పశ్చిమగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బస్టాండ్ లో పబ్లిక్ గా ... కత్తితో పొడిచి యువతిపై ప్రేమోన్మాది ఘాతుకం

|
Google Oneindia TeluguNews

ప్రేమించకపోవటం ఆ యువతి పాలిట శాపమైంది. ఊహించని విధంగా ప్రేమోన్మాది చేసిన ఘాతుకానికి ఓ అమాయకురాలు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది . తనను ప్రేమించలేదన్న పాపానికి నిండుప్రాణాన్ని బలితీసుకోవాలని చూశాడు ఓ ప్రేమోన్మాది. పట్టపగలు పబ్లిక్ గా అందరూ చూస్తూ ఉండగా కళాశాలకు వెళ్లేందుకు బస్సుకోసం బస్టాప్‌లో వేచివున్న యువతిపై కత్తితో దాడిచేసి హత్యా యత్నం చేశాడు. చుట్టూ జనాలు ఉండగానే ఆకస్మాత్తుగా జరిగిన దాడితో అక్కడ ఉన్న వారంతా షాక్ కు గురయ్యారు. అనంతరం తానూ ఆత్మహత్యా యత్నం చేశాడు సదరుప్రేమోన్మాది.

ప్రేమ కలిపింది.. అదే ప్రాణం తీసింది.. ఆ యువతి ఇక దక్కదని..!ప్రేమ కలిపింది.. అదే ప్రాణం తీసింది.. ఆ యువతి ఇక దక్కదని..!

వివరాల్లోకి వెళ్తే పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కవిటం గ్రామంలో ప్రేమించలేదనే కోపంతో యువతిపై కత్తితో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది.ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సుధాకర్‌ గత కొంతకాలంగా ఒక యువతిని ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. అప్పటికే పెళ్ళైన సుధాకర్ భార్యతో ఘర్షణలు పెట్టుకుంటూ ఆమెకు విడాకులు ఇవ్వటానికి సిద్ధం అయ్యాడు. ఇక ఇదే సమయంలో ప్రేమ పేరుతో ఓ యువతి వెంటపడిన సుధాకర్ ఆమె ప్రేమ నిరాకరించటంతో ఆమెపై కక్ష కట్టాడు.

Publicly in Bastand ... A man stabbed a young woman

తనను పట్టించుకోవటం లేదని ఆగ్రహం చెందిన సుధాకర్ ఆమెను హతమార్చేందుకు సిద్ధం అయ్యాడు . అందులో భాగంగా ఈ రోజు ఉదయం సదరు యువతి కళాశాలకు వెళ్లేందుకు బస్టాప్‌లో నిల్చుండడం గమనించి ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలై ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. తీవ్ర గాయాలపాలైన యువతిని ఆస్పత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉంది. యువతిపై దాడి చేసినఅనంతరం తానూ పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నం చేశాడు సుధాకర్ . క్షణాల్లో యువతిపై దాడి చెయ్యటం,పురుగుల మందు తాగటం జరిగిపోయాయి. ఇక ఈ ఘటనతో స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పురుగుల మందు తాగిన ప్రేమోన్మాదిని పోలీసులు పాలకొల్లు ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.

English summary
In West Godavari district, a young woman was brutally attacked and stabbed with a knife. The incident shocked those who were in public at the bus stand. After the attack on the young woman, he drank insecticide and attempted suicide. The situation of the current two is very serious.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X