పశ్చిమగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీబీఐ దాడిలో ఎంపీ బాలశౌరి పాత్ర - రష్యన్ యువతితో అది తప్పేంటి? - ఎంపీ రఘురామ తాజా బాంబు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వరుసగా చోటుచేసుకుంటోన్న పరిణామాల్లో మొదటిది.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీబీఐ దాడి. పంజాబ్ నేషనల్ బ్యాంకు కాన్సార్టియం నుంచి రుణాలు పొంది ఎగవేశారనే ఆరోపణల మేరకు గత వారం ఎంపీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ.. 11 చోట్ల సోదాలు నిర్వహించడం తెలిసిందే. నాటి దాడిలో తన సహచర ఎంపీ బాలశౌరి పాత్ర గురించి రఘరామ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..

జస్టిస్ రమణ పిల్లలపై ఫాల్తూ కేసు - జగన్‌కు 60 నెలల జైలు - ఏపీలో ఆర్టికల్ 356: ఎంపీ రఘురామజస్టిస్ రమణ పిల్లలపై ఫాల్తూ కేసు - జగన్‌కు 60 నెలల జైలు - ఏపీలో ఆర్టికల్ 356: ఎంపీ రఘురామ

బాలశౌరిని సీబీఐ ఎందుకు వదిలింది?

బాలశౌరిని సీబీఐ ఎందుకు వదిలింది?

‘‘మా పార్టీకే చెందిన మచిలిపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా సాక్షి మీడియాలో బినామీ పేర్లతో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. కాబట్టే మొన్నటి సీబీఐ దాడుల నుంచి ఆయన పేరును తప్పించే ప్రయత్నం జరుగుతోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నవాళ్లలో ఆయన కూడా ఉన్నారు. బాలశౌరి ఇటీవల సుమారు పది సార్లు ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వెళ్లారు. మొన్న ఆరో తేదీన బ్యాంకు అధికారులను వెంట తీసుకొచ్చి, సీఎంకు కలిపించింది కూడా ఆయనే. అందరూ కుమ్మక్కై అప్పటికప్పుడే ఎఫ్ఐఆర్, సోదాలకు ఆదేశాలిచ్చారు. దీనిపై నేను కచ్చితంగా న్యాయపోరాటం చేస్తాను. ఇకపోతే..

చంద్రబాబు ఆయువుపట్టుపై దాడి - జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ సంచలనం -ప్రధాని మోదీని కలిసిన రోజేచంద్రబాబు ఆయువుపట్టుపై దాడి - జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ సంచలనం -ప్రధాని మోదీని కలిసిన రోజే

రష్యన్ వనితలతో వైసీపీ ప్రతినిధి

రష్యన్ వనితలతో వైసీపీ ప్రతినిధి


నాకు సంబంధించిన ఫొటో ఒకటి నిన్నటి నుంచి వైరల్ చేస్తున్నారు. సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డిల పేర్లతో నా ఫొటోపై కామెంట్లు చేస్తున్నారు. ఎప్పుడో మూడు నెలల కిందటి ఫొటో అది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ ఎంపీ నిర్వహించిన ఫంక్షన్ అది. ఈ మధ్య చాలా వేడుకలకు రష్యన్ వనితలను తెప్పిస్తున్నారు. వైసీపీ అధికార ప్రతినిధుల్లాగా ఆ అమ్మాయిలపై నేను చేతులు వేయలేదు. వాళ్లు ఎవరనేది పార్టీకి వచ్చిన అందరికీ తెలుసు. నేను దూరంగా నిలబడి షాంపెయిన్ తాగానంతే. షాంపెయిన్ తాగడం తప్పు కూడా కాదు. ఎంతసేపూ జగన్ సర్కారు సరఫరా చేస్తోన్న ప్రెసిడెంట్ మెడల్, నోబుల్ ప్రైజ్ లాంటి చెత్త మందుతాగి చావమంటారా? ఈ ఫొటోలో తప్పేముంది?

ఆడవాళ్లు సీరియల్స్ చూడటం తగ్గించాలి

ఆడవాళ్లు సీరియల్స్ చూడటం తగ్గించాలి

మన రాజధాని అమరావతి కోసం 300 రోజులుగా ఉద్యమం చేస్తోన్న రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్లా మద్దతు పలకడం శుభపరిణామం. ఇదే గాంధేయవాద ధోరణిలో ఆ 29 గ్రామాలతోపాటు దేశంలో ఉన్న తెలుగువాళ్లంతా నిరసన తెలపాలి. రాజధాని రిఫరెండంగా ఎన్నికలు పెడితే రాజీనామాకు సిద్ధమని సవాలు చేసినా మా పార్టీవాళ్లు ముందుకు రాలేదు. సోషల్ మీడియాలో పెట్టీ కేసులు పెడతారని భయపడకుండా ముందుకు వెళదాం. అమరావతి ఉద్యమాన్ని మహిళలే ముందుండి నడిపిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర మహిళలు కాస్త టీవీ సీరియళ్లు తగ్గించి, తమ ఫోకస్ ను అమరావతిపై పెట్టాలి. కనీసం 50శాతం సీరియళ్ల టైమైనా తగ్గించుకోండి'' అని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. ఇక,

జరగబోయేది ఇదే..

జరగబోయేది ఇదే..

దేశ చరిత్రలో తొలిసారిగా సుప్రీం సిట్టింగ్ జడ్జిపై ఒక సీఎం సంచలన ఆరోపణలు చేసిన ఘట్టంగా జస్టిస్ ఎన్వీ రమణ, వైఎస్ జగన్ వ్యవహారం చర్చనీయాంశమైంది. కాగా, ఈ విషయంలో జగన్ తొందరపాటుతో అనాలోచితంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ రెబల్ రఘురామకృష్ణంరాజు అన్నారు. న్యాయవ్యవస్థపై దాడుల వల్ల ఏపీలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తే అవకాశముందని, ఎవరో ఒకరు రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తే కేంద్ర పాలన కూడా విధించే అవకాశాలు లేకపోలేవని ఎంపీ రఘురామ వ్యాఖ్యానించారు.

English summary
amid cbi raids against him, ysrcp mp raghurama krishnam raju alleges that another mp of his own party, vallabhaneni balashouri escapes from raids. the rebel told that he is preparing for legal battle on this isse. raghurama also clarifies about the viral pic of him drinking champagne
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X