వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరదలు తగ్గటంతో శాంతించిన ఓరుగల్లు ... నాలాల కబ్జాలపై శాంతించని ఓరుగల్లు వాసులు

|
Google Oneindia TeluguNews

వరదలు తాకిడితో ముంపునకు గురైన ఓరుగల్లులో వర్షం తగ్గుముఖం పట్టడంతో ఓరుగల్లు శాంతించింది. జనజీవనం ఇప్పుడిప్పుడే సాధారంగా మారుతుంది. కానీ ఓరుగల్లు వాసులు ముంపు ప్రధాన కారణమైన నాలాల కబ్జాలపై, కబ్జాదారుల పై ఇంకా చర్యలు తీసుకోని ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరుగుతున్నారు. అధికార పార్టీ నాయకులే కబ్జాదారులని పలువురు ఆరోపిస్తున్నారు.

ముంపులోనే ఓరుగల్లు ... చరిత్రలోనే మొదటిసారి .. వేలాది ప్రజల కన్నీటి వరదముంపులోనే ఓరుగల్లు ... చరిత్రలోనే మొదటిసారి .. వేలాది ప్రజల కన్నీటి వరద

వరదలు తగ్గినా ప్రజల్లో తగ్గని ఆగ్రహం .. నాలాల కబ్జాలపై ఓరుగల్లు వాసుల అసహనం

వరదలు తగ్గినా ప్రజల్లో తగ్గని ఆగ్రహం .. నాలాల కబ్జాలపై ఓరుగల్లు వాసుల అసహనం

వర్షాలు తగ్గుముఖం పట్టటంతో ఓరుగల్లు శాంతించినా ఓరుగల్లు వాసులు మాత్రం ఇంకా శాంతించలేదు.

గత 15 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా చాలావరకు ముంపునకు గురైంది. ముఖ్యంగా వరంగల్ నగరం ఒక చెరువును తలపించింది. గతంలో ఎప్పుడూ ఎరుగని విధంగా ముంపుకు గురైంది . నగరంలో ఉన్న నాలాల కబ్జా కారణంగా నగరంలోని సగం కాలనీలు ముంపుకు గురయ్యాయి. ప్రజలు నిరాశ్రయులయ్యారు.

నాలాల కబ్జాల కూల్చివేతకు మంత్రి కేటీఆర్ ఆదేశం .. నెలరోజుల్లోనే కూల్చివేతలు

నాలాల కబ్జాల కూల్చివేతకు మంత్రి కేటీఆర్ ఆదేశం .. నెలరోజుల్లోనే కూల్చివేతలు

మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా నాలాల కబ్జాలను నిర్మొహమాటంగా తొలగించాలని పేర్కొన్నారు.యుద్ధ ప్రాతిపదికన నెల రోజుల్లోనే కబ్జాలను కూల్చివేసి, నాలాలకు బౌండరీలు నిర్ణయించి గోడలు కట్టాలని ఆదేశించారు. కబ్జాల కూల్చివేత ప్రక్రియ మొదలుపెట్టిన అధికారులు నెలరోజుల్లో కూల్చివేతలు పూర్తి చేసి నాలాలను యధాతధ స్థితికి తీసుకువస్తామని అంటున్నారు.కానీ ఎమ్మెల్యేలు, ఎంపీ కి అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్ళే కబ్జాదారులని , వారి ఆక్రమణలు తొలగించటం అంత ఈజీ కాదని స్థానికులు అంటున్నారు.

కబ్జాలకు అధికార పార్టీనే కారణం .. రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే కబ్జాలు

కబ్జాలకు అధికార పార్టీనే కారణం .. రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే కబ్జాలు

కబ్జాలకు కారణం అధికార పార్టీ నేనని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.

అధికార పార్టీ అండదండలతోనే చాలావరకు కబ్జాలు జరిగాయని ప్రతిపక్ష పార్టీలు ఆధారాలతో సహా చూపిస్తున్నాయి. రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే కబ్జాలు జరిగాయని ఓరుగల్లు వాసులు ఆరోపిస్తున్నారు. గతంలో వరదలు వచ్చిన సమయంలో కూడా నాలాల కబ్జాల కారణంగానే వరదలు వచ్చాయని అధికారులు హడావుడిగా కూల్చివేతలు కొనసాగించారు. ఇక అధికార పార్టీ ఒత్తిడితో నాలాలపై ఉన్నప్పటికీ కొన్ని భవనాల జోలికి పోలేదు . ఇప్పుడు మరోమారు నగరం మునిగిపోవడంతో నాలాల కబ్జాలు ప్రధాన కారణమని ప్రజలు మండిపడుతున్నారు.

వరదల సమయంలో కూల్చివేతలు ... మళ్ళీ నిర్మాణాలు చేస్తున్నా పట్టించుకోని అధికారులు

వరదల సమయంలో కూల్చివేతలు ... మళ్ళీ నిర్మాణాలు చేస్తున్నా పట్టించుకోని అధికారులు

కూల్చివేతలతో మమ అనిపించి, నాలుగు రోజుల తర్వాత తిరిగి నిర్మాణాలు చేపడితే తిరిగి చోద్యం చూస్తున్న అధికారులు తీరు, ప్రజాప్రతినిధులుగా స్పందించాల్సిన వారు మౌనంగా ఉంటున్న పరిస్థితులు తిరిగి సామాన్య ప్రజలు ముంపుకు గురి కావడానికి కారణమవుతున్నాయి. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కబ్జాలు చేసిన వారు ఎంతటివారైనా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు , ప్రజాప్రతినిధులు ఎవరి లాభం కోసం వారు మౌనం వహించడం వల్లే తమకు దారుణమైన పరిస్థితులు వస్తున్నాయని వారంటున్నారు.

Recommended Video

Floods: ప్రమాదకరస్థాయిలో రామప్ప చెరువు,కోనా రెడ్డి చెరువు కు గండి ! పోటెత్తుతున్న వరద నీరు...!!
ఈసారైనా కబ్జాలకు పూర్తి స్థాయిలో చెక్ పడుతుందో లేదో ?

ఈసారైనా కబ్జాలకు పూర్తి స్థాయిలో చెక్ పడుతుందో లేదో ?


ఈసారైనా ఈ కబ్జాలకు పూర్తి స్థాయిలో చెక్ పెడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఓరుగల్లును ముంచెత్తిన వరదలు శాంతించినా ఈ సారి వరదల వల్ల ముంపుకు గురై తీవ్ర ఇబ్బంది పడిన వారు ప్రభుత్వం నాలాల కబ్జాదారులపై చర్యలు తీసుకోకపోతే శాంతించే పరిస్థితి కనిపించటం లేదు . మరి చాలా సీరియస్ గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి మరీ నాలాల కబ్జాలపై కొరడా ఝుళిపించాలని ఆదేశించిన మంత్రి కేటీఆర్ నిర్ణయాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో .. కబ్జాలకు చెక్ పడుతుందో లేదో వేచి చూడాలి .

English summary
Although the warangal has calmed down as the rains have subsided, the people of warangal have not yet calmed down about the encrochments of drainages .The joint Warangal district has been inundated for the last 15 days with continuous rains. The city of Warangal in particular looks like a pond. It was flooded like never before. Half the colonies in the city were submerged due to the encroachments of the canals in the city. People became homeless. That is why the people of Orugallu are very serious about the drainages encrochments .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X