పశ్చిమగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పై అందరికీ కన్ఫ్యూజన్ .. లోగుట్టు స్వరూపానందకే ఎరుక :కొడాలి నానీకి రఘురామ చురక

|
Google Oneindia TeluguNews

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన నిప్పులు చెరుగుతున్నారు. గత కొంత కాలంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న ఆయన తాజాగా మరి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం రచ్చబండ కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని, కొడాలి నాని ని టార్గెట్ చేసి ఆయన రాష్ట్రంలో తాజా పరిణామాలపై ప్రశ్నల వర్షం కురిపించారు.

ఖబడ్దార్ కొడాలి నానీ: రాబోయే రోజుల్లో జరిగేదదే.. ఎంపీ రఘురామ వార్నింగ్ ఖబడ్దార్ కొడాలి నానీ: రాబోయే రోజుల్లో జరిగేదదే.. ఎంపీ రఘురామ వార్నింగ్

 జగన్ మతం విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రఘురామ

జగన్ మతం విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రఘురామ


సీఎం జగన్ మోహన్ రెడ్డిని చూసి అటు ఏపీలోని హిందువులు, తిరుమలకు జగన్ వెళ్లడం చూసి క్రైస్తవులు కన్ఫ్యూజన్ లో ఉన్నారని, జగన్ మోహన్ రెడ్డి ఈ కన్ఫ్యూజన్ కు చెక్ పెట్టడానికి అసలు తానేంటో స్వయంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు రఘురామకృష్ణంరాజు.సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ మతం అనేది స్వరూపానంద మాత్రమే చెప్పగలరని,అభిప్రాయం వ్యక్తం చేశారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డికి మార్గనిర్దేశం చేస్తున్న శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆలయాలపై దాడులను ఆపేందుకు సీఎం జగన్ కు దారి చూపిస్తే బాగుంటుందని రఘు రామ పేర్కొన్నారు. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై కూడా మండిపడ్డారు రఘురామకృష్ణంరాజు.

కరోనా నిబంధనలు పాటించని సీఎంపై జనం వేలెత్తి చూపిస్తే సమాధానం ఏంటి ?

కరోనా నిబంధనలు పాటించని సీఎంపై జనం వేలెత్తి చూపిస్తే సమాధానం ఏంటి ?

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి విపరీతంగా ఉన్న నేపథ్యంలో కరోనా నిబంధనను పాటించవలసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి అవేమీ పాటించలేదని, కనీసం మాకు మాస్కులు కూడా పెట్టుకోకుండా ఆయన తిరుమలలో తిరిగారని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఏకంగా సీఎంనే పాటించకపోవడాన్ని రఘురామ కృష్ణంరాజు తప్పుబట్టారు. ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు అని ప్రశ్నించారు. నిబంధనలు పాటించని ముఖ్యమంత్రి ఒక ఆదర్శమని ప్రజలు చెప్తే ఏం చేస్తారా అంటూ ప్రశ్నించారు. జనాలు వేలెత్తి చూపిస్తే జగన్ ఏం సమాధానం చెబుతారు అంటూ నిలదీశారు.

కొడాలి నానీ వ్యాఖ్యలపై రఘురామ కౌంటర్

కొడాలి నానీ వ్యాఖ్యలపై రఘురామ కౌంటర్

ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు. మన ఇంట్లో పెట్టుకున్న దేవుళ్ళ ఫోటోలపై ఎవరైనా ఉమ్మి వేస్తే ఏమవుతుంది ఫోటో నే కదా ఇంకొకటి కొనిస్తా అంటే ఊరుకుంటామా ? ఇది కూడా అంతే అంటూ వ్యాఖ్యానించారు.

ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హిందు దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసంపై చేసిన వ్యాఖ్యలపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు కౌంటర్ ఇచ్చారు. ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై కొడాలి నాని చౌకబారు వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. మోడీ ,యోగి ల గురించి తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడడం తప్పని రఘురామ కృష్ణంరాజు హితవుపలికారు.

Recommended Video

Pawan Kalyan పై Sanchaita Gajapathi Raju ఆరోపణ | Mansas Trust వ్యవహారం పై..!!
త్వరలో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరిక

త్వరలో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరిక

ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని చెప్పారు. త్వరలోనే ప్రజలే బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు . వైసిపి నేతలపై విరుచుకు పడిన ఆయన హిందువుల రక్షకుడుగా ఉంటారనుకున్న ముఖ్యమంత్రి జగన్ భక్షకుడిగా మారాడు అని కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. వైసిపి మంత్రుల తీరుపై నిప్పులు చెరిగిన ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే అందుకు కారణం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే అని స్పష్టం చేశారు.

English summary
Raghurama Krishnam Raju demanded that Jagan Mohan Reddy should declare himself about his religion to check the confusion that the Hindus and the Christians in AP . The christians were confused by Jagan's Tirumala visit and worships. swami swaroopananda also knows about jagan's religion. raghurama said the day will come soon ..when people will teach a good lesson to Nani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X