• search
  • Live TV
పశ్చిమగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బైక్ వెనుక కూర్చొని కసితీరా ఖతం చేసింది -మోసం చేసిన ప్రియుడిపై యువతి ఆక్రోషం -పశ్చిమగోదావరిలో

|

ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో అతణ్ని కత్తితో పొడిచి హత్య చేసిన యువతి ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అతను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు.. ఎవరికీ తెలియకుండా దొంగచాటుగా తాళికట్టాడు.. కానీ తనువుకు లేని కారణాన్ని చూపి.. అందరి ముందూ పెళ్లికి నిరాకరించాడు.. అంతటితో ఆగకుండా ఆమెపై అనుమానంతో వేధింపులకు గురిచేశాడు.. సోషల్‌ మీడియాను వేదికగా నీచానికి ఒడిగట్టాడు.. ఇష్టపడ్డవాడే ఇంత దారుణంగా మోసం, అవమానం చేస్తుంటే సహించలేక ఆ యువతి అతి తీవ్ర నిర్ణయం తీసుకుంది.. పోలీసులు చెప్పిన వివరాలివి..

హైకోర్టు అనుకూలం!: జగన్ ముహూర్తం -విశాఖకు రాజధాని తరలింపు -తేల్చేసిన సర్కారు సలహాదారుహైకోర్టు అనుకూలం!: జగన్ ముహూర్తం -విశాఖకు రాజధాని తరలింపు -తేల్చేసిన సర్కారు సలహాదారు

పశ్చిమ గోదావరి జిల్లాలో..

పశ్చిమ గోదావరి జిల్లాలో..

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమై, ఏపీలో సంచలనం రేపిన ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం రాత్రి జరిగింది. తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామానికి చెందిన గర్సికూటి పావని కొవ్వూరు ఏబీఎన్‌ అండ్‌ పీఆర్‌ఆర్‌ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. అయితే తాడేపల్లిగూడెంలో ఇంటర్‌ చదువుతున్న సమయంలో అంబటి కరుణ తాతాజీనాయుడు అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను వలలో వేసుకున్నాడు. కొన్నాళ్లపాటు ఇద్దరు సన్నిహితంగా మెలిగారు. కానీ..

కులాల సాకుతో మోసం..

కులాల సాకుతో మోసం..

శారీరక సంబంధానికి అడ్డురాని కులం సాకుతో తప్పించుకోవాలని అతను ప్రయత్నించాడు. పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి.. కులాలు వేరు కావడంతో అతడు పెళ్లికి నిరాకరించాడు. అయితే యువతి ఒత్తిడి చేయడంతో దొంగచాటుగా తాళి కట్టాడు. కొంతకాలం సహజీవనం కూడా చేశాడు. ఈ క్రమంలో.. అధికారికంగా అందరిముందు తనను పెళ్లి చేసుకోవాలని పావని కోరగా అందుకు ససేమిరా అన్నాడు. అంతేగాకుండా పావనిపై అనుమానం పెంచుకుని, సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో అతడి వేధింపులు తాళలేక యువతి తన స్వగ్రామమైన మలకపల్లి వచ్చేసింది. కాగా..

అయినా వదల్లేదు.. ఆఖరి చూపు..

అయినా వదల్లేదు.. ఆఖరి చూపు..

కొంతకాలంగా వేధింపులకు పాల్పడుతూ.. సోమవారం యువతికి ఫోన్‌ చేసి మాట్లాడే పని ఉందని ఐ.పంగిడి జంక్షన్‌కి రావాలని తాతాజీనాయుడు కోరాడు. దీంతో పావని అక్కడికి వచ్చింది. అక్కడ ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తడంతో తనను ఇంటి దగ్గర దింపి రావాలని కోరడంతో మోటారు సైకిల్‌పై బయల్దేరారు. అయితే అప్పటికే అతడి ప్రవర్తనతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె అతడిని హతమార్చాలని నిర్ణయించుకుంది. బైక్ వెనకాలే కూర్చొని కసితీరా..

ప్రియుణ్ని చంపి.. పోలీసుల ముందుకు..

ప్రియుణ్ని చంపి.. పోలీసుల ముందుకు..

గతంలోనే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన చాకుతో అతడిపై దాడి చేసింది పావని. ధర్మవరం గ్రామ శివారుకు వచ్చేసరికి తాతాజీ నాయుడు మెడపై పొడిచింది. దీంతో మోటారు సైకిల్‌ పైనుంచి అతడు పడిపోవడంతో పలుచోట్ల కత్తితో కసిదీరా పొడిచింది. ఘటన స్థలంలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం పావని పోలీసులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చి లొంగిపోయింది. రూరల్‌ ఎస్‌ఐ కె.రామకృష్ణ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, విచారణ చేపట్టారు.

English summary
In a horrific incident, a young woman killed her boyfriend on suspicion of loving someone else took place between Dharmavaram and Kapavaram villages in Kovvur Mandal of West Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X