• search
  • Live TV
పశ్చిమగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అత్యాచార యత్నం చేసి, చనిపోయిందని బురదమట్టిలో కప్పేసి యువతిపై దారుణం

|

ఎన్ని చట్టాలున్నా మహిళల మీద దాడులు మాత్రం ఆగడం లేదు. రాత్రి 11 గంటల సమయంలో నిద్ర లేచి ఇంటి బయట ఉన్న బాత్రూం కి వెళ్ళిన యువతిని నోరు నొక్కి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేశాడు ఓ కామాంధుడు. అంతటితో ఆగక ఆమె ప్రతిఘటించిందని , తీవ్రంగా కొట్టి, గొంతు నులిమాడు. దీంతో స్పృహ కోల్పోయిన యువతిని చనిపోయిందని భావించి దుక్కి దున్నిన, నీరు పెట్టిన బురద మట్టి లోకి నెట్టి కాలితో బలంగా తొక్కి, ఆమెపై బురద మట్టిని కప్పేసి అక్కడి నుండి పరారయ్యాడు సదరు శాడిస్టు గాడు.

ఏపీలో విద్యుత్ కోతలు లేవన్న మంత్రి సుచరిత .. జనాలు భ్రమ పడుతున్నారా అని ప్రశ్నిస్తున్న టీడీపీ

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం .. పంతపోలాల్లోకి లాక్కెళ్ళి అత్యాచారయత్నం .. దారుణ హింస

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం .. పంతపోలాల్లోకి లాక్కెళ్ళి అత్యాచారయత్నం .. దారుణ హింస

పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం గ్రామం లో జరిగిన దారుణం ఇది. మహిళలకు ఇంటా, బయట రక్షణ లేదని తెలియజేస్తున్న ఉదంతమిది.

పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలంలోని ఓ గ్రామంలో అత్యాచారయత్నం చేసి, మహిళను చంపేందుకు యత్నించిన ఘటనలో బురదలో పూడ్చి పెట్టబడిన సదరు యువతి రెండు గంటల తర్వాత స్పృహలోకి వచ్చింది. ఒంటినిండా గాయాలతో, ఒళ్లంతా బురదతో, కదలలేని మెదలలేని నిస్సహాయ స్థితిలో ఇంటికి వచ్చిన యువతికి ప్రస్తుతం వైద్య చికిత్స అందిస్తున్నారు.

ప్రతిఘటించిందని యువతిని దారుణంగా కొట్టి బురదలోకి తొక్కి పూడ్చి పెట్టిన రాక్షసుడు

ప్రతిఘటించిందని యువతిని దారుణంగా కొట్టి బురదలోకి తొక్కి పూడ్చి పెట్టిన రాక్షసుడు

ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్న యువతిని ఇంటికి ప్రహరీ గోడ లేకపోవటంతో రాత్రి బాత్రూంకి వెళ్తే బలవంతంగా పంటపొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారయత్నం చేసి, చిత్రహింసలకు గురి చేసి బురద మట్టి లో పూడ్చి పెట్టాడు ఓ కామాంధుడు . ఇక ఈ ఘాతుకానికి పాల్పడింది అదే గ్రామానికి చెందిన రాజేష్ అని గుర్తించి అతనిపై ఫిర్యాదు చేశారు బాధితురాలి తల్లిదండ్రులు.

ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న రాజేష్ కోసం అతని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతుండగా రాజేష్ పోలీసులకు లొంగిపోయాడు.

రెండు గంటల నరకం తర్వాత స్పృహలోకి వచ్చిన యువతి... కేసు నమోదు

రెండు గంటల నరకం తర్వాత స్పృహలోకి వచ్చిన యువతి... కేసు నమోదు

అత్యంత దారుణంగా హింసకు గురై రెండు గంటల పాటు మృత్యువుతో పోరాడిన యువతి తనపై దాడి చేసిన రాజేష్ ను కఠినంగా శిక్షించాలని కోరుతోంది. అయితే సదరు నిందితుడు రాజేష్ గతంలో కూడా అమ్మాయిలను ప్రేమించమంటూ వేధించే వాడని, అప్పుడే అతని మీద ఫిర్యాదు ఇచ్చి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి తమ బిడ్డకు వచ్చేది కాదని బాధితురాలి తరపు బంధువులు చెప్తున్నారు.

ఏది ఏమైనా ఎన్ని చట్టాలొచ్చినా, మహిళలకు మాత్రమే రక్షణ ఉండడం లేదు. ఎప్పుడు ,ఎవరు ,ఎక్కడ, ఎలా మహిళలను వేధింపులకు గురి చేస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక ఇలాంటి దారుణ పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఇలాంటి ఘాతుకానికి పాల్పడిన వారికి వెంటనే కఠిన శిక్షలు అమలు చేసేలా చట్టాల్లో మార్పు రావాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నేరస్తులకు శిక్షపడేలా చేయాలి.

English summary
A young girl who was working as a teacher in a private school, was wentto the bathroom at night 11pm .. due to lack of a wall a sadist kidnapped her and raped, tortured and buried in mud. Rajesh of the same village identified the victim and lodged a complaint with the parents of the victim.According to the complaint of the victim, Rajesh had surrendered to the police while the case was being investigated .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more