పశ్చిమగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజీనామా చేసి పోటీ చెయ్ .. వాలంటీర్ ని పెట్టి విజయం సాధిస్తాం : ఎంపీ రఘురామకు ఎమ్మెల్యే సవాల్ 

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై, వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మాటల దాడి కొనసాగుతోంది. మొన్నటికి మొన్న రఘురామకృష్ణంరాజు సీఎం జగన్మోహన్ రెడ్డికి వినాయకచవితి నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా,హిందువుల మనోభావాలను గౌరవించాలంటూ లేఖ రాసిన నేపథ్యంలో ఆయనపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.సీఎం జగన్ కు మతాన్ని అంటగడుతున్నారు అని మండిపడుతున్నారు.

Recommended Video

YSRCP MP Raghurama Krishnam Raju met JP Nadda రఘురామరాజు ను లోక్ సభలో వెనక సీటుకు పంపేసిన YCP
రఘురామకు సవాల్ చేసిన తణుకు ఎమ్మెల్యే

రఘురామకు సవాల్ చేసిన తణుకు ఎమ్మెల్యే

తాజాగా తణుకు ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సవాల్ విసిరారు. ఎంపీగా రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని ఆయన పేర్కొన్నారు. రఘు రామ మళ్లీ పోటీ చేస్తే ఒక వాలంటీర్ ను పోటీకి పెట్టి విజయం సాధించగల సత్తా వైసీపీకి ఉందని ఆయన వెల్లడించారు. అధికార పార్టీ ఎంపీ గా ఉండి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని రఘురామకృష్ణంరాజు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తణుకు ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు.

 జగన్ కు మతం రంగును అంటగడతావా ?

జగన్ కు మతం రంగును అంటగడతావా ?

సీఎం జగన్మోహన్ రెడ్డికి మతాన్ని అంటగట్టేలా రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు చేయడం దారుణంగా ఉందని ఆయన మండిపడ్డారు. అన్ని మతాలకు సమ న్యాయం చేసేలా సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం జగన్ ని ఉద్దేశించి మతం రంగు అంటించేలా ఆయన మాట్లాడటం దారుణమని వ్యాఖ్యానించారు .రఘురామకృష్ణంరాజు చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారి, చంద్రబాబు ఏం చెప్తే అదే చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి ముందే రఘురామకృష్ణంరాజు సొంత నియోజక వర్గాన్ని విడిచి వెళ్లారని ,ఇప్పటి వరకు నియోజకవర్గ ప్రజలకు ఆయన పట్టించుకున్నదే లేదని విమర్శించారు .

నియోజక వర్గ ప్రజలు ఎప్పుడో రఘురామను మర్చిపోయారు

నియోజక వర్గ ప్రజలు ఎప్పుడో రఘురామను మర్చిపోయారు

ఢిల్లీలోనో, హైదరాబాద్ లోనో ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం, మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు.
ఇంతకాలం నియోజకవర్గానికి దూరంగా ఉన్న మిమ్మల్ని నియోజకవర్గ ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు అంటూ పేర్కొన్నారు తణుకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు. సీఎం రిలీఫ్ ఫండ్స్ వచ్చినా ఆ నిధులను వినియోగించే పరిస్థితిలో ఎంపీ రఘురామ లేరని విమర్శలు గుప్పించారు. రాజీనామా చేసి ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి గెలిచే సత్తా ఉంటే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.

రాజీనామా చేసి తిరిగి పోటీ చెయ్యాలన్న తణుకు ఎమ్మెల్యే

రాజీనామా చేసి తిరిగి పోటీ చెయ్యాలన్న తణుకు ఎమ్మెల్యే

ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ అధికార పార్టీలోనే కొనసాగితే మంచిది కాదని హితవు పలికారు. ఇక మరోవైపు రఘురామ తీరుపై మంత్రి వెల్లంపల్లి కూడా విమర్శలు గుప్పించారు . రఘురామను ఒక పనికిమాలిన నాయకుడిగా ఆయన అభివర్ణించారు. ఢిల్లీలో కూర్చొని హిందూ మతంపై సవతి ప్రేమ చూపిస్తున్నారని వెల్లంపల్లి ఆరోపించారు. ఢిల్లీ నుంచి రాకుండా అక్కడే కూర్చుని తమపై విమర్శలు చేయటం తగదని మంత్రి హితవు పలికారు . నియోజకవర్గంలో చవితి పూజల్లో పాల్గొనాలని సవాల్ విసిరారు . ఇప్పుడు తణుకు ఎమ్మెల్యే ఏకంగా రాజీనామా చేసి తిరిగి పోటీ చెయ్యాలని సవాల్ చేశారు .

English summary
Recently, Tanuku MLA Venkata Nageswara Rao challenged Narasapuram MP Raghurama Krishnamraju. He said he would resign as an MP and contest again. He revealed that if Raghu Rama contests again, the YCP has the capacity to field a volunteer and win. Tanuku MLA Venkata Nageswara Rao has lashed out at Raghuram Krishnan Raju for being an MP of the ruling party and criticizing the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X