పశ్చిమగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధానిపై బీజేపీ భారీ మెలిక -పవన్ వత్తాసు -‘జగనన్నతోడు’, వీసీల భర్తీ కథ తెలుసా: ఎంపీ రఘురామ

|
Google Oneindia TeluguNews

నర్సాపురం ఎంపీ రఘురామకృంరాజుపై వైసీపీ దాఖలు చేసిన అనర్హత వేటు పిటిషన్ ఇంకా లోక్ సభలో పెండింగ్ లో ఉంది. చాలా కాలంగా సొంత పార్టీపై, సీఎం జగన్ పై తీవ్ర స్థాయి విమర్శలు చేస్తోన్న ఎంపీ రఘురామ.. గుండె సంబంధిత ఇబ్బందులతో చికిత్సకు సిద్ధమైన తర్వాత కూడా విమర్శల పరంపరను కొనసాగిస్తున్నారు. తాజాగా కేంద్రంలోని బీజేపీని, ఏపీకే చెందిన జనసేన పార్టీని కూడా ఆయన టార్గెట్ చేశారు. 'రాజధాని రచ్చబండ' కార్యక్రమంలో భాగంగా గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

 షాకింగ్: ఎన్నికల వాయిదాకు కుట్ర -సీఎం కేసీఆర్ సంచలనం -పోలీసులకు ఫుల్ పవర్స్ -వివరాలివే షాకింగ్: ఎన్నికల వాయిదాకు కుట్ర -సీఎం కేసీఆర్ సంచలనం -పోలీసులకు ఫుల్ పవర్స్ -వివరాలివే

అమరావతి కదలదు..

అమరావతి కదలదు..

‘‘ఏ రకంగా చూసినా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే కొనసాగుతుంది. రాజధాని తరలింపునకు సంబంధించి జగన్ తీసుకున్న నిర్ణయాలన్నీ కోర్టులో కొట్టుడు పోతాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ రాజధానిని అమరావతి నుంచి కదిలించలేరు. ఇప్పటికే పలు ప్రాంతీయ, జాతీయ పార్టీలు అమరావతికి అనుకూలంగా తీర్మానాలు, ప్రకటనలు చేశాయి. తాజాగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ లు ఢిల్లీలో జేపీ నడ్డాను కలిసిన సందర్భంలోనూ.. బీజేపీ అమరావతికే కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కానీ వారీ మాటల్లో పెద్ద తిరకాసు ఉంది..

తిరుపతి: పోటీపై పవన్ కల్యాణ్ ట్విస్ట్ -టికెట్ కోసమే ఢిల్లీకి రాలేదు -టార్గెట్ జగన్ -2రోజుల్లో ఫైనల్తిరుపతి: పోటీపై పవన్ కల్యాణ్ ట్విస్ట్ -టికెట్ కోసమే ఢిల్లీకి రాలేదు -టార్గెట్ జగన్ -2రోజుల్లో ఫైనల్

బీజేపీ-పవన్ డబుల్ గేమ్

బీజేపీ-పవన్ డబుల్ గేమ్

ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలని, ఉద్యమానికి బీజేపీ అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్నదని పవన్ కల్యాణ్ చెప్పారు. మరుక్షణంలో అదే నోటితో.. ‘‘రాజధాని రైతులకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని బీజేపీ పెద్దలు హామీ ఇచ్చారు''అని కూడా పవన్, మనోహర్ అన్నారు. ఈ మెలిక మాటకు అర్థమేంటో తెలియట్లేదు. రాజధాని అమరావతిలో కొనసాగితే ఆటోమెటిక్ గా రైతులకు న్యాయం జరుగుతుంది కదా, మరి ప్రత్యేకంగా రైతులకు న్యాయం గురించి బీజేపీ-జనసేనలు మాట్లాడటంలో మతలబు ఏంటి? ఆ మాటకొస్తే, ఒక్క రైతులే కాదు, సమాజంలోని ఇతర వర్గాలెన్నో అమరావతిని నమ్ముకుని, అక్కడ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. అలాంటప్పుడు బీజేపీ-పవన్ లు ‘రైతులకు న్యాయం చేస్తాం'తరహా వంకర ప్రకటనలు చేయడం సబబేనా? అమరావతికే కట్టుబడి ఉంటామని ఒకే మాటపై నిలబడాలిగానీ, డబుల్ గేమ్ అనుమానాలు రేకెత్తించేలా రెండో మాటను ఎందుకు చెబుతున్నారు? ఇకపోతే,

జగనన్న తోడు అసలు కథ ఇది..

జగనన్న తోడు అసలు కథ ఇది..


