వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరంగల్ తొమ్మిది హత్యల కేసు: ఉరిశిక్ష పడ్డ ముద్దాయికి మైనర్ పై లైంగిక వేధింపుల కేసులో జీవిత ఖైదు

|
Google Oneindia TeluguNews

వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంట ఇండస్ట్రియల్ ఏరియాలో 9 మంది హత్యకు గురైన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే .

తొమ్మిది మందిని సజీవంగా బావిలో పడవేసి హత్యచేసిన కేసు నిందితుడు సంజయ్ కుమార్ కు మరో కేసులో జీవిత ఖైదు ను ఖరారు చేసింది కోర్టు. ఇప్పటికే వరంగల్ గొర్రెకుంట లో తొమ్మిదిమందిని హత్య చేసి బావి లో పడేసిన నిందితుడు సంజయ్ కుమార్ కు కోర్టు ఉరి శిక్ష విధించింది .

సంజయ్ కుమార్ కి అక్టోబర్ 28న ఉరి శిక్ష విధించిన కోర్టు

సంజయ్ కుమార్ కి అక్టోబర్ 28న ఉరి శిక్ష విధించిన కోర్టు


రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట లోని జిన్నింగ్ మిల్లు లో ఉన్న తొమ్మిది మందికి ఆహారం లో మత్తు మాత్రలు కలిపి సజీవంగా వ్యవసాయ బావిలో పడవేసి హత్యచేసిన ఘటనలో ముద్దాయి అయిన సంజయ్ కుమార్ కి అక్టోబర్ 28వ తేదీన జిల్లా కోర్టు ఉరి శిక్ష విధించింది.

అయితే తాజాగా అసలు ఈ తొమ్మిది మరణాలకు ముందు రఫీక అనే వివాహితను లైంగికంగా వాడుకొని ఆమె కూతురుపై లైంగిక దాడికి పాల్పడుతూ , మార్చి నెలలో రఫీకను ట్రైన్ నుంచి కిందకి తోసి హతమార్చాడు నిందితుడు సంజయ్ కుమార్ .

9 హత్యలకు ముందు మరోహత్య చేసిన సంజయ్ .. మైనర్ బాలికపై లైంగిక వేధింపులు కూడా

9 హత్యలకు ముందు మరోహత్య చేసిన సంజయ్ .. మైనర్ బాలికపై లైంగిక వేధింపులు కూడా

గొర్రెకుంట లో తొమ్మిది మంది హత్యల తర్వాత , ఆ హత్యలకు కారణంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రఫీక కుమార్తె మైనర్ కావడంతో వరుసగా కొన్ని నెలలపాటు పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన నేపథ్యంలో మానవ మృగం సంజయ్ కుమార్ పై గీసుగొండ పోలీస్ స్టేషన్ లో పోక్సో చట్టం క్రింద కేసు నమోదైంది. ఆ తర్వాత పోలీసులు బాలికను పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించగా, టెస్టుల్లో మైనర్ బాలిక గర్భవతి అని తేలింది. దీంతో పోలీసులు , కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు, వైద్యుల సూచన మేరకు బాలికకు అబార్షన్ చేయించారు.

మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి జీవిత ఖైదు

మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి జీవిత ఖైదు


ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు గురి చేసిన కారణంగా సంజయ్ కుమార్ కు జీవిత ఖైదు విధించింది.
గీసుకొండలో 9 హత్యలను చేసిన నేరస్థుడు , అంతకుముందు రఫీక అనే వివాహితను రైలు నుంచి తోసి హతమార్చాడు. దీంతో అతని హత్యల సంఖ్య 10 కాగా , మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. గొర్రె గుంటలో తొమ్మిది మంది హత్య కేసును ఛేదించిన పోలీసులు, త్వరితగతిన సంజయ్ కుమార్ కు శిక్ష పడేలా చేశారు.

 ఈ కేసులో కీలకంగా పని చేసిన పోలీసులను అభినందించిన పోలీస్ కమీషనర్

ఈ కేసులో కీలకంగా పని చేసిన పోలీసులను అభినందించిన పోలీస్ కమీషనర్


ఇక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యవహారంలోనూ ముద్దాయి సంజయ్ కుమార్ కు శిక్షపడేలా చేశారు . ఈరోజు కోర్టు సంజయ్ కుమార్ కు ఈ కేసులో జీవిత ఖైదు విధించింది . ఈ కేసును త్వరగా చేదించిన, కోర్టు ముందు నిందితుడిని దోషిగా నిలబెట్టే సాక్ష్యాలను అందించిన పోలీసులను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు. నేరాల నియంత్రణ కోసం త్వరితగతిన నేరస్తులకు శిక్షపడేలా చేయాలని పలువురు వరంగల్ వాసులు పోలీసుల చర్యలను అభినందిస్తున్నారు.

English summary
The killing of 9 people in Gorrekunta industrial area in Warangal rural district has created a sensation across the state. Sanjay Kumar has been sentenced to life imprisonment in another case for sexual harassment on a minor girl. The court has already sentenced Sanjay Kumar to death for killing nine people in Warangal Gorrekunta and dumping them in a well.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X