పశ్చిమగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2021కి పోల‌వ‌రం పూర్తి: ప‌నుల పైన నిపుణుల ఆడిటింగ్‌..సీఎం జ‌గ‌న్‌..!

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత జ‌గ‌న్ తొలి సారిగా పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప్ర‌చారానికి..వాస్త‌వ ప‌రిస్థితికి పొంత‌న లేక‌పోవటం పైన ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. కాప‌ర్ డ్యాం ప‌నుల పైన సీఎం అసంతృప్తిని ఓపెన్‌గానే తెలియ చేసారు. 2021 ఫిబ్ర‌వ‌రి నాటికి పోల‌వ‌రం ప‌నులు పూర్తి చేయాల‌ని సీఎం ఆదేశించారు. అదే విధంగా ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన నిర్మాణ ప‌నుల పైన నిపుణుల‌తో ఆడిటింగ్ చేయించాల‌ని సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యించారు.

2021నాటికి పోల‌వ‌రం పూర్తి...
ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పోల‌వ‌రం ప‌నుల‌ను ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించారు. వ‌చ్చే నాలుగు నెలల్లో చేయాల్సిన ప‌నుల పైన అధికారుల‌తో చ‌ర్చించారు. వ‌చ్చే 2021 సంవ‌త్స‌రం నాటికి పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా ప‌క్కా ప్ర‌ణాళికా బ‌ద్దంగా వ్య‌వ‌హ‌రించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను చూడటంతో పాటు ఏరియల్‌ సర్వే ద్వారా ఆ ప్రాంతాన్నంతా పరిశీలించారు. ఆ తర్వాత ప్రాజెక్టు సమీపంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. నిర్వాసితులకు పరిహారం పెంపు విషయాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నాలుగు నెలల్లో ఏయే పనులు చేయగలరంటూ అధికారులను ముఖ్యమంత్రి ప‍్రశ్నించారు.., స్పిన్‌ ఛానెల్‌ ఏటిగట్లను పటిష్టపరుస్తామని అధికారులు వివ‌రించారు. ఇక డ్యామ్‌ పూర‍్తయిన పది నెలలలోపు హైడ్రాలిక్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని ఈ సమావేశంలో కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రికి వివ‌రించారు.

Cm Jagan visted polavaram construction site and review on works. CM ordered officials project must complete by 2021

నిపుణుల‌తో ఆడిటింగ్‌కు ఆదేశం..
దశలవారీగా పూర్తయ్యే తీరును అధికారులు వివరించారని, నాలుగు నెలల కాలంలో చేయాల్సిన పనులను పరిశీ లించామని మంత్రి అనిల్ వివ‌రించారు. కాపర్‌ డ్యామ్‌ పనులు సరిగ్గా జరగలేదని, వరదల సమయంలో 113 గ్రామాల కు చెందిన నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారని చెప్పారు. 28 వేల కుటుంబాలను ఈ ఏడాది తరలించాల్సి ఉందన్నారు. పోలవరంలో ఇప్పటి వరకు జరిగిన పనుల పై నిపుణుల కమిటీ పరిశీలించిందని తెలిపారు. వరద ప్రవాహం నుంచి కాపర్‌ డ్యామ్‌ను రక్షించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి అనిల్ వివ‌రించారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు పోల‌వ‌రం ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తే క‌నిపించే హ‌డావుడి..ఇప్పుడు ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌లో ఎక్క‌డా క‌నిపించ‌లేదని పార్టీ నేత‌లు గుర్తు చేస్తున్నారు.

English summary
AP Cm Jagan visted polavaram construction site and review on works. CM ordered officials project must complete by 2021. Cm directed for works auditing by experts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X