జడ్జికే జైలు, జగన్ తప్పించుకోలేరు -అటార్నీ చెప్పిందిదే -పీపీఏను బెదిరిస్తే పైసలొస్తాయా?: రఘురామ
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని అస్థిరపర్చేలా ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అనుకూలంగా హైకోర్టులోని ఐదుగురు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ వ్యవహరిస్తున్నారంటూ సీజేఐ జస్టిస్ బోబ్డేకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాసిన అనుచిత లేఖ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారుతోందనడానికి రుజువే అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తాజా ప్రకటన అని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. 'రాజధాని రచ్చబండ' కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జడ్జిలపై జగన్ ఫిర్యాదు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, సంచైత గజపతి రాజు తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే...
సంచైత తండ్రి ఎవరు? వీలునామా ఇదే -విజయసాయి వేళ్లు తెగడం ఖాయం -ఎంపీ రఘురామ సంచలనం

అటార్నీ ఏం చెప్పారు?
‘‘హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలపై ఏపీ సీఎం జగన్ లేఖను కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ ప్రముఖ లాయర అశ్వనీ కుమార్ రాసిన లేఖకు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సూటిగా, స్పష్టంగా సమాధానం చెప్పారు. జగన్ లేఖ రాసిన సందర్భం, ప్రెస్ మీట్ ద్వారా లేఖను బహిర్గతం చేసిన తీరు ముమ్మాటికీ కోర్టు ధిక్కారం కిందికే వస్తాయని, అయితే ఈ వివాదాన్ని నేరుగా సీజేఐ(జస్టిస్ బోబ్డే) పరిశీలిస్తున్నందున దీనిపై ఆదేశాలివ్వలేమని అటర్నీ పేర్కొన్నారు. తద్వారా ఇవాళ కాకుంటే రేపైనా జగన్ చేసింది తప్పని తేలుతుందనే స్పష్టత ఇచ్చారు. కానీ దీనిపై ప్రజల్లో గందరగోళం పెంచేలా మీడియా సంస్థలు తీరొక్క రీతిగా వార్తలు రాశాయి. జగన్ చర్యను అటార్నీ జనరల్ గర్హించారనేది కాదనలేని వాస్తవం. అంతేకాదు..
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయో తెలుసా? -ఎలక్టోరల్ కాలేజ్ వివరాలివే -ఓట్లు నేరుగా వేయరు

జడ్జికే ఆరు నెలలు జైలు..
జగన్ చర్యలు కోర్టు ధిక్కరణ కిందికి వస్తాయని క్లారిటీ ఇస్తూనే, ఆ వ్యవహారాన్ని సీజేఐ చూసుకుంటారని అటార్నీ జనరల్ స్పష్టత ఇచ్చారు. ఇక్కడ మనం తమిళనాడుకు చెందిన జడ్జి జస్టిస్ కర్ణన్ ఉదంతాన్ని గుర్తుచేసుకోవాలి. గతంలో న్యాయ వ్యవస్థపై దాడికి పాల్పడిన ఆ జడ్జికి ఆరు నెలల జైలు శిక్ష పడింది. వ్యవస్థపై అభ్యంతరకర చర్యలకు దిగితే జడ్జిని సైతం దండించారు. అదే క్రమంలో జగన్ కూడా ప్రతికూలత ఎదుర్కోవాల్సి ఉంటుంది. న్యాయ సంబంధమైన విషయాల్లో జోక్యం వద్దని మా సీఎంకు పదే పదే చెబుతున్నా. కనీసం ఇప్పటికైనా కోర్టుకు క్షమాపణలు చెప్పి, రాబోయే శిక్ష నుంచి తప్పించుకోవాలని కోరుతున్నా. మరో ముఖ్యమైన అంశం..

పీపీఏను కాదు కేంద్రాన్నే నిలదీయాలి..
ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి జగన్ సర్కారు తీరు అగమ్యగోచరంగా ఉంది. ప్రాజెక్టు నిధులకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)ని ఏపీ ప్రభుత్వం ఏకిపారేసిందని జగన్ మీడియాలో వార్తలు రాసుకున్నారు. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే.. సవరించిన(2018 ధరల ప్రకారం) అంచనా రూ.47,725కోట్లకు పీపీఏ ఏనాడో అంగీకరించింది. ఇందులో జగన్ గొప్పతనమేమీ లేదు. అయితే ఆ సంస్థ కేవలం ప్రాజెక్టును నిర్మించేది మాత్రమే.. డబ్బులు ఇచ్చేది కాదు. నిజంగా నిధులు ఇవ్వాల్సిన కేంద్ర ఆర్థిక శాఖను అడగటం మానేసి, మీటింగ్ లో పీపీఏను బెదిరిస్తేనో, నిలదీస్తేనో ఏపీ ప్రభుత్వానికి ప్రయోజనం ఉండదు. కనీసం ఇప్పటికైనా సీఎం జగన్ బయటికొచ్చి.. అవసరమైతే ఢిల్లీలో నాలుగు రోజులు ఉండైనా, ప్రధాని మోదీని, ఆర్థిక మంత్రిని కలిసి పోలవరానికి నిధులు తెప్పించుకోవాలి. సోంత మీడియాలో డబ్బా ప్రకటనలతో పోలవరం పూర్తికాదని గ్రహించాలి. ఇక..

సంచైత విషయంలో చట్టాల్లేవా..
సింహాచలం, మన్సాస్ ట్రస్టు భూముల కోసమే వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విశాఖలో మకాం వేశారు. ఆయర ప్రేరణతో ఆ రెండు సంస్థల్లో పదవులు చేపట్టిన సంచైత వ్యవహారం గందరగోళంగా ఉంది. 2015లో తన తండ్రి పేరును రమేశ్ శర్మ అని, 2020లో మాత్రం ఆనందగజపతి రాజు అని సంచైత చెప్పుకున్నారు. విడాకుల సెటిల్మెంట్ తర్వాత తల్లితో వెళ్లిపోయిన ఆమె.. మళ్లీ ప్రత్యక్షం కావడం వెనుక సాయిరెడ్డి హస్తం ఉంది. అనువంశిక ధర్మకర్తల చట్టాలకు విరుద్ధంగా సంచైతను పదవిలో కూర్చోబెట్టారు. ఆమె పేరుకు కనీసం మెంబర్ల ఆమోదం కూడా లేదు. సంచైత విషయంలో చట్టాన్ని పాటించలేదు'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. ఇదిలా ఉంటే..

వైసీపీ ఎంపీగా సీఎం మాట కోసం..
ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో జగన్.. రాయలసీమలోని వాల్మికి బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని మాటిచ్చారని, అధికారంలోకి వచ్చి 17 నెలలు గడుస్తున్నా సీఎం నోటి వెంట బోయ అనే పదం కూడా రాకపోవడం శోచనీయమని వైసీపీ ఎంపీ రఘురామ అన్నారు. ఢిల్లీలో తనను కలిసి వాల్మికి బోయ ప్రతినిధులకు... కేంద్ర ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి అర్జున్ ముండాతో కలిసే ఏర్పాటు చేయించానని, 40 లక్షలుగా ఉన్న బోయలకు న్యాయం చేసేదాకా పోరాడుతానని ఎంపీ తెలిపారు. ఈ పనిని వైసీపీ ఎంపీ హోదాలోనే చేస్తున్నానని, గతంలో సీఎం జగన్ బోయలకు మాట ఇచ్చారు కాబట్టి, దాన్ని నెరవేర్చడానికి కృషి చేస్తానని రఘురామ అన్నారు.