పశ్చిమగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రాంజీ కన్నుమూత: అవయవదానం

|
Google Oneindia TeluguNews

ఏలూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఏలూరు లోక్‌సభ మాజీ సభ్యుడు మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ కన్నుమూశారు. ఆయన వయస్సు 37 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాంజీ అవయవాలను దానం చేయడానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఆయన భౌతికకాయాన్ని కాస్సేపట్లో ఏలూరులోని మాగంటి నివాసానికి తరలిస్తారు. అనంతరం స్వగ్రామం చాటపర్రులో అంత్యక్రియలను నిర్వహిస్తారు. రాంజీ మరణం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Recommended Video

#TOPNEWS : International Women's Day 2021 | టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రాంజీ కన్నుమూత!!

ఈ నెల 3వ తేదీన రాంజీ ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఇదివరకు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. గుండెపోటుకు గురయ్యారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఆయనను విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించి, అత్యవసర చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటంతో డిశ్చార్జి చేశారు. ఏలూరుకు వెళ్లిన తరువాత మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో అక్కడే ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగానే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హుటాహుటిన విజయవాడ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని ఏలూరుకు తరలిస్తారు. అనంతరం చాటపర్రులో అంత్యక్రియలను నిర్వహిస్తారని ఏలూరు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

TDP former MP Maganti Babu son and young leader Maganti Ramji passes away

రాంజీ మరణవార్త తెలుగుదేశం పార్టీలో విషాదాన్ని నింపింది. యువనేత ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతోన్న ఆయన అకాల మరణానికి గురి కావడం పట్ల టీడీపీ నేతలు దిగ్భ్రాంతికి గురి అవుతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దేవినేని అవినాష్ సహా పలువురు సంతాపం తెలిపారు. అన్నా అని పిలిచే ఆ పిలుపు ఇక విన‌ప‌డ‌దంటూ నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశానికి అండ‌గా ఉంటానంటూ జెండా ప‌ట్టిన ప‌సుపు సైనికుడి మ‌ర‌ణం పార్టీకీ, తనకు తీర‌ని లోటు అని పేర్కొన్నారు.

English summary
TDP’s former Eluru MP Maganti Babu’s son Maganti Ramji passes away at Vijayawada hospital. Earlier, he was reportedly attempted suicide at his Eluru residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X