• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

విచారణ చేస్తున్నాం .. 9మంది వలస కార్మికుల మరణాలు విషాదకరం : మంత్రి ఎర్రబెల్లి

|

వ‌రంగ‌ల్ న‌గ‌ర శివారు గొర్రెకుంట బావిలో శవాలుగా తేలిన 9 మంది వలస కార్మికుల మృతి ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టామ‌ని, అసలు విషయం ఏమిటో తెలిశాక చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఈ ఘటన అత్యంత విషాదకరం అని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలు కోరుకున్న విధంగా ఇక్క‌డే అంతిమ క్రియ‌లు చేయ‌డం కానీ, కావాలంటే వారి వారి సొంతూళ్ళ‌కు వాళ్ళ‌ మృతదేహాలు పంపించడం కానీ చేస్తామ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు స్పష్టం చేశారు .

ఆ బావిలో 9 శవాలు.. వరంగల్ లో వలస విషాదం ... వలస కార్మిక మరణాల మిస్టరీ ఏంటి ?

గొర్రెకుంట వలస కూలీల మరణాల ఘటన నేపధ్యంలో ఎంజీఎంకు వెళ్ళిన మంత్రి

గొర్రెకుంట వలస కూలీల మరణాల ఘటన నేపధ్యంలో ఎంజీఎంకు వెళ్ళిన మంత్రి

గొర్రెకుంటలో బావిలో మృతి చెందిన మృతుల శ‌వాల‌ను మంత్రి వ‌రంగ‌ల్ లోని ఎంజిఎం మార్చురీకి వెళ్లి చూసారు . అనంత‌రం గొర్రెకుంట ఘ‌ట‌న‌ల‌కు గ‌ల కార‌ణాలను వ‌రంగ‌ల్ రూర‌ల్ క‌లెక్ట‌ర్ హ‌రిత‌, పోలీస్ క‌మిష‌న‌ర్ ర‌వింద‌ర్ ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఇక అక్కడ వైద్యుల‌తో మాట్లాడారు. మృతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు. కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు . మృతుల కుటుంబాలకు త‌న ప్ర‌గాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు.

సమగ్ర విచారణకు ఆదేశించామన్న మంత్రి ఎర్రబెల్లి

సమగ్ర విచారణకు ఆదేశించామన్న మంత్రి ఎర్రబెల్లి

ఇక మీడియాతో మాట్లాడిన మంత్రి దయాకర్ రావు గొర్రెకుంట ఓ పాత బావిలో నిన్న నాలుగు శ‌వాలు, ఈ రోజు ఐదు శ‌వాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. మృతుల‌లో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన ప‌శ్చిమ‌బెంగాల్ వారు కాగా, ఇద్ద‌రు బీహార్ కార్మికులు, మ‌రో వ్య‌క్తి త్రిపుర‌కు చెందిన వ‌ల‌స కార్మికుడిగా గుర్తించారన్నారు. వీళ్ళంతా కేవ‌లం వ‌ల‌స కూలీలు మాత్ర‌మే కాదు. చాలా కాలంగా వాళ్ళు గొర్రెకుంటలోనే ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు. కొంద‌రి మృతికి కుటుంబ త‌గాదాలు కార‌ణంగా తెలుస్తున్న‌ది. మిగ‌తా వాళ్ళ మరణాలకు కార‌ణాలు తెలియ‌రాలేదని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు .

మృతి చెందిన వలస కార్మిక కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటన

పోస్టు మార్టం రిపోర్టు వ‌చ్చాక, పోలీసు విచార‌ణ‌లో పూర్తి వివ‌రాలు తెలుస్తాయని పేర్కొన్నారు. వలస కార్మికులు ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు . వలస కార్మికులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు .ఈ లోగా ఆ కుటుంబాలు కోరుకున్న విధంగా ప్ర‌భుత్వం సాయం చేయ‌డానికి సిద్ధంగా ఉంద‌న్నారు. కొన్ని మృత దేహాల‌కు సంబంధించిన వారెవ‌రూ లేరని ఇక ఎవరైనా ఉన్నారేమో కనుక్కునే పనిలో అధికారులు ఉన్నారని చెప్పారు. అన్ని విధాలుగా వారిని ఆదుకోవాల‌ని సిఎం కెసిఆర్ ఆదేశాల మేర‌కు న‌డుచుకుంటామని మంత్రి ఎర్ర‌బెల్లి పేర్కొన్నారు.

English summary
Minister Errabelli Dayakar Rao said that a comprehensive investigation of the deaths of nine migrant workers who were found dead in gorrekunta well in Warangal suburb would be taken and action would be taken after knowing the actual facts. He said the incident was "very tragic".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X