పశ్చిమగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కంపెనీ నిర్లక్ష్యం .. తరచూ ఆగిపోతున్న లిఫ్ట్, వృద్ధుడి వినూత్న నిరసన

|
Google Oneindia TeluguNews

భీమవరం : సమస్య సాధన కోసం నిరసన తెలుపడం సహజం. అదీ రహదారిపైనే, సంబంధిత కార్యాలయం వద్దొ చేస్తుంటారు. కొన్నిసార్లు అధికారుల అనుమతి తీసుకొని మరీ ఆందోళన చేయాల్సి ఉంటుంది. కానీ ఏపీలో ఓ వృద్ధుడి వినూత్న నిరసన తెలిపాడు. సంబంధిత కంపెనీ నిర్లక్ష్యానికి తన ప్రాణాలతో చెలగాటమాడటంతో ఆందోళన నెలకొంది.

 ఏం జరిగిందంటే ..?

ఏం జరిగిందంటే ..?

పక్క ఫొటోలు కనిపిస్తున్న వ్యక్తి పేరు రామరాజు. ఇతని స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం. ఇక్కడే రాజరాజేశ్వరి ఎవెన్యూలో తన ఫ్యామిలీతోపాటు ఉంటున్నాడు. ఇక్కడి వరకు ఓకే .. వీరు ఉండే అపార్ట్‌మెంట్‌లో తరచూ లిప్ట్ సమస్య వస్తోంది. ఇదివరకు సమస్య రాగా ... స్థానిక మెకానిక్‌తో పరిష్కరించుకున్నారు. అయితే సోమవారం మరోసారి లిఫ్ట్ ఇబ్బందిపెట్టింది. అందులో ఉన్న రామరాజు .. ఇక తన విశ్వరూపాన్ని చూపించాడు. స్థానిక మెనానిక్‌ను పిలువొద్దని అల్టిమేటం జారీచేశారు. దీంతో బయట ఉన్న ఫ్యామిలీ మెంబర్స్, ఇతరులు ఆందోళన చెందారు. కంపెనీ ప్రతినిధులు వచ్చి .. లిప్ట్ ఇబ్బంది పెట్టడానికి గల కారణం వివరిస్తేనే వస్తానని మొండికేసి కూర్చున్నాడు.

ఆగిన లిప్ట్ ..

ఆగిన లిప్ట్ ..

పై నుంచి కిందకి వస్తుండటా లిప్ట్ ఆగిపోయింది. నాలుగో ప్లోర్ దాటాక లిప్ట్ నిలిచిపోయింది. గతంలో కూడా సాంకేతిక సమస్యతో లిప్ట్ నిలిచిపోయిన దాఖలాలు కళ్లముందే కనబడుతున్నాయి. అయితే స్థానిక మెకానిక్ సరిజేయడంతో అప్పటికప్పుడు సమస్య పరిష్కారమైంది. కానీ దీనికి శాశ్వత పరిష్కారం ఏంటని రామరాజు ప్రశ్నిస్తున్నాడు. విజయవాడ నుంచి కంపెనీ ప్రతినిధులు వచ్చేవరకు తాను బయటకు రాబోనని భీష్మించుకొని కూర్చున్నాడు. దాదాపు 4 గంటల నుంచి రామరాజు లిప్ట్‌లో ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బయటకు రావాలని కోరిన ఫలితం లేకపోవడంతో .. స్థానిక అధికారులకు సమాచారం అందించారు. సదరు కంపెనీకి కూడా ఇన్ఫామ్ చేసినట్టు విశ్వసనీయంగా తెలసింది.

ఇది సరికాదు

ఇది సరికాదు

ఏదేమైనా లిప్ట్ బాగోలేకపోతే .. అందులో ఉండి నిరసన తెలుపడం ఏంటనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. విజయవాడ నుంచి భీమవరం వరకు కంపెనీ ప్రతినిధులు వచ్చేసరికి జరుగరానిది ఏమైనా జరిగితే ఎవరూ బాధ్యులు అని ప్రశ్నిస్తున్నారు. సమస్యపై ఆందోళన ఓకే .. కానీ పనిచేయని ఆ లిప్ట్ నుంచి నిరసన తెలుపడం మాత్రం సరికాదని అంటున్నారు. లిప్ట్ నుంచి కిందకొచ్చి .. కంపెనీపై న్యాయ పోరాటం చేయాలని సూచిస్తున్నారు.

English summary
Rama rahu is the Bhimavaram of the West Godavari district. He lives here on Rajarajeswari Avenue with his family. They often have an issue with their apartment. So far the problem has been solved ... with the local mechanic. But once again, Monday's lift was embarrassing. An ultimatum was issued not to call the local mecanic. Representatives of the company came .. sat down to explain why the lift was embarrassing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X