పశ్చిమగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీలో విషాదం: తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా కన్నుమూత -కరోనా నుంచి కోలుకున్నా..

|
Google Oneindia TeluguNews

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వై.టీ. రాజా(69) కన్నుమూశారు. తెలుగుదేశం పార్టీలో మోస్ట్ సీనియర్ నేత అయిన రాజా.. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల కొవిడ్-19 వ్యాధికి గురై, తిరిగి కోలుకున్నప్పటికీ, ఆదివారం ఉదయం ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు.

రాజా మృతితో కుటుంబ సభ్యులు, అనుచరులు కన్నీరుమున్నీరవుతున్నారు. తణుకులో, టీడీపీలో విషాద ఛాయలు అలముకున్నాయి. రాజా చనిపోయిన సంగతి తెలుసుకున్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పలువురు కార్యకర్తలు, నేతలు హైదరాబాద్‌కు పయనమయ్యారు. రాజా మృతిపట్ల టీడీపీ చీఫ్ చంద్రబాబు, జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తో పాటు పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

16న జగన్ భవితవ్యం: తర్వాతి సీఎం ఎవరు? -సుప్రీం నోటీసులు -సాయిరెడ్డికి చుక్కలు: ఎంపీ రఘురామ16న జగన్ భవితవ్యం: తర్వాతి సీఎం ఎవరు? -సుప్రీం నోటీసులు -సాయిరెడ్డికి చుక్కలు: ఎంపీ రఘురామ

Tanuku ex-mla, tdp leader yt raja passed away after recovering from covid-19

Recommended Video

AP Assembly Elections 2019 : ఎన్టీఆర్ 'శాపం'ఫలించబోతోంది జోస్యం చెప్పిన మోహన్ బాబు || Oneindia

వైటీ రాజా తెలుగుదేశం పార్టీ తరఫున 1999లో తణుకు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2004, 2009లో టీడీపీ తరఫునే పోటీచేసిన ఆయన పరాజయం పాలయ్యారు. 2014 నుంచి ఆయన రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు. 2014లో ఆరిమిల్లి రాధాకృష్ణను టీడీపీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాధాకృష్ణ గెలుపుకోసం రాజా కృషిచేశారు.

English summary
West Godavari District tdp senior leader, Former MLA of Tanuku Assembly constituency YT Raja passed away. He was treated at a private hospital in Hyderabad for the past few days and passed away on Sunday morning. He recently recovered from covid-19. chandrababu and other leaders expressed grief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X