• search
 • Live TV
పశ్చిమగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్‌పై సునీల్ పోరు అద్భుతం - బట్టలు విప్పేసి రమ్మంటారా? అడ్వైజర్ల అతి వల్లే: రఘురామ ఫైర్

|

ప్రజలను కాపాడుతూ, పేదలకు అండగా ఉంటోందన్న అక్కసుతోనే న్యాయవ్యవస్థపై జగన్ సర్కారు దాడి చేస్తున్నదని, ప్రజలన్నా, ప్రజా ఉద్యమాలన్నా వైసీపీ నేతలకు చులకన భావం ఎక్కువని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. చాలా కాలంగా ఢిల్లీకే పరిమితమైపోయిన ఆయన ప్రతిరోజు 'రాజధాని రచ్చబడ్డ' పేరుతో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. మంగళవారం నాటి పీసీలో అమరావతి ఉద్యమం, జగన్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ తదితర అంశాలపై రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనేమన్నారంటే..

జగన్ ఆమె దుస్తులు విప్పేస్తున్నారు - సీఎంగా 3.5ఏళ్లు కష్టం - కాపాడేది ఆయనొక్కడే: ఎంపీ రఘురామ

సునీల్ కుమార్ పోరాటం..

సునీల్ కుమార్ పోరాటం..

‘‘తనను తాను కాపాడుకునే దిశగా ఏపీ సీఎం జగన్ న్యాయవ్యవస్థపై దాడికి దిగారు. అందులో భాగంగానే ఏపీ హైకోర్టులోని కొందరు, సుప్రీంకోర్టులోని ఒక జడ్జిపై అనాలోచితంగా, లేనిపోని ఆరోపణలు చేశారు. జ్యూడీషియరీపై ఇంత దారుణంగా దాడి జరగడాన్ని చూడలేక సునీల్ కుమార్ సింగ్ అనే న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిజంగా సునీల్ దాఖలు చేసిన పిటిషన్, ఆయన పోరాటం అద్భుతంగా ఉంది. తప్పుడు సలహాదారులతో సీఎం జగన్ ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో ఆ పిటిషన్ లో బాగా రాశారు..

జడ్జిలపై ఫిర్యాదు: జగన్ కు భారీ షాక్ - సీఎంపై చర్యలకు సుప్రీంకోర్టులో పిటిషన్ -ఆర్టికల్ 121, 211

నడి వీధిలోకి లాగారు..

నడి వీధిలోకి లాగారు..

నిష్పక్షపాతంగా తీర్పులు చెబుతారు కాబట్టే జడ్జిలకు రాజ్యాంగం అదనపు భద్రత కల్పిస్తోంది. న్యాయమూర్తులపై ఎవరుపడితే వాళ్లు, ఎలా పడితే అలా నిందలు వేయడం రాజ్యాంగ విరుద్ధం. ఆ మేరకు ఆర్టికల్ 121, ఆర్టికల్ 211ను ఏపీ సీఎం ఉల్లంఘించారు. ఏపీ పాలకులు న్యాయవ్యవస్థను నడి వీధికి లాగేశారని, రాజ్యాంగ పరిధిని దాటేశారనే నిజాన్ని సునీల్ కుమార్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలను అస్థిరపరిచే ప్రయత్నం చేసిన సీఎం జగన్ పై చర్యలు తీసుకోవాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. మొత్తం ఎపిసోడ్ చూస్తే, సలహాదారులే సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నట్లుంది. అతి చేసే అడ్వైజర్లను సీఎం ఇకనైనా పక్కన పెట్టాలి. ఇకపోతే..

దమ్ముంటే జనంలో వెళ్లండి..

దమ్ముంటే జనంలో వెళ్లండి..

అమరావతిలో రైతుల ఉద్యమం 300 రోజులకు చేరిన సందర్భంగా సోమవారం జరిగిన కార్యక్రమాన్ని వైసీపీ నేత సజ్జల రామృష్ణారెడ్డి ‘బినామీల ప్లాప్ షో' అని అభివర్ణించారు. అమరావతిలో ఉన్నవాళ్లు డ్రామా ఆర్టిస్టులని కించపరిచారు. ఒకవేళ ఆయన చెప్పిందే నిజమైతే.. జగన్ డ్రామా ఆర్టిస్టులకు ఎందుకు భయపడుతున్నారు? దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా అమరావతిలో తిరగగలరా? అమరావతి రైతులు ఆర్టిస్టులే అయితే, వైసీపీ నేతలు అసెంబ్లీకి వెళ్లడానికి ఎందుగు భయపడుతున్నారు? దీనికి మీ దగ్గర సమాధానం ఉందా? అంతటితో ఆగకుండా...

  YSRCP Issued Show Cause Notice To MP Raghu Rama Krishnam Raju || Oneindia Telugu
  బట్టలు విప్పుకుని రావాలా?

  బట్టలు విప్పుకుని రావాలా?

  ఇప్పటికే దళితులకు ముఖ్యమంత్రికి మధ్య అగాధం పెరిగింది. ఇప్పుడు రైతులు కూడా సీఎంను అసహ్యించుకునే పరిస్థితిని వైసీపీ సలహాదారులే కల్పిస్తున్నారు. సజ్జల ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు. మహిళా రైతులు చీరలు కట్టుకుని ఉద్యమం చేయడం ఆక్షేపణీయమంటారా? ఏం, ఉద్యమం చేయాలంటూ అందరూ బట్టలు విప్పుకుని రావాలా? రంగు చీరలు కట్టుకుంటే తప్పేముంది? మహిళా రైతులు చుడీదార్లు, చీరలు కట్టుకోవద్దా? చిరిగిపోయిన బట్టలు వేసుకుంటేనే రైతులా? సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడుతున్నాడు?'' అని ఎంపీ రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  English summary
  ysrcp MP Raghurama Krishnam Raju criticised andhra pradesh govt advisory and ysrcp leader sajjala ramakrishna reddy for insulting amaravati farmers. the rebel mp also praised advocate sunil kumar singh, who filed a petition to seek action on cm jagan for making allegations on judges
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X