జగన్ దెబ్బ.. రఘురామరాజు అబ్బా - జస్టిస్ రమణపై ఇవి చూశారా? 777 రెడ్లకు పదవులు: వైసీపీ ఎంపీ
జగన్ వర్సెస్ జడ్జిలుగా భావిస్తోన్న ఉదంతంలో ఏపీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ బీఎస్ఏ స్వామి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రస్తుత సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణకు ఉన్న అనుబంధం గురించి జస్టిస్ స్వామి వెలిబుచ్చిన అభిప్రాయాలను జగన్ కు చెందిన సాక్షి పత్రిక ప్రచురించడంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం ఢిల్లీలో 'రాజధాని రచ్చబడ్డ' కార్యక్రమంలో మాట్లాడుతూ రఘురామ అనూహ్య వ్యాఖ్యలు చేశారు.

జస్టిస్ స్వామి ఏమన్నారంటే..
దళిత, బలహీన వర్గాలకు గొంతుకగా నిలిచిన జస్టిస్ బీఎస్ఏ స్వామి.. హైకోర్టులో కులతత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అదే క్రమంలో 2005లో ‘ఎ క్యాస్ట్ క్యాప్చర్ ఏపీ జ్యూడీషియరీ' అనే పుస్తకం రాశారు. అందులో జస్టిస్ రమణ-చంద్రబాబులపై కీలక వ్యాఖ్యాలు రాశారు. చంద్రబాబు ఆంతరంగిక కాపలాదారుగా జస్టిస్ రమణ వ్యవహరిస్తారని, బాబుకు సంబంధించిన ఏ ఫైలునూ రమణ క్లియర్ చేసేవారు కాదని, సీనియర్ న్యాయమూర్తులు సైతం ఆయన చెప్పినట్లు వినేవారని, టీడీపీ రక్షకుడిగా ఆయన వ్యవహరించారని జస్టిస్ స్వామి తన పుస్తకంలో చెప్పిన అభిప్రాయాలను ఇవాళ(అక్టోబర్ 20న సాక్షి పత్రిక ప్రచురించింది. దీనిపై వైసీపీ ఎంపీ రఘురామ ఘాటుగా స్పందించారు. ఎంపీ ఎమన్నారో ఆయన మాటల్లోనే..
క్రిస్మస్ నాటికి చెదపురుగులు నాశనం-జగన్కు మోదీ మద్దతు వట్టి సొల్లు - ఎంపీ రఘురామ షాకింగ్ కామెంట్స్

జస్టిస్ స్వామి కాంటెక్స్ వేరు..
‘‘హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ బీఎస్ఏ స్వామి చాలా మంచి జడ్జి. దళితులు, వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచారు. గతంలో బీఎస్పీ పార్టీలో చాలా కాలం పనిచేసి, మళ్లీ లా ప్రాక్టీస్ చేశారు. తన పంథాలో ఉన్నతకులాలపైనా పోరాటం చేసిన ఆయన.. చాలా కాలం కిందట.. పలువురు అగ్రకుల జడ్జిలపై అభిప్రాయాలను పుస్తకంగా వేశారు. నాడు అగ్రవర్ణాలపై పోరాటంలో భాగంగా జస్టిస్ స్వామి పుస్తకం రాస్తే.. ఆ కాంటెక్స్ కు భిన్నంగా తగుదునమ్మా అంటూ సాక్షి పత్రిక ఇవాళ ప్రచురించింది. పెండింగ్ కేసుల రోజువారీ విచారణ ప్రారంభం కావడంతో ఏం ముంచుకొస్తుందో అనే భయంతోనే మావాళ్లు న్యాయవ్యవస్థపై దాడి మొదలుపెట్టారు. నిజంగా వీళ్లకు..
అల్పపీడనం:ఏపీలో భారీ వర్షాలు-ఈసారి అధిక వర్షపాతం-ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ సర్వే - కీలక ఆదేశాలు

ఏడాదిన్నరలో 777 మంది రెడ్లకు..
నాడు జస్టిస్ బీఎస్ఏ స్వామిగారు అగ్రకులాలపై పోరాటం చేస్తూ రాసిన వ్యాఖ్యల్ని వాడుకుంటోన్న వైసీపీ.. ఇవాళ నిస్సిగ్గుగా తన అగ్రకులానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తుండటం పచ్చి నిజం. వైసీపీ ప్రభుత్వానికి అసలు కులం లేదని సీఎం జగన్ చెబుతున్నారు. కానీ అది ఎంత అబద్ధమంటే.. గత ఏడాదిన్నరలో మొత్తం 777 మంది రెడ్డి కులస్తులకు వివిధ ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పోస్టులు కట్టబెట్టారు. నా దగ్గర జాబితా మొత్తం ఉంది. వైసీపీకి కులమేకాదు.. మతం కూడా లేదని జగన్ కరాకండిగా చెబుతారు. కానీ వాస్తవం మరోలా ఉంది. చర్చి నిర్మాణాలకు ప్రభుత్వ నిధులు కేటాయిస్తూ జీవోలు జారీ చేశారు. మత సంస్థలకు నిధులు ఇవ్వరాదని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. ఈ విధంగా రాజ్యాంగం, న్యాయవ్యవస్థల్ని కించపరుస్తు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు..

జగన్ దెబ్బ.. రఘురామ అబ్బా
మొన్న పార్లమెంటరీ కమిటీ చైర్మన్ పదవి పోయిననాడు వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో హడావుడి చేశాయి.. ‘రాజుగారిని పీకేశారు'.. ‘జగన్ దెబ్బకు రఘురామరాజు అబ్బా..' అంటూ పోస్టులు పెట్టారు. అరే బాబూ, అది నేను తెచ్చిన పోస్టు, దాని కాలపరిమితి ఏడాది. అదే రోజు నాతో పాటు మరో 9 కమిటీలకు చైర్మన్లను మార్చారు. బీఎస్పీకి చెందిన శ్యాంసుందర్ ను కూడా ఓ కమిటీ నుంచి తొలగించారు. దానికి కూడా జగన్ దెబ్బ.. శ్యాంసుందర్ అబ్బా అంటారా? అసలీ విషయంతో జగన్ కు సంబంధమేలేదు. నేను ఇప్పటికీ వైసీపీ సభ్యుడినే. నన్ను డిస్ క్వాలిఫై చేయలేరు.. ఇంకా పార్టీ నుంచి బహిష్కరించనూ లేదు కాబట్టి బందీగా కొనసాగుతున్నాను. నన్ను వీళ్లు పీకేది.. పీకబోయేది ఏమీ లేదు'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.