది.

English summary
Sanjay Kumar Yadav, a murderer in the Warangal industrial area, has been a most dangerous criminal according to police. sanjay kumar yadav's mobile search history,including crime scenes and blue films. The key to the case was Sanjay's bicycle riding.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more