పశ్చిమగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రఘురాముడిపై వైసీపీ కౌంటర్లు - ఇష్టం లేకపోతే వెళ్లిపో- లేదంటే రాజీనామా చేసి గెలవాలని సవాల్..

|
Google Oneindia TeluguNews

వైసీపీ తరఫన ఎంపీగా గెలిచి కొన్ని రోజులుగా సొంత పార్టీతో పాటు అధినేత జగన్ పై విమర్శలకు దిగుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ వ్యూహం మార్చింది. రఘురామకృష్ణంరాజుపై ఆయన సొంత జిల్లా పశ్చిమగోదావరికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రి ఇవాళ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా కులాలపై ఎంపీ చేసిన వ్యాఖ్యలకు వీరు కౌంటర్ ఇచ్చారు.

వైసీపీ కౌంటర్ అటాక్...

వైసీపీ కౌంటర్ అటాక్...

ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే సొంత పార్టీపై కులాల పేరుతో విమర్శలకు దిగిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అసెంబ్లీ జరుగుతుండగానే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మంత్రి శ్రీ రంగనాథ రాజు ఎంపీ రఘురామకృష్ణంరాజు తీరుపై సీరియస్ అయ్యారు. ఎంపీ కులాల ప్రస్తావన తీసుకురావడం సరికాదని, కుల చిచ్చు
పెట్టొద్దని ఆయనకు సూచించారు. సీఎం జగన్ మూడు ఎమ్మెల్యేలు స్థానాలు, ఒక ఎంపీ స్థానం క్షత్రియులు ఇచ్చారని రంగనాథరాజు గుర్తు చేశారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఎమ్మెల్యేలు రెడ్ జోన్లలో సహాయక చర్యలు చేపడుతుంటే కలెక్షన్స్ చేస్తున్నారని ఎంపీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఇష్టం లేకుంటే పార్టీని వీడాలని, క్రమశిక్షణ గల పార్టీలో రఘురామకృష్ణంరాజు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సొంత ఇమేజ్ లేదు, బ్యానర్లు కట్టే వారు లేరు...

సొంత ఇమేజ్ లేదు, బ్యానర్లు కట్టే వారు లేరు...


ఎంపీ రఘురామకృష్ణంరాజు తీరుపై పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యన్నారాయణ కూడా తీవ్రంగా మండిపడ్డారు. రఘురామకృష్ణంరాజుకు సొంత ఇమేజ్ లేదని, కనీసం బ్యానర్లు కట్టే కార్యకర్తలు కూడా లేరని కొట్టు ఎద్దేవా చేశారు. సీఎం జగన్ దయతో టికెట్ ఇస్తే ఆయన ఎంపీగా గెలిచారని కొట్టు గుర్తు చేశారు.
నరసాపురం పార్లమెంటు పరిధిలో తిరిగితే తెలుస్తుందని రఘురామకృష్ణంరాజుకు ఆయన సూచించారు. ఎంపీ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లున్నారని, అక్కడ కూడా ఇదే పరిస్ధితి ఉంటుందని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తెలిపారు.

ఎంపీ సీటు కోసం మూడు పార్టీలు..

ఎంపీ సీటు కోసం మూడు పార్టీలు..

2014 ఎన్నికలకు ముందు సీఎం జగన్ నరసాపురం పార్లమెంటు ఇన్ ఛార్జ్ గా నియమించినా ఆయన వ్యవహారశైలి నచ్చక పార్టీ నుంచి బహిష్కరించారని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గుర్తు చేశారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏనాడూ ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా కూడా గెలవలేదన్నారు. ఎంపీ సీటు కోసం మూడు పార్టీలు మారాడని, చివరికి జగన్ ఫొటో పెట్టుకుని మాత్రమే ఆయన ఎంపీగా గెలిచాడని ఎమ్మెల్యే శ్రీనివాస్ తెలిపారు. భీమవరంలో రఘురామకృష్ణంరాజు కంటే తనకే ఎక్కువ ఓట్లు వచ్చాయని ఎమ్మెల్యే గుర్తు చేశారు. సీఎం సహాయనిధికి స్వచ్చందంగా నిధులు ఇచ్చిన ప్రజలను ఎంపీ అవమానిస్తున్నారని గ్రంధి విమర్శించారు.

ఏరు దాటాక తెప్ప తగలేస్తున్నారు...

ఏరు దాటాక తెప్ప తగలేస్తున్నారు...


నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏరు దాటాక తెప్ప తగలేసే రకమని తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. ఎంపీ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. ఇసుక అక్రమార్కులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందన్నారు. రఘురామకృష్ణంరాజు తీరుపై నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు కూడా మరోసారి మండిపడ్డారు. 2014 ఎన్నికలకు ముందు ఆయన 90 రోజులు పార్టీలో ఉన్నారని, 2019 ఎన్నికలకు 20 రోజుల ముందు పార్టీలో చేరారని ప్రసాదరాజు గుర్తు చేశారు. జగన్ ఛరిష్మాలో గెలిచి ఈ రోజు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రఘురామకృష్ణంరాజుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసాపురం ఎంపీ పదవికి రాజీనామా చేసి సొంతంగా గెలవాలని ఆయనకు ప్రసాదరాజు సవాల్ విసిరారు..

English summary
ysrcp has lauched counter attack to their own mp raghurama krishnam raju for his controversial comments about party and cm jagan. ysrcp mlas and minister ranganadha raju from west godavari district strongly objected mp's recent comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X