• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఐపీఎల్ టోర్నీకి యాడెడ్ గ్లామర్ మయాంతి.. ఈ సారి టోర్నీకి అందుకే దూరమైందట..!

|

క్యాష్ రిచ్ గేమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ మరికొన్ని గంటల్లో అట్టహాసంగా ప్రారంభం కానుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచుల్లో ప్రేక్షకులు లేకపోయినప్పటికీ ఎక్కడా అలాంటి భావన రాకుండా అదే ఊపు అదే ఉత్సాహంతో నింపేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక అందమైన భామలు లేత మెరుపు తీగలు ఎలాగూ ఎంటర్‌టెయిన్ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ అఫీషియల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ టోర్నీ యాంకర్లు కామెంటేటర్ల జాబితాను విడుదల చేసింది. అయితే గత కొన్ని సీజన్లుగా ఫ్యాన్స్‌ను మ్యాచ్ ప్రారంభంకు ముందు పలకరించడంలో ముందుండే యాంకర్ స్పోర్ట్స్ జర్నలిస్టు అయిన మయాంతి లాంగర్ ఈ సీజన్‌కు దూరంగా ఉంది. ఆమె దూరమవుతున్నారన్న వార్త తెలిసిన ఫ్యాన్స్ ఒక్కింత నిరాశకు గురయ్యారు.

మయాంతి పై సోషల్ మీడియాలో చర్చ

మయాంతి పై సోషల్ మీడియాలో చర్చ

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ ఎంటర్‌టెయిన్ చేసేందుకు సిద్ధమైంది. ఇక శనివారం నుంచి టీవీల్లో బై డీఫాల్ట్‌గా స్టార్ స్పోర్ట్స్‌ ఛానెల్ కనిపిస్తుంది. హాట్ హాట్‌గా టోర్నీ సాగనుంది. ఇక ఐపీఎల్ ప్రారంభానికి ముందు నమస్తే ఇండియా అంటూ పలకరించే బ్యూటిఫుల్ యాంకర్ మయాంతి లాంగర్ ఈ టోర్నీలో కనిపించదు. స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన యాంకర్ల జాబితాలో మయాంతికి చోటు లభించలేదు. అయితే మయాంతిని తప్పించారా లేక మయాంతినే ఈ సారి సీజన్‌కు దూరంగా ఉందా అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. కొందరైతే కమ్‌ బ్యాక్ మయాంతి అంటూ కూడా పోస్టులు చేస్తున్నారు. అంతలా ఈ అందాల యాంకర్‌కు ఫిదా అయిపోయారు.

మయాంతికి ఉన్న క్రేజే వేరప్పా..!

మయాంతికి ఉన్న క్రేజే వేరప్పా..!

మయాంతి లేని ఐపీఎల్ టోర్నీని కొందరు ఊహించుకోలేకపోతున్నారు. కేవలం మయాంతిని చూసేందుకు మాత్రమే కొందరు టీవీలకు అతుక్కుపోతారంటే అతిశయోక్తి కాదు. అంతలా ఫ్యాన్స్‌ను కట్టిపడేసింది ఈ అమ్మడు. ఇక అసలు విషయానికొస్తే మయాంతిని స్టార్‌ స్పోర్ట్స్ యాజమాన్యం తొలగించలేదు. ఆమె తన వ్యక్తిగత కారణాలతోనే ఈ సీజన్‌కు దూరమైనట్లు ట్విటర్ ద్వారా తెలిపింది. దీంతో అప్పటివరకు స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం మయాంతిని తప్పించిందంటూ వస్తున్న వార్తలకు బ్రేక్ పడింది. ఇక మయాంతి ప్లేస్‌లో ఆస్ట్రేలియా హాట్ యాంకర్ నెరోలీ మెడోస్‌ను తీసుకోవడంతో డిబేట్ మరింత హీట్‌ను పెంచింది. అయితే మయాంతి క్లారిటీ ఇవ్వడంతో అంతా కూల్ అయ్యింది.

పండంటి బాబుకు జన్మనిచ్చిన మయాంతి

ఇంతకీ మయాంతి ఎందుకు సీజన్‌కు దూరమైందనేగా మీ డౌటు... ఇక అసలు విషయానికొద్దాం. మయాంతి ఆరువారాల క్రితం ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తన భర్త స్టువర్ట్ బిన్నీ, బిడ్దతో కలిసి ఫోటోను ట్విటర్‌లో పోస్టు చేసింది మయాంతి. స్టార్ స్పోర్ట్స్ తన కుటుంబం లాంటిదని చెప్పుకొచ్చింది మయాంతి. స్టార్ స్పోర్ట్స్ తనపై నమ్మకం ఉంచి ఎన్నో మెగా ఈవెంట్లకు యాంకరింగ్ చేసే అవకాశం ఇచ్చిందని వెల్లడించింది. తాను గర్భవతిగా ఉన్న సమయంలో తనకు యాజమాన్యం అండగా నిలిచిన విషయాన్ని గుర్తుకు చేసుకుంది. ఆసమయంలో తన కంఫర్ట్ లెవెల్స్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పుకొచ్చింది. అయితే ఒకవేళ షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ జరిగి ఉండి ఉంటే తను ఐదు నెలల గర్భవతిగా ఉండి ఐపీఎల్‌కు హోస్ట్‌గా వ్యవహరించి ఉండేదాన్నని చెప్పుకొచ్చింది. స్టువర్ట్‌కు తనకు ఈ పండంటి మగబిడ్డ పుట్టాడని ఆరువారాల క్రితమే పుట్టినట్లు చెప్పుకొచ్చింది. దీంతో ఐపీఎల్‌కు మయాంతి ఎందుకు దూరమైందో అని చర్చ పెట్టేవారికి సమాధానం దొరికింది. చివరిగా కొత్తగా స్టార్ స్పోర్ట్స్‌తో జర్నీ స్టార్ట్ చేస్తున్న వారికి శుభాకాంక్షలు తెలిపింది.

  Top News Of The Day : Thousands In China Test Positive For A New Bacterial Infection || Oneindia
  మయాంతి కెరీర్

  మయాంతి కెరీర్

  మయాంతి ఒక్క ఐపీఎల్‌కు మాత్రమే వ్యాఖ్యతగా వ్యవహరించలేదు.. ఇతర మెగా టోర్నీలకు కూడా ఆమె యాంకర్‌గా వ్యవహరించారు. జీ స్పోర్ట్స్‌లో టెలికాస్ట్ అయిన ఫుట్‌బాల్ కేఫ్‌తో పాటు అనేక ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు కూడా ఇటు యాంకర్‌గా అటు కామెంటేటర్‌గా వ్యవహరించింది. 2011 వరల్డ్ కప్‌ , 2014 ఇండియన్ సూపర్‌లీగ్,2015 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్,2018 2019లో జరిగిన ఐపీఎల్‌తో పాటు 2019లో జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌కు కూడా ఆమె యాంకర్‌గా వ్యవహరించారు. ఇక ఆమె క్రికెటర్ స్టువర్ట్ బిన్నీని 2012లో పెళ్లి చేసుకుంది.

  మొత్తానికి ఐపీఎల్ గ్లామర్ అంటేనే టక్కున గుర్తుకు వచ్చే మయాంతి లాంగర్ ఈ సారి టