పశ్చిమగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజు మారినప్పుడల్లా రాజధాని మారదన్న రఘురామ.. పవన్ కళ్యాణ్ దీక్ష శుభ పరిణామం అంటూ ..

|
Google Oneindia TeluguNews

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కేంద్ర ప్రభుత్వం తాజాగా హైకోర్టులో పేర్కొన్న అంశాలపై మాట్లాడారు. రాజధాని మార్పు విషయంలో ఆయన తనదైన శైలిలో స్పందించారు .అంతేకాదు అంతర్వేది ఘటనపై స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరసన దీక్ష చేపట్టడం శుభపరిణామం అని పేర్కొన్నారు. దేవాలయాల పరిరక్షణకు తాను సైతం శుక్రవారం రోజున 8 గంటల దీక్ష చేపడతానని పేర్కొన్నారు.

రఘురామ తన మనవడికి వైఎస్ఆర్ పేరు పెట్టారట .. ఆసక్తికర విషయాలు చెప్పిన ఎంపీరఘురామ తన మనవడికి వైఎస్ఆర్ పేరు పెట్టారట .. ఆసక్తికర విషయాలు చెప్పిన ఎంపీ

అంతర్వేది ఘటన కుట్ర అంటూ అనుమానం

అంతర్వేది ఘటన కుట్ర అంటూ అనుమానం

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం కాలిపోయిన విధానం చూస్తుంటే ఇందులో ఏదో కుట్ర దాగి ఉందని అనుమానం వస్తుంది అన్నారు రఘురామకృష్ణంరాజు. దీన్ని మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన చర్యగా వదిలేయకుండా డీజీపీతో మాట్లాడి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం జగన్ తక్షణమే ఈ ఘటనపై స్పందించాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది చెప్పిందని, రాజధానిపై రాష్ట్రాల తుది నిర్ణయమని, రాష్ట్రం ఎప్పుడో ఆ నిర్ణయం తీసుకుందని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

రాజధాని మార్చటం కుదరదు

రాజధాని మార్చటం కుదరదు


శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులో విశాఖపట్నం పేరు లేదని పేర్కొన్నారు రఘురామ కృష్ణంరాజు . రాజధానిపై ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ మార్చడం కుదరదు అని చెప్పిన రామకృష్ణంరాజు రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ పేర్కొన్నారు.

రాజు మారినప్పుడల్లా రాజధాని మారదని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణంరాజు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు.

 హైకోర్టును రాయలసీమకు తరలించటం మిధ్యే

హైకోర్టును రాయలసీమకు తరలించటం మిధ్యే

ఎక్కడైనా రాష్ట్రప్రభుత్వం రాజధానిపై నిర్ణయం తీసుకున్న తర్వాత కేంద్రం దానికి కావలసిన ఆర్థిక సహకారం అందిస్తుందని పేర్కొన్న రఘురామ రాజధాని అమరావతిలోనే ఉంటుందంటూ తేల్చి చెప్పారు. హైకోర్టు కర్నూలు కు మారుస్తామని చెబుతున్న ప్రభుత్వం, హైకోర్టును రాయలసీమకు తరలించటం మిధ్యే అని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. రాజధాని ఎక్కడికీ పోదని , అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రఘురామ వ్యాఖ్యానించారు .

Recommended Video

Prabhas Adopted Urban Forest ప్రభాస్‌ సంచలన నిర్ణయం.. 1650 ఎకరాల అటవీ భూమి దత్తత !
కేంద్రం అఫిడవిట్ లో చెప్పిందే జరిగింది .. కన్ఫ్యూజ్ కాకండి

కేంద్రం అఫిడవిట్ లో చెప్పిందే జరిగింది .. కన్ఫ్యూజ్ కాకండి

విజిలెన్స్ విచారణ పేరుతో రాజధాని ప్రాంతంలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు పేమెంట్స్ ఇవ్వకుండా ఆపడం దురదృష్టకరమని రఘురామకృష్ణంరాజు విచారం వ్యక్తం చేశారు. కేంద్రం నుండి డబ్బులు విడుదలైనా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాష్ట్రానికి వచ్చినా రైతులకు చేరడం లేదని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. కేంద్రం రాజధాని విషయంలో జోక్యం చేసుకోమని అఫిడవిట్ లో చెప్పిన విధంగా జరిగిపోయిందని ,అది అమరావతినే రాజధానిగా నిర్ణయించిందని రఘురామ లాజిక్ చెప్పారు .

English summary
Narasapuram MP Raghurama Krishnamraju spoke on the issues raised by the Central Government in the High Court on the Andhra Pradesh capital recently. He responded in his own style to the change of capital .He also responded to the Antarvedi incident. Janasena chief Pawan Kalyan said the protest was a good omen. He also said that he would conduct an 8-hour initiation on Friday for the protection of the temples.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X