పశ్చిమగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రక్తంతో వేలిముద్రలు వేసి రాజధాని అమరావతి కోసం.... ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఒకరోజు నిరాహార దీక్ష

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ఏర్పాటు చెయ్యటానికి సన్నాహాలు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇక ఈ నేపధ్యంలో వెల్లువెత్తుతున్న నిరసనలు నేటితో 21వ రోజుకు చేరాయి. రాజధాని రైతుల పోరాటం ఇప్పటికీ ఉధృతంగా సాగుతుంది. రాజధాని రైతులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తున్నా రాజధాని రైతుల పోరాటం మాత్రం ఆగటం లేదు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని 29 రాజధాని గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు రాజధాని గ్రామాల ప్రజలకు టీడీపీ నేతలు మద్దతు తెలుపుతున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించే దాకా ఉద్యమాన్ని ఆపేది లేదని వారు తేల్చి చెప్తున్నారు.

జగన్ ఇంటిపేరు రివర్స్ ... రాజధాని మార్పుపై చింతమనేని షాకింగ్ కామెంట్స్జగన్ ఇంటిపేరు రివర్స్ ... రాజధాని మార్పుపై చింతమనేని షాకింగ్ కామెంట్స్

సేవ్ ఏపీ..సేవ్ అమరావతి’ పేరుతో టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళనలు

సేవ్ ఏపీ..సేవ్ అమరావతి’ పేరుతో టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళనలు

ఇక రాజధాని అమరావతి కోసం రైతులకు మద్దతుగా టీడీపీ నేతల ఆందోళనలు సైతం కొనసాగుతున్నాయి. ఇక నిన్న ‘సేవ్ ఏపీ..సేవ్ అమరావతి' పేరుతో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రాంమోహన్ నల్ల చొక్కా ధరించి 24 గంటల రిలే నిరాహారదీక్ష ప్రారంభించారు. అంతేకాదు పశ్చిమ గోదావరి , పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్థానిక గాంధీబొమ్మల సెంటర్‌లో కుటుంబ సభ్యులతో కలసి ఒక రోజు నిరాహార దీక్ష చేస్తున్నారు . ఈ సందర్భంగా పలువురు రైతులు రాజధానిపై జగన్‌ నిర్ణయాన్ని నిరసిస్తూ సంతకం చేసి రక్తంతో వేలిముద్రలు వేశారు.

 పాలకొల్లులో కుటుంబ సభ్యులతో నిరాహారదీక్ష చేస్తున్న నిమ్మల రామానాయుడు

పాలకొల్లులో కుటుంబ సభ్యులతో నిరాహారదీక్ష చేస్తున్న నిమ్మల రామానాయుడు


తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సోమవారం పాలకొల్లులో కుటుంబ సభ్యులతో నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తం చిందించి అమరావతిని కాపాడుకుంటాం అంటూ.. నిమ్మల, రైతులు రక్తంతో వేలి ముద్రలు వేశారు. ఎలాగైనా రాజధానిగా అమరావతినే సాధించుకుంటాం అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఉద్యమాలు ఉధృ‌తం చేస్తామని హెచ్చరించారు.

 రాజధాని కోసం రక్తంతో వేలిముద్రలు ... పోరాటం సాగించాలన్న చంద్రబాబు

రాజధాని కోసం రక్తంతో వేలిముద్రలు ... పోరాటం సాగించాలన్న చంద్రబాబు


మూడు రాజధానుల నిర్ణయాన్ని కొనసాగిస్తే రైతుల కన్నీటిలో సీఎం జగన్‌ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. బోగస్‌ కమిటీలతో రాజధానుల నిర్ణయం సరికాదని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. జగన్ కు పాలన చేతకావటం లేదన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు . నిమ్మల చేస్తున్న పోరాటాన్ని, రక్తంతో వేలిముద్రలు వేసిన పోరాట స్పూర్తిని చంద్రబాబు కొనియాడారు. అధినేత చంద్రబాబునాయుడు ఫోన్‌ చేసి రామా నాయుడును అభినందించారు.

 రాజధాని సాధించేవరకు ఉద్యమమే అంటున్న టీడీపీ

రాజధాని సాధించేవరకు ఉద్యమమే అంటున్న టీడీపీ


ఇది ఆరంభమని, అమరావతిని రాజధానిగా సాధించుకునే వరకు ప్రజలందరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఏది ఏమైనా ఎవరు ఎన్ని ఆందోళనలు చేస్తున్నా , రాజధాని రైతులు తీవ్ర మనస్తాపం చెంది ప్రాణాలు కోల్పోతున్నా ఏపీ సర్కార్ మాత్రం మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు స్పష్టంగా అర్ధం అవుతుంది. చూడాలి మరి టీడీపీ నేతలు రాజధాని కోసం సాగిస్తున్న పోరాటం ఏ దశకు చేరుతుందో.

English summary
Telugu Desam Party MLA Nimmala Ramanaidu went on a hunger strike with family members on Monday. Speaking on the occasion, he said, "We will spill the blood and save Amaravati." Anyway, capital will be achieved Amaravati, he said. He warned that the movements would intensify if the government did not withdraw the three capitals decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X