పశ్చిమగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మొగ‌ల్తూరులో చిరుకు నాడు వైయ‌స్ దెబ్బ‌: అందుకే..జ‌గ‌న్ హ‌యాంలో ప‌వ‌న్ ఇలా: పాల‌కొల్లు వేదిక‌గా..!

|
Google Oneindia TeluguNews

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా ఒక నిర్ణ‌యం తీసుకున్నారు. తన సొంత జిల్లా..స్వ‌గ్రామం ఉన్న ప్రాంతంలో ఒక సంస్థ ఏర్పాటుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముందుకు వ‌చ్చారు. పార్టీ త‌ర‌పున ఆ సంస్థ ఏర్పాటు చేస్తున్న‌ట్లుగా ప‌వ‌న ప్ర‌క‌టించారు. అయితే, దీని వెనుక ఆస‌క్తి క‌ర రాజ‌కీయం ఉది. 2009లో ప్ర‌జారాజ్యం ఏర్పాటు చేసి..ఎన్నిక‌ల్లో పోటీ ప‌డుతున్న స‌మ‌యంలో ప్ర‌జాకర్ష‌ణ‌లో నాటి సీఎం వైయ‌స్సార్‌...ప్ర‌జారాజ్యం అధినేత చిరంజీవి నువ్వా నేనా అన్న ట్లుగా పోటీ పడ్డారు. ఆ ఎన్నిక‌ల్లో చిరంజీవి తిరుప‌తితో పాటుగా పాల‌కొల్లులోనూ పోటీ చేసారు. ఆ ఎన్నిక‌ల ప్ర‌చారంలో నాటి సీఎం వైయ‌స్ మెగా కుటుంబ స్వ‌గ్రామం మొగ‌ల్తూరులో ప్ర‌యోగించిన పంచ్ అక్క‌డ ప్ర‌జ‌లు మ‌ర్చిపోలేరు. ఇక‌, ఇప్పుడు ప‌వ‌న్ తాజా నిర్ణ‌యం వెనుక నాటి వైయ‌స్ ప్ర‌భావం ఉందంటూ కొంద‌రు గుర్తు చేస్తున్నారు..

Recommended Video

పాలకొల్లులో ఎస్వీ రంగారావు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
మొగల్తూరులో నాడు వైయ‌స్ పంచ్ గుర్తుందా....

మొగల్తూరులో నాడు వైయ‌స్ పంచ్ గుర్తుందా....

2009 ఎన్నిక‌ల స‌మ‌యంలో చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ స్థాప‌న‌తో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్దిగా ప్ర‌జ‌ల ముందుకొచ్చారు. ఆ ఎన్నిక‌ల్లో చిరంజీవి తిరుప‌తితో పాటుగా పాల‌కొల్లు నుండి పోటీ చేసారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా..వైయ‌స్ మీద మెగా సోద‌రులు ఎన్నో విమ‌ర్శ‌లు చేసారు. అయితే, చిరంజీవి సొంత గ్రామం మొగ‌ల్తూరులో వైయ‌స్ ఎన్నిక‌ల ప్ర‌చారం లో కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. అక్క‌డ చిరంజీవిని ఉద్దేశించి..అమ్మ‌కు అన్నం పెట్ట‌ని వాడు..పిన్న‌మ్మ‌కు బంగారు గాజులు చేయిస్తాన్నాడుట‌..అని చెబుతూ కోట్ల రూపాయాలు ఉన్నా సొంత ఊరుకు ఏమీ చేయ‌ని వ్య‌క్తి రాష్ట్రం కు ఏదో చేస్తాన‌ని చెబుతున్నారంటూ విమ‌ర్శించారు. అది చాలా కాలం సోషల్ మీడియాలో సైతం ట్రోల్ అయింది. ఇక‌, 2009 ఎన్నిక‌ల్లో చిరంజీవి పాలకొల్లు నుండి పోటీ చేసి ఓడిపోగా..తిరుప‌తి నుండి గెలిచారు. ఆ ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్..చిరంజీవి ప్ర‌జాక‌ర్ష‌ణ మ‌ధ్య పోటీ జ‌ర‌గ్గా..వైయ‌స్ తిరిగి అధికారంలోకి వ‌చ్చారు.

