జగన్ అనుంగులు ఆ డ్రగ్స్ వాడతారు - ముగ్గురికి జైలు ఖాయం - 7కొండలు-7రెడ్లు: రఘురామ మరోబాంబు
తన కంపెనీలు, ఇళ్లపై సీబీఐ దాడుల తర్వాత సొంత పార్టీపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. కేంద్ర కేబినెట్ లో వైసీపీ చేరబోతోందనే బిల్డప్ ఇచ్చి, ఆర్థిక శాఖలోని ఐఏఎస్ అధికారుల ద్వారా బ్యాంకు వాళ్లను కలిపించి, తనపై సీబీఐ దాడులకు పురిగొల్పారని ఎంపీ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే సీఎం జగన్, ఆయనకు దగ్గరగా ఉండే వ్యక్తులు, సాక్షి మీడియా, తిరుమల తదితర అంశాలపై రఘురామ సంచలన ఆరోపణలు చేశారు. ఏంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
సీబీఐ దాడుల వెనుక అసలు కథ - ప్రవీణ్ ప్రకాశ్ బ్యాచ్‌మేట్ ద్వారా: ఎంపీ రఘురామ సంచలనం

మూడు నెలల్లో జైలు ఖాయం..
నా కంపెనీల బ్యాలెన్స్ షీట్లను అటు ఇటు చేసి రూ.23వేల కోట్ల రుణాలు ఉన్నాయని సాక్షి వాళ్లు రాశారు. బహుశా వాళ్ల రూ.43వేల కోట్ల దొంగతనం ముందు నేను చాలా చిన్న దొంగనని అనిపించిందేమో, అందుకే నా అప్పులు ఐదారు రెట్లు పెంచి చూపించారు. అయినాసరే వాళ్లలో సగానికి కూడా నేను రాలేకపోయాను. సాక్షి పేపర్, సాక్షి టవీ, టీవీ9 చానెళ్లపై పరువు నష్టం దావా వేద్దామనుకున్నాను. కానీ.. ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్నవాడిని హత్య చేయడం ఎందుకులే అని వదిలేశాను. ఇంకో మూడు లేదా నాలుగు నెలల్లో సాక్షి యాజమాన్యంలోని ముగ్గురు ప్రముఖులు జైలుకు వెళ్లడం ఖాయం.
అడ్డంగా దొరికిన ఎంపీ రఘురామ - దాడులు, కేసుపై సీబీఐ కీలక ప్రకటన - ఎవరూ మిస్ కావొద్దని ట్వీట్

నవంబర్ 1నుంచి మెగా పథకం..
ఏపీలో సాగుతోన్న దొంగ వ్యవహారాలను ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళుతున్నాను. ఇక నవంబర్ 1 నుంచి జగన్ ప్రభుత్వం కొత్త ఇసుక పథకం తీసుకొస్తున్నది. అందులో భాగంగా మూడు ప్రాంతాల్లో(సీమ, కోస్తా, ఉత్తరాంధ్ర) ఇసుక తోడేందుకు మెగా పథకం తీసుకురానున్నారు. పేరు చివర ‘రెడ్డి' ఉన్నవాళ్లకే కాంట్రాక్టులు ఇస్తారట. ఇప్పటికే మెగా ఇన్ ఫ్రా, పీఎల్ఆర్ తదితర బడా కంపెనీకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇలా రకరకాల పద్ధతుల్లో మా ప్రభుత్వం దోపిడీదారులకు కొమ్ముకాస్తున్నది.

వాళ్లు డ్రగ్స్ వాడుతున్నారు..
సీబీఐ దాడుల దర్వాత వైసీపీ వాళ్లు నాపై విపరీతంగా కామెంట్లు చేశారు. ‘ఒకేయ్ విగ్గు రాజు.. విగ్గు ఊడుతుంద'ని ఎద్దేవా చేశారు. ఎవరేం పీక్కుంటారో పీక్కోమన్నదే నా సమాధానం. ప్రస్తుతం ఏపీలోని అధికార పార్టీలో చాలా మంది మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు. క్షణానికో తీరుగా ప్రవకంతిపంతే ఉన్మాదులుగా వ్యవహరించడం వారి అలవాటు. జగన్ కు చాలా దగ్గరగా ఉన్న నేతలు తమ మానసిక జబ్బుల కోసం ‘సైకోట్రోపిక్ డ్రగ్స్' వాడుతున్నారు. దీనికి సంబంధించి నా దగ్గర పక్కాగా సాక్ష్యాధారాలు ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం మానసిక దౌర్బల్యం ఉన్నవాళ్లు ప్రజాప్రతినిధులుగా ఉండటానికి వీల్లేదు. ఆ వ్యక్తులను ట్రీట్మెంట్కు తరలిస్తామని సీఎం జగన్ హామీ ఇస్తే ఆ పేర్లను కచ్చితంగా బయటపెడతాను. పిచ్చివాళ్లతో ప్రభుత్వాన్ని నడపడం సరికాదు.

ప్రలోభాలకు లొంగిపోయాను..
తాను వైసీపీలో చేరడం వైఎస్ జగన్ కు తొలి నుంచీ ఇష్టం లేదని, ఆయనలో మార్పు వస్తుందని ఆశించి తప్పు చేశానని ఎంపీ రఘురామ అన్నారు. ‘‘టీడీపీ కంచుకోట నర్సాపురంలో వైసీపీ తరఫున గెలవగల సత్తా నాకే ఉందని ప్రశాంత్ కిషోర్ టీమ్ చెబితే నాకు టికెట్ ఇచ్చారు. దురదృష్టవశాత్తూ ప్రలోభాలకు లొంగిపోయి నేనా పార్టీలో చేరాను. 24 గంటలు తిర్కముందే వేరే రాజుగారికి టికెట్ ఇస్తానని జగన్ అంటే.. పీకే సీరియస్ అయ్యారని తర్వాత తెలిసింది. ఏదిఏమైనా ఏపీలో అక్రమాలకు వ్యతిరేకంగా నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.'' అని ఎంపీ తెలిపారు.

వైవీ సుబ్బారెడ్డిపై మోదీకి ఫిర్యాదు..
పవిత్రమైన తిరుమల క్షేత్రంలోనూ వైసీపీ అక్రమాలకు పాల్పడుతున్నదని, తిరుమల,తిరుపతిలో రెడ్డి కులస్తుల ఆధిపత్యమే నడుస్తున్నదని, శ్రీవారిని తొలిగా దర్శించుకోవాల్సిన యాదవులకు ప్రాధాన్యం లేకుండా పోయిందని ఎంపీ రఘురామ అన్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అవినీతిపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశానని చెప్పారు. ఈవో జవహర్ రెడ్డి, ఏఈవో ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి ఎస్పీ రమేశ్ రెడ్డి, స్విమ్స్ డీన్ వెంకాయమ్మరెడ్డి... ఇలా అక్కడ ‘ఏడు కొండలు.. ఏడుగురు రెడ్లు'' అన్నట్లుగా పరిస్థితి తయారైందని ఎంపీ పేర్కొన్నారు. ఓట్లు కావాల్సినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలు కావాలని.. గెలిచాక శిరోముండనాలు, దాడులు చేస్తున్నారని రఘఉరామ దుయ్యబట్టారు.