• search
  • Live TV
పశ్చిమగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆయనో చెట్టుకింద న్యూస్‌ రీడర్- తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం-రఘురామపై వెల్లంపల్లి ఫైర్‌...

|

వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీ ప్రభుత్వంపైనే నిత్యం విమర్శలు చేస్తున్న రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై ఇన్నాళ్లూ చూసీ చూడనట్లుగా ఉన్న మంత్రులు, పార్టీ నేతలు ఇక స్వరం పెంచుతున్నారు. ఇందులో భాగంగా రఘురామ చేస్తున్న విమర్శలపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఘాటుగా కౌంటర్‌ ఇచ్చేశారు.

నర్సాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణం రాజు ఢిల్లీలో చెట్టు కింద కూర్చుని రోజూ పనీ పాటాలేని వార్తలు చదువుతున్నారని, ఎల్లో పేపర్లలో వచ్చే వార్తలు చదవాలంటే.. వాటిపై ఆయన విశ్లేషణలు చేయాలనుకుంటే.. చెట్టు కింద ఎందుకు..? ఆ టీవీ ఛానళ్ళలోనే ఉద్యోగంలో చేరితే సరిపోతుందిగా అంటూ వెల్లంపల్లి వ్యాఖ్యానించారు. రఘురామకృష్ణంరాజు తనకు తాను మేధావిగా డిక్లేర్ చేసుకుని.. సెల్ఫ్ ప్రమోటెడ్ ఇంటలెక్చువల్ మాదిరిగా నీతులు చెబుతూ ఉంటాడని, అసలు ఆయన నీతులు చెప్పే పరిస్థితిలో ఉన్నాడా అని వెల్లంపల్లి ప్రశ్నించారు.

ap minister vellampalli srinivas hilarious comments on rebel mp raghurama krishnam raju

ఒక పార్టీలో గెలిచి.. ఆయన ఎవరికి భజన చేస్తున్నాడు..? ఎవరిని విమర్శిస్తున్నాడు..? తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం మనస్తత్వం

ఉన్న ఇతను.. కన్నతల్లి లాంటి పార్టీని, ఆయనను గెలిపించిన జగన్ మోహన్ రెడ్డిగారిని విమర్శిస్తున్నాడు. అందరికీ శకునాలు చెప్పే

బల్లి.. కుడితిలో పడినట్టుగా ఉంది రఘురామకృష్ణ రాజు వ్యవహారం అంటూ వెల్లంపల్లి ఆయన్ను కడిగేశారు. పైకి చెప్పేది నీతులు...

ఆయన చేస్తున్నది ఏమిటి అంటూ ప్రశ్నించారు. వైయస్ కుటుంబానికి, జగన్ మోహన్ రెడ్డిగారికి మతాన్ని అంటగట్టడం...దానివల్ల

రాజకీయ లబ్ధి పొందాలంటే అది మీ తరం కాదన్నారు.

ఇలాంటి ఎన్నో డ్రామాలు గతంలో చంద్రబాబు నాయుడు చేశారని, వైఎస్ కుటుంబంపై ఎన్నో అపవాదులు వేశారని. చివరికి ఏమైందని రఘురామరాజును మంత్రి ప్రశ్నించారు. వైయస్ కుటుంబం అంటే.. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరి మేలు, సమాజం మేలు కోసం పరితపించే కుటుంబమని వెల్లంపల్లి గుర్తుచేశారు. వైయస్ అంటే అందరి కుటుంబం. ఏ ఒక్క కులానికో, మతానికో సంబంధించింది కాదు. జగన్ మోహన్ రెడ్డిగారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు.. నా కులం మానవత్వం.. నా మతం మాట తప్పకపోవడం అని.. -కులాలు, మతాలు అడ్డుపెట్టుకుని నేటి ఆధునిక ప్రపంచంలో కూడా రాజకీయాలు చేయటం దురదృష్టకరమని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. నాడు రాజశేఖరరెడ్డి దేవాలయాలకు ధూప, దీప నైవేద్యాల కింద ప్రతి ఆలయానికి డబ్బులు ఇస్తే ఈరోజు జగన్ అంతకు మించే చేస్తున్నారని వెల్లంపల్లి గుర్తుచేశారు.

English summary
andhra pradesh endowments department minister vellampalli srinivas has given strong counter to his own party ysrcp rebel mp raghu ramakrishnam raju. vellampalli says raghurama is a news reader under the tree and better join the news channels who are entertaining him regularly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X