ఏపీలో తాజాగా జగనన్న తోడు అనే పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. దాని ప్రకటనలు చూస్తే, అదేదో పెద్ద పథకం అనిపిస్తుంది. నిజానికి అది ప్రధాని మోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ పథకంలో భాగమే. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారుల కోసం ఆత్మనిర్భర్ లో భాగంగా పీఎం-స్వనిధి పేరుతో పథకం తెచ్చారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ద్వారా అమలయ్యే ఈ పథకంలో దేశవ్యాప్తంగా పట్టణప్రాంతాల్లోని 50 లక్షల మంది లబ్దిదారులు వస్తారని అంచనా వేస్తున్నారు. నవంబర్ 10 నాటికి సుమారు 25 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే, 13 లక్షల మందికి లోన్లు ఇచ్చారు. బ్యాంకులకు కేంద్రం కౌంటర్ గ్యారెంటీ ఇవ్వడం ద్వారా ఈ లోన్లను అందజేస్తున్నారు. దాన్నే ఏపీకి అడాప్ట్ చేసుకుని, జగనన్న తోడు పథకంగా మార్చారు. అయితే కొన్ని కీలక మార్పులకు ఏపీ చేసింది..

ఇచ్చేది చారానా.. ప్రచారం ఆఠానా

ఇచ్చేది చారానా.. ప్రచారం ఆఠానా

కేంద్రం తెచ్చిన పీఎం-స్వనిధి పథకానికే మార్పులు చేసిన ఏపీ ప్రభుత్వం.. పట్టణాలతోపాటు పల్లెల్లోని వీధి వ్యాపారులకు కూడా లోన్లు ఇస్తామంటున్నారు. నిజానికి పల్లెల్లో తోపుడుబండ్ల వ్యాపారులు పెద్దగా ఉండరు. అయినాసరే లెక్కలు వేసుకుంటే.. ప్రస్తుతం ఏపీలో 16, 168 గ్రామాలున్నాయి. గ్రామానికి గరిష్టంగా 15 మంది తోపుడుబండ్ల వ్యాపారులు ఉంటారని భావించినా, 2.5 లక్షల మంది లబ్దిదారులు అవుతారు. వాళ్లందరికీ లోన్లు ఇచ్చినా మొత్తంగా రూ.25 కోట్ల కంటే ఎక్కువ కాదు. అయితే ఈ పథకం ప్రచారం కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు మాత్రం రెట్టింపులా కనిపిస్తోంది. కోట్ల ఖర్చుతో ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తోంది. చిన్న స్కీములకు కూడా ప్రపంచ స్థాయి ప్రచారం అవసరం లేదు. లబ్దిదారుల ద్వారానే మనకు ప్రచారం లభిస్తుంది. ఊరికే ఇంట్లో కూర్చున్నవారికి డబ్బులు ఇవ్వకుండా, సరైన అర్హులకు మాత్రమే ఈ పథకాన్ని అందేలా చూడాలని సీఎంను కోరుతున్నాను. ఏపీలో తాజాగా తీసుకున్న మరో నిర్ణయం..

వీసీల భర్తీలో ఆ కులానికి ప్రాధాన్యం..

వీసీల భర్తీలో ఆ కులానికి ప్రాధాన్యం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా వర్సిటీల వైస్ చాన్సలర్ల భర్తీని చేపట్టింది. కీలకమైన ఐదు యూనివర్సిటీలకుగానూ.. ఒక బీసీకి, ఒక ఎస్సీకి వైస్ చాన్సలర్ గా అవకాశం కల్పించడం అభినందనీయం. మిగిలిన మూడు వీసీ పోస్టులను అగ్రకులాలకు ఇవ్వడం కూడా సరే అనుకుందాం, కానీ మూడుకు మూడు పదవులనూ సీఎం జగన్ తన కులస్తులకు మాత్రమే కట్టబెట్టడం ఆక్షేపణీయం. గొప్ప చరిత్ర కలిగిన ఆంధ్రా యూనివర్సిటీకి, ఎస్వీయూ, కృష్ణదేవరాయ వర్సిటీకి ఒకే కులానికి చెందిన వ్యక్తులకు పదవులు ఇవ్వడమేంటి? పదువులు పొందినవాళ్లు నిజంగా మేధావులు, సమర్థులే కావొచ్చు. కానీ మిగతా కులాలకు అవకాశం కల్పించకపోవడం అన్యాయమేకదా. కులమతాలను పట్టించుకోబోమన్న జగన్ తనవాళ్లను మాత్రమే చూసే విధానాన్ని మార్చుకోవాలి'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

English summary
narsapuram ysrcp mp raghurama krishnam raju expressed thoughts on bjp-jana sena joint statement on amaravathi issue. speaking through social media on thrusday, the rebel mp also slams cm jagan on jagananna thodu scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X