పశ్చిమగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పందులే గుంపులుగా.. వారంతా రాజీనామా చేయాలి! జగన్ ఇంటికి వెళ్లకుంటే..

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి సొంత పార్టీ నేతలపై తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు. బతిమాలితేనే తాను వైసీపీలో చేరానంటూ ఇటీవల రఘురామ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే అధికార పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ క్రమంలో మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు.

బొచ్చులో నాయకత్వం! ఎవడికి కావాలి?: సొంత పార్టీ కార్యకర్తలపై వైసీపీ ఎంపీ రఘురామ సంచలనం(వీడియో)బొచ్చులో నాయకత్వం! ఎవడికి కావాలి?: సొంత పార్టీ కార్యకర్తలపై వైసీపీ ఎంపీ రఘురామ సంచలనం(వీడియో)

పందులే గుంపులుగా.. సింహం సింగిల్‌గానే..

పందులే గుంపులుగా.. సింహం సింగిల్‌గానే..

పందులే గుంపులుగా వస్తాయని.. సింహం సింగిల్‌గా వస్తుందంటూ వ్యాఖ్యానించారు రఘురామ కృష్ణంరాజు. తనను విమర్శించే వాళ్లు రాజీనామా చేస్తే తాను కూడా చేస్తానని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ నేతల విమర్శల నేపథ్యంలో రఘురామ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎదురుదాడి చేశారు.

జగన్ బొమ్మ పెట్టుకుని గెలవండి.. వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు

జగన్ బొమ్మ పెట్టుకుని గెలవండి.. వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు

తనను విమర్శించేవాళ్లు రాజీనామా చేసి మళ్లీ జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచి చూపించాలంటూ రఘురామ సవాల్ విసిరారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో తనపై తిట్ల పర్వం కొనసాగించారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఓ ఇసుక బ్రోకరంటూ దుయ్యబట్టారు. ఇళ్ల స్థలాల్లోనూ ఆయన రూ. కోట్లు దండుకున్నారని ఆరోపించారు. సత్యనారాయణ అరాచకాల గురించి ఆయన మేనల్లుడే చెబుతారని అన్నారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు పైనా అనేక అవినీతి ఆరోపణలున్నాయన్నారు. ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రావు కూడా సీఎం అపాయింట్ మెంట్ దొరక్క బాధపడ్డారు అని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

జగన్ ఇంటికి వెళ్లకుంటే..

జగన్ ఇంటికి వెళ్లకుంటే..

సీఎం జగన్ ఇంటికి కూడా వెళ్లనని ఎన్నికలకు ముందు చెప్పానని, ఆయన ఇంటికి వెళ్లడానికి తాను ఇష్టపడకపోతే ఎయిర్‌పోర్టులో కలిశారని రఘురామ తెలిపారు. ఎమ్మెల్యే ప్రసాదరాజు హుందా గల వ్యక్తి అని అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. అంతేగాక, తన బొమ్మ పెట్టుకుని ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ముదురుతున్న వివాదం..

ముదురుతున్న వివాదం..


కాగా, రఘురామర కృష్ణంరాజు రాజీనామా చేసి గెలవాలని అధికార పార్టీ నేతలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. రఘురామ చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలన్నారు. ఏరు దాటాక తెప్ప తగిలేసే విధంగా రఘురామ వ్యవహారం ఉందని మండిపడ్డారు. ఇష్టం లేకపోతే రాజీనామా చేసి పార్టీ నుంచి వెళ్లిపోవాలి కానీ.. తప్ప ఇలాంటి విమర్శలు చేయకూడదని తేల్చి చెప్పారు. అటు వైసీపీ నేతలు.. ఇటు రఘురామ కృష్ణంరాజు పరస్పర ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో వివాదం ముదురుతోంది. ఈ వ్యవహారం దేనికి దారితీస్తుందో వేచిచూడాలి.

English summary
MP raghurama krishnam raju slams ysrcp leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X