వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

year ender 2020 : ఒళ్ళు గగుర్పొడిచే క్రైం సినిమాలా వరంగల్ 9 హత్యల ఘటన .. మానవ మృగానికి మరణ శిక్ష

|
Google Oneindia TeluguNews

2020 వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో ఒళ్ళు గగుర్పొడిచే అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్న సమయంలో, తినడానికి తిండి లేని పరిస్థితుల్లో వలస కార్మికుల ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో, వరంగల్ బావిలో 9 శవాలు దేశవ్యాప్తంగా షాక్ కు గురిచేశాయి . మొదటి వారంతా వలస కార్మికులు, ఆత్మహత్యకు పాల్పడి ఉంటారేమో అని అనుమానం వ్యక్తం చేసిన పోలీసులకు, ఆత్మహత్యలకు పాల్పడే బలమైన కారణాలు ఏవీ కనిపించకపోవడంతో కేసుపై దృష్టిసారించారు. పోలీసులకే చెమటలు పట్టే వాస్తవాలు బయటకు వచ్చాయి .

దేశ వ్యాప్తంగా షాక్ కు గురి చేసిన వరంగల్ 9 హత్యల ఘటన

దేశ వ్యాప్తంగా షాక్ కు గురి చేసిన వరంగల్ 9 హత్యల ఘటన

మొదట బావిలో రెండు మృతదేహాలు, ఆ తర్వాత ఒకటొకటిగా మొత్తం తొమ్మిది మృత దేహాలు బయట పడడం దేశం మొత్తాన్ని ఒక్క సారిగా షాక్ కు గురిచేసింది . అసలు ఆ బావిలో తొమ్మిదిమంది విగతజీవిగా పడి ఉండటానికి కారణమేంటి అన్న కోణంలో దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు తొమ్మిది మంది మరణం హత్యలుగా నిర్ధారించారు. వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంట ఇండస్ట్రియల్ ఏరియాలో చోటుచేసుకున్న 9 మంది వలస కార్మికుల దారుణ హత్యకేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు త్వరగానే ఈ కేసులో హంతకుడిని పట్టుకున్నారు

2020లో ఏపీలో విషం చిమ్మిన విషాదం , భయానక దృశ్యం .. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన2020లో ఏపీలో విషం చిమ్మిన విషాదం , భయానక దృశ్యం .. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన

9మందిని ఒకేసారి హత్య చేసినమానవ మృగం 24 ఏళ్ళ సంజయ్ కుమార్ యాదవ్

9మందిని ఒకేసారి హత్య చేసినమానవ మృగం 24 ఏళ్ళ సంజయ్ కుమార్ యాదవ్


వరంగల్ గొర్రెకుంట ఇండస్ట్రియల్ ఏరియాలో 9 మందిని హతమార్చిన కేసులో పోలీసులకే ఒళ్ళు జలదరించే విషయాలు వెలుగులోకి వచ్చాయి . మానవ మృగం 24 ఏళ్ళ సంజయ్ కుమార్ యాదవ్ గొర్రెకుంటలో హతమార్చిన తొమ్మిది మందినే కాక అంతకు మందు రఫీకా అనే మరో మహిళను హతమార్చినట్టు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి . రఫీకా ను చంపిన విషయం బయటకు రాకుండా ఆమె గురించి పదేపదే అడుగుతున్న ఆమె బంధువులు అయిన వారిని, వారితో పాటు గోదాం లో ఉండే మరో ఇద్దరినీ హతమార్చాడు . మొత్తం 10 హత్యలు చేసిన సంజయ్ కుమార్ యాదవ్ ఎంతటి మానవ మృగమో అర్ధం చేసుకోవచ్చు .

దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి

దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి

వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో తొమ్మిది మందిని బావిలో పడేసి హతమార్చిన నరరూప రాక్షసుడు సంజయ్ కుమార్ యాదవ్ విచారించే కొద్దీ పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. అతనిలో పది మందిని చంపిన భయం కానీ, బాధ కాని, పశ్చాత్తాపం కనిపించకపోవడం పోలీసులకి షాకింగ్ గా అనిపించింది. ఏమాత్రం చదువుకోకపోయినా,విద్యా జ్ఞానం లేకపోయినా, ఇంటర్నెట్ వాడకంలో దిట్ట అయిన సంజయ్ కుమార్ యాదవ్ ఇన్ని హత్యలను చేయడానికి ఇంటర్నెట్ వినియోగించినట్లు గా పోలీసులు గుర్తించారు .

 గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ద్వారా హత్యలకు కావాల్సిన సమాచారం

గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ద్వారా హత్యలకు కావాల్సిన సమాచారం

బీహార్ రాష్ట్రంలోని బిగుసరయి జిల్లా నుర్లపూర్‌ లో పుట్టిన సంజయ్‌ చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిపోయి చాలా కాలం తర్వాత తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇక ఈ మధ్య కాలంలో ఢిల్లీలోని ఒక సెల్‌ ఫోన్‌ రిపేర్‌ షాపులో సంజయ్‌ పనిచేశాడు. అక్కడ పనిచేసిన అనుభవం ఈ హత్యల విషయంలో ఉపయోగపడింది . హత్యలు చేయడానికి కావలసిన సమాచారాన్ని గూగుల్‌ వాయిస్‌ అసిస్టెంట్‌ టూల్‌ లోని 'ఓకే..గూగుల్‌' ఆప్షన్‌ ద్వారానే తెలుసుకున్నట్లుగా అతని సెల్ ఫోన్ సెర్చ్ హిస్టరీ చెబుతుంది. ఎక్కువ కాలం మత్తునిచ్చే టాబ్లెట్ల పేర్లు ఏమిటో అవి తెలుసుకుని వాటిని కొనుగోలు చేసి తినే ఆహార పదార్థాల్లో కలిపి మత్తులో జారుకున్న తర్వాత ఈ హత్యలు చేసినట్టు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. అపస్మారక స్థితిలోకి వెళ్ళిన వారిని ఒక్కొక్కరిగా సైకిల్ మీద తీసుకెళ్ళి బావిలో పడేశాడు సంజయ్ .

 మొబైల్ సెర్చ్ హిస్టరీ అంతా నేర పూరిత అంశాలు, బ్లూ ఫిలిమ్స్

మొబైల్ సెర్చ్ హిస్టరీ అంతా నేర పూరిత అంశాలు, బ్లూ ఫిలిమ్స్

అతని మొబైల్ సెర్చ్ హిస్టరీ అంతా నేర పూరిత అంశాలు, బ్లూ ఫిలిమ్స్ తోనే నిండి ఉందని సమాచారం. చాలా మంది మహిళలతో అతడు వివాహేతర సంబంధాలు కొనసాగించినట్లుగా మొబైల్ ఆధారంగా తెలుస్తోంది. అంతేకాదు మహిళలతో అతను బెడ్‌ రూమ్‌ లో ఉన్న ఫోటోలు, నెట్‌ లో డౌన్‌లోడ్‌ చేసిన అశ్లీల వీడియోలు వందల కొద్దీ ఆ ఫోన్ లో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.ఇక ఈ కేసులో కీలకంగా అతను చేసిన సైకిల్ సవారీనే సంజయ్ ను పట్టించింది .

సైకిల్ సవారీ తో నిందితుడిని పట్టుకున్న పోలీసులు

సైకిల్ సవారీ తో నిందితుడిని పట్టుకున్న పోలీసులు

హత్యకు కొద్ది రోజుల ముందు నుండి గోదాం దగ్గరకు సంజయ్ కుమార్ యాదవ్ నిత్య సైకిల్ మీద వస్తూపోతూ ఉండేవాడు. ఇక హత్యలు జరిగిన రోజు కూడా జరిగిన బర్త్ డే పార్టీకి సంజయ్ కుమార్ యాదవ్ సైకిల్ మీద వచ్చాడు. హత్య జరిగిన తర్వాత రోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో సంజయ్ కుమార్ యాదవ్ సైకిల్ మీదనే గోదాం నుండి బయటకు వెళ్ళినట్లుగా సీసీ టీవీ ఫుటేజ్ లో గుర్తించారు పోలీసులు. అతనికి సైకిల్ సవారీ మీద ఉన్న మోజు పోలీసులకి పట్టుబడేలా చేసింది. అలా సీసీ కెమెరాల్లో రికార్డయిన ఆ సైకిల్ సవారీయే సంజయ్ కుమార్ యాదవ్ ను పట్టుకోవడంలో పోలీసులకు కీలకంగా మారింది.

మానవ మృగం సంజయ్ కుమార్ కు ఉరి శిక్ష వేసిన కోర్టు ,లైంగిక వేధింపుల కేసులో జీవిత ఖైదు

మానవ మృగం సంజయ్ కుమార్ కు ఉరి శిక్ష వేసిన కోర్టు ,లైంగిక వేధింపుల కేసులో జీవిత ఖైదు

సంజయ్ కుమార్ ను అరెస్ట్ చేసిన పోలీసులు , నేర నిరూపణకు కావాల్సిన అన్ని సాక్ష్యాలను కోర్టుకు అందించటంతో కోర్టు మానవ మృగం , 10 మంది ప్రాణాలు తీసిన ముద్దాయి సంజయ్ కుమార్ కు 2020అక్టోబర్ నెలలో ఉరి శిక్ష విధించింది . అంతే కాదు తాజాగా రఫీకా అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ,మైనర్ అయిన ఆమె కుమార్తెను కూడా లైంగిక వేధింపులకు గురి చేసిన కారణంగా నమోదైన పోక్సో చట్టం క్రింద తాజాగా మరోకేసులో సంజయ్ కుమార్ కు జీవిత ఖైదు విధించింది కోర్టు .

English summary
In the year 2020, the worst incident took place in the state of Telangana. Nine migrant labor corpses were found in a well at the Warangal shocked the country . The murders happened like a horror movie and the criminal is a 24 years youngman .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X