వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తహశీల్దార్ చెంప చెల్లుమనిపించిన మహిళ.. ఎక్కడ.. ఎందుకంటే...

|
Google Oneindia TeluguNews

అధికారులపై ప్రజలు ఆగ్రహాం చేయడం ఓకే.. చాలా సందర్భాల్లో ఓపిక నశిస్తే కోపడ్డతారు. అయితే ఓ గెజిటెడ్ అధికారి చెంప చెల్ మనిపించారు మహిళ. ఎందుకంటే తమ భూమికి సంబంధించిన అంశంపై ఆమె ఆగ్రహానికి గురయ్యారు. మహబూబ్ బాద్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన జరిగగా.. స్థానికంగా కలకలం రేపింది. మరికొందరు సూసైడ్ అటెంప్ట్ చేయడం, మరికొందరు పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించడంతో ఆ ప్రాంతంలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది.

తహశీల్దార్‌పై దాడి

తహశీల్దార్‌పై దాడి

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తహశీల్దార్‌పై కొందరు దాడి చేశారు. మరికొందరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. జిల్లా కేంద్రంలోని గాయత్రి గుట్ట సమీపంలో కలకలం రేగింది. తమ స్థలంలో ప్రభుత్వం సఖీ కేంద్రం నిర్మాణం చేపడుతోందని ఓ వ్యక్తి వంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మరో మహిళ పిల్లర్ గుంటలోకి దిగి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు అడ్డుకుని ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో ఆవేశంతో ఓ మహిళ తహశీల్దార్‌పై దాడి చేసింది.

ఇదీ విషయం..

ఇదీ విషయం..

సర్వే నెంబర్ 287లో 2014లో కొండ బిక్షం, గంగరబోయిన సుభద్ర, దేవిశెట్టి రామచంద్రయ్య స్థలాన్ని కొనుగోలు చేశారు. అధికారులు ఆ స్థలాన్ని సఖీ కేంద్రం నిర్మాణానికి కేటాయించారు. నాలుగు నెలల క్రితం ఈ స్థలంలో సఖీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి రావడంతో బాధితులు అప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేశారు. దీంతో వారు అప్పుడు వెనుదిరిగారు. ఆదివారం పోలీస్ బందోబస్తుతో ఆ స్థలంలో జేసీబీతో గుంటలు తీస్తుండగా బాధితులు అడ్డుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

చర్యలు తప్పవు

చర్యలు తప్పవు

భూమికి సంబంధించి మహిళ తీవ్ర ఆవేశానికి లోనయ్యారు. అక్కడే ఉన్న తహశీల్దార్ చెంప్ చెల్ మనిపించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. సదరు మహిళపై చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు తెలిపారు. డ్యూటీలో ఉన్న అధికారిపై చేయిచేసుకోవడం మంచి పద్ధతి కాదని వారు అంటున్నారు.

English summary
a woman slaps tahsildar in mahabubabad town for land issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X