జస్టిస్ రమణ పిల్లలపై ఫాల్తూ కేసు - జగన్‌కు 60 నెలల జైలు - ఏపీలో ఆర్టికల్ 356: ఎంపీ రఘురామ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత రాజకీయ, వ్యవస్థాగత రంగాల్లో పెను సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాని మోదీతో సీఎం జగన్ సమావేశం ముగిసిన తర్వాతి రోజే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీబీఐ దాడులు జరిగాయి. పీఎం, సీఎం భేటీనాడే.. సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణ తీరుపై చీఫ్ జస్టిస్ బోబ్డేకు జగన్ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాలపై ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు బెయిల్ ఇచ్చిన కోర్టులపైనే జగన్ తిరగబడుతున్నారని దుయ్యబట్టారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఎంపీ రఘురామ అన్న మాటలివి..
కన్నీటి పర్యంతమైన కిమ్ జోంగ్ - ఉత్తరకొరియా ప్రజలకు క్షమాపణలు - తొలిసారి బాహుబలి ప్రదర్శన

జడ్జిల పిల్లలపై ఫాల్తూ కేసులు
‘‘జగన్ తనను తాను కాపాడుకోడానికి ఏకంగా న్యాయవ్యవస్థపై దాడి చేస్తున్నారు. ఏ కోర్టులైతే బెయిల్ ఇవ్వడంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో.. అదే కోర్టులపై ఇవాళ తిరుగుబాటు చేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అసలు న్యాయమూర్తులకు పిల్లలు ఉండటం తప్పా? జడ్జిల పిల్లలు భూములు కొనుక్కోవడం నేరమా? 2018లో కూడా కోర్ క్యాపిటల్ కు సంబంధం లేని చోట.. వారి స్వగ్రామంలో, వాళ్ల భూముల్నే కొనుక్కున్నారు. అందుకని జడ్జి పిల్లలపై ఒక ఫాల్తూ కేసు పెట్టారు. ఆ ఫాల్తూ కేసు ముందుకు పోకుండా మళ్లీ న్యాయవ్యవస్థ అడ్డం వచ్చిందని అడ్డగోలుగా ఫిర్యాదు చేశారు.
చంద్రబాబు ఆయువుపట్టుపై దాడి - జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ సంచలనం -ప్రధాని మోదీని కలిసిన రోజే

రాజ్యాంగ సంక్షోభం తప్పదు
జడ్జిలపై ఫిర్యాదుకు సంబంధించిన లేఖను ఎప్పుడో ఆరో తేదీన ఇచ్చేసి.. తర్వాత ఏం జరుగుతుందో కూడా చూసుకోకుండా.. సీఎం సలహాదారు అజయ్ కల్లాం రెడ్డి ఆ లేఖను రిలీజ్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటి? మీరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా మీ ఉద్దేశం ఏమిటనేది ప్రజలకు తెలిసిపోతున్నది కదా. సీఎం గారూ, ఇప్పటికే మీరు భ్రష్టు పట్టించిన వ్యవస్థలతో సరిపెట్టుకోండి. అలాకాదని న్యాయవ్యవస్థపై దాడి కొనసాగిస్తానని తీవ్ర పరిణామాలు తప్పవు. ఎవరో ఒకరు రాష్ట్రపతికి రిప్రెజెంటేషన్ ఇస్తే ఏపీలో జగన్ అంటే గనుక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ మతిలేని చర్యల వల్ల రాజ్యాంగ సంక్షోభం తలెత్తి, ఆంధ్రప్రదేశ్ లో ఆర్టికల్ 356 తీసుకొచ్చి, కేంద్ర పాలన విధించే ప్రమాదం ఉంది. జగన్ ఇంకో పాతికేళ్లయినా సీఎంగా ఉండాలని మేము కోరుతుంటే, మీరు మాత్రం రాజ్యాంగ సంక్షోభాన్ని కోరుతున్నాట్లు వ్యవహరిస్తున్నారు. నిజానికి..

60 నెలలు జైలు శిక్ష
తాను రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసిన విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ మర్చిపోతున్నాడు. ఇంత దారుణంగా న్యాయవ్యవస్థపై దాడి జరుగుతోంటే.. రాష్ట్రపతిగానీ, ప్రజలుగానీ చూస్తూ ఊరుకోరు. చేసిన ప్రమాణాలను మర్చిపోయి, వ్యవస్థపై దాడి చేయడం కూడా రాజ్యాంగ విరుద్ధమే. పది మంది జడ్జిల పేర్లను ప్రస్తావిస్తూ, వాళ్లపై అభియోగాలు మోపడం ద్వారా జగన్ కంటెంప్ట్ ఆఫ్ సీక్రసీ, కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు పాల్పడినట్లయింది. ఒక్కోటి ఆరు నెలలు శిక్ష అనుకున్నా, 10 కంటెంప్ట్ కేసుల్లో మొత్తం 60 నెలలపాటు జగన్ ను జైలులో తోసేసే అవకాశాలు లేకపోలేవు. ఏదో ప్రశాంత్ భూషణ్ లాగా పది రూపాయాల ఫైన్ తో తప్పించుకుందామని జగన్ అనుకుంటే పొరపాటే అవుతుంది'' అని ఎంపీ రఘురామ అన్నారు.

వార్‌పై తీవ్ర ఉత్కంఠ..
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిర పర్చేలా, హైకోర్టు ద్వారా తీర్పులు, ఆదేశాలు ఇస్తున్నారని, అమరావతిలోని జడ్జిలపై ఢిల్లీ నుంచి జస్టిన్ ఎన్వీ రమణ ఒత్తిడి పెడుతున్నారని సీఎం జగన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి, అదికూడా కాబోయే చీఫ్ జస్టిస్ ను ఉద్దేశించి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ తరహా ఫిర్యాదు చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడంతో జగన్-రమణల వ్యవహారం ఏమలుపు తిరుగుతుందోనని దేశమంతటా ఉత్కంఠ నెలకొంది. ఈ వ్యవహారాన్ని వార్ గా అభివర్ణిస్తోన్న జాతీయ మీడియా.. కేంద్రం సిగ్నల్ ఇచ్చాకే జగన్ సంచలన లేఖను బహిర్గతం చేశారని అభిప్రాయపడింది. ఎంపీ రఘురామ చెప్పినట్లు ఈ వ్యవహారంలో జోక్యం కోరుతూ ఎవరైనా రాష్ట్రపతిని సంప్రదిస్తే అది కూడా కీలకం కానుంది.