భీమ‌వ‌రం కేంద్రంగా ప‌వ‌న్ స‌రికొత్త నిర్ణ‌యం..

భీమ‌వ‌రం కేంద్రంగా ప‌వ‌న్ స‌రికొత్త నిర్ణ‌యం..

జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా ఒక నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. త‌మ సొంత జిల్లాలోని పాల‌కొల్లులో ఫిల్మ్ ఇని స్టిట్యూట్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. జ‌న‌సేన పార్టీ ద్వారా ఏర్పాటు చేస్తున్న‌ల్లు వెల్ల‌డించారు. ఈ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కు హరిరామజోగయ్య చైర్మన్ గా వ్యవహరిస్తారట. రాజా వన్నెంరెడ్డి, బన్నివాసుల ఆధ్వర్యంలో న‌డుపు తామ‌ని చెప్పుకొచ్చారు. పాలకొల్లు నుండి ప‌లువ‌రు సినీ ప్ర‌ముఖులు ఉన్నార‌ని ప‌వ‌న్ గుర్తు చేస్తున్నారు. చాలామంది ప్రముఖులను అందించింన ఘ‌న‌త పాల‌కొల్లుకు ద‌క్కుంద‌ని వివ‌రించారు. అందులో అల్లు రామలింగయ్య, దాసరి నారాయణ రావు, కోడి రామకృష్ణ వంటి వారు పాలకొల్లు వాస్త‌వ్యులేన‌ని పవన్ గుర్తుచేశారు. తాము ఏర్పాటు చేసే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కు ఎస్వీ రంగారావు పేరు పెట్టనున్నట్టుగా ప్రకటించారు. అయితే, ప‌వ‌న్ పాలకొల్లు కేంద్రంగా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు ప్ర‌క‌ట‌న పైన ఇప్పుడు సినీ రంగంలోనూ కాదు..రాజ‌కీయంగానూ చ‌ర్చ మొద‌లైంది.

జ‌గ‌న్ హాయంలో ప‌వ‌న్ నిర్ణ‌యం వెనుక‌..

జ‌గ‌న్ హాయంలో ప‌వ‌న్ నిర్ణ‌యం వెనుక‌..

2009 ఎన్నిక‌ల్లో చిరంజీవి..వైయ‌స్సార్ మ‌ధ్య పోటీ జ‌ర‌గితే... 2019 ఎన్నిక‌ల్లో వైయ‌స్ త‌న‌యుడు జ‌గ‌న్‌తో చిరంజీవి సోద‌రుడు ప‌వ‌న్ పోటీ ప‌డ్డారు. ప‌వ‌న్ సైతం సొంత జిల్లా ప‌శ్చిమ గోదావ‌రి లోని భీవ‌వ‌రం..విశాఖ‌లోని గాజువాక నుండి పోటీ చేసారు. అయితే రెండింటా ఓడిపోయారు. అయితే, గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ హామీ ఎందుకు ఇవ్వ‌లేద‌ని ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. సినీ రంగానికి చెందిన తాను ఏపీ అభివృద్దిలో ముంద‌డుగు తానే వేయాల‌నే ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. అయితే, పొలకొల్లు అందుకు స‌రైన ప్రాంత‌మేనా అనే అనుమానం మాత్రం వ్య‌క్తం అవుతోంది. భ‌విష్య‌త్ రాజకీయాల్లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో కీల‌క భూమిక కోసమే ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుక‌న్నార‌నే విశ్లేష‌ణ‌లు ఉన్నాయి. ప‌వ‌న్ తాను చెబుతున్న‌ట్లుగా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేస్తే ఏపీకీ ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని వైసీపీ నేత‌లు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.

English summary
Janasena chief Pawan Kalyan announced he want to build film Institute in Palakol of West Godavari dist by name of SV Ranga Rao shortly. Pawan says Hari Rama Jogiah will be the chairman for this institute.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X