పశ్చిమగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫోన్ ట్యాపింగ్ సీఎం జగన్‌కు తెలిసి జరిగి ఉండకపోవచ్చు, ఎవరు చేశారంటే, రఘురామ సంచలనం...

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం పెను దుమారం రేపింది. తమ ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని ప్రతిపక్ష నేత చంద్రబాబు.. ప్రధాని మోడీకి లేఖ రాయడంతో అగ్గిరాజేసింది. తర్వాత ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు రియాక్టయ్యారు. ఫోన్ ట్యాపింగ్ ముఖ్యమంత్రి జగన్‌కు తెలిసి జరిగి ఉండదని హాట్ కామెంట్స్ చేశారు. సీఎం కోటరిలోని కొందరు చేసి ఉండొచ్చు అని పరోక్షంగా కొందరు నేతలను కౌంటర్ చేశారు. రఘురామ కామెంట్లతో ఫోన్ ట్యాపింగ్ అంశం మరింత హాట్ టాపిక్‌గా మారింది.

జగన్‌కు తెలిసి జరిగి ఉండకపోవచ్చు.. కానీ

జగన్‌కు తెలిసి జరిగి ఉండకపోవచ్చు.. కానీ

రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అంశం మాయని మచ్చ అని రఘురామ అభిప్రాయపడ్డారు. సీఎం జగన్‌కు తెలిసి జరిగి ఉండదని.. ఆయనకు ఆ అవసరం కూడా లేదన్నారు. సీఎం అనుచరులు ట్యాపింగ్ చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. నేతలు, జర్నలిస్టుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారనే అంశం కలవరానికి గురిచేస్తుందన్నారు. ట్యాపింగ్ ఎవరు చేశారనే అంశంపై విచారణ జరిగితే.. ఎవరు చేశారో తెలుస్తోందని చెప్పారు. దీనిపై ఇప్పటికే తాను కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశానని రఘురామ వివరించారు. అవసరమైతే హోంశాఖ కార్యదర్శితో సమావేశమవుతా అన తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతానని రఘురామ స్పష్టంచేశారు.

వారిని పసిగడితే మంచిది.. లేదంటే నష్టమే...

వారిని పసిగడితే మంచిది.. లేదంటే నష్టమే...

సీఎం జగన్ చుట్టూ ఉన్న కొందరు చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకునేలా సలహాలిస్తున్నారని రఘురామ తెలిపారు. వారిని ముందే పసిగడితే మంచిదని.. లేదంటే మీకే నష్టమని తెలిపారు. తమను కలిసే అవకాశం కల్పిస్తే వివరాలు సమర్పిస్తానని తెలిపారు. న్యాయవ్యవస్థపై ఫోన్‌ ట్యాపింగ్‌ నిజమైతే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సోషల్‌ మీడియాలో వైసీపీ నేతలు న్యాయవ్యస్థ, మీడియాపై కామెంట్స్ మంచి పద్ధతి కాదన్నారు. సోషల్‌ మీడియా విభాగంలో పార్టీ కోసం పనిచేస్తూ.. ప్రభుత్వ నుంచి జీతం తీసుకుంటుందని గుర్తుచేశారు.

Recommended Video

Chandrababu Naidu has written a letter to Modi Over YSRCP tapping phones
ఆవ భూముల పేరుతో స్కాం

ఆవ భూముల పేరుతో స్కాం

ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో ఆవ భూముల పేరుతో కుంభకోణం జరిగిందన్నారు. భూముల కొనుగోలు, కేటాయింపుల్లో రూ.120 కోట్ల నుంచి 240 కోట్ల వరకు స్కాం జరిగిందని రఘురామరాజు ఆరోపించారు. దీనిపై ఏసీబీతో విచారణ జరిపించి దోషులను శిక్షించాలని సీఎం జగన్‌ను కోరారు. రాజమండ్రికి కూత వేటు దూరంలో 600 ఎకరాల ఆవభూములను సేకరించి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని గుర్తుచేశారు.

English summary
phone tapping in ap: ap cm jagan mohan reddy don't know about phone tapping ysrcp rebel mp raghu rama krishna raju alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X