పశ్చిమగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలవరం నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం ..ఏపీకి అన్నీ మంచి శకునములే

|
Google Oneindia TeluguNews

ఏపీలో అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సహకారం అందుతోంది . ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం కనిపిస్తుంది. అదే సమయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీతో కూడా జగన్ సత్సంబంధాలు నెరపాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకే ఆయన తిరుపతి సందర్శనకు వచ్చినప్పుడు జగన్ స్వయంగా అక్కడికి వెళ్లి మరీ మోడీని రిసీవ్ చేసుకున్నారు. అలాగే ఆయనతో పాటు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

చంద్రబాబు అసెంబ్లీలో లెంపలేసుకుని తప్పు అంగీకరిస్తే అప్పుడు జగన్ మాట్లాడతారన్న రోజా చంద్రబాబు అసెంబ్లీలో లెంపలేసుకుని తప్పు అంగీకరిస్తే అప్పుడు జగన్ మాట్లాడతారన్న రోజా

కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జలవనరుల శాఖ ప్రతిపాదన.. పోలవరానికి నిధుల విడుదల

కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జలవనరుల శాఖ ప్రతిపాదన.. పోలవరానికి నిధుల విడుదల

ఇక తాజాగా కేంద్రం నుండి మరో గుడ్ న్యూస్ వచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి నిధులు విడుదల చెయ్యాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 3వేల కోట్లను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నిధులను నాబార్డు నుంచి విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జలవనరుల శాఖ ప్రతిపాదనలు పంపింది. అంతేకాదు, ఎప్పటికప్పుడు యూసీలను పంపిస్తే ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తాన్ని రీయింబర్స్ చేస్తామని కూడా ఏపీ ప్రభుత్వానికి తెలిపింది.

చంద్రబాబు హయాంలో అందని కేంద్ర సహకారం

చంద్రబాబు హయాంలో అందని కేంద్ర సహకారం

గతంలో చంద్రబాబు పాలనలో పోలవరం నిధులు ఇవ్వకుండాఇబ్బంది పెడుతున్నారని పలు మార్లు ఆరోపించారు. ఇక కేంద్రం తో ప్రత్యేక హోదా కోసం పంచాయితీ పెట్టుకున్న టీడీపీ కేంద్రం నుండి ఏ మాత్రం సహకారం తీసుకోలేకపోయింది. కాబట్టి జగన్ వ్యూహాత్మకంగా రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరేలా మంత్రాంగం నెరపాలని చూస్తున్నారు. అందుకే ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఇక అందులో భాగంగానే నిన్న రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాత్ దాస్ ను ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి పంపారు.

వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న జగన్.. కేంద్రం కూడా సానుకూలం

వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న జగన్.. కేంద్రం కూడా సానుకూలం


పోలవరం ప్రాజెక్టు పనుల నిలిపివేతకు సంబంధించి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల సడలింపు జూలై 2తో ముగియనుండటంతో సడలించడం కాకుండా... పూర్తిగా ఎత్తివేసేలా సంబంధిత శాఖల అధికారులతో చర్చించాలని జగన్ సూచించారు. మొత్తానికి జగన్ పాలన ప్రారంభం అయిన తరువాత రాష్ట్రానికి కేంద్రం నుండి కొన్ని సానుకూల సంకేతాలు వస్తున్నట్టు తెలుస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయానికి సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయం కూడా అందులో భాగమే . అందుకే జగన్ సీఎం అయిన తరువాత కేంద్రం స్పందిస్తున్న తీరుతో అన్నీ మంచి శకునములే అని అంటున్నారు ఏపీ ప్రజలు.

English summary
Another good news came from the center. The Central government has decided to release funds for the Polavaram Project. The central government has issued a green signal to release 3,000 crore. The Central Water Resources Department has sent proposals to the Finance Ministry to release funds from NABARD to this extent. The cenral government told the government that the reimbursement of the AP expenditure would be spent on the project if it was to be sent from time to time
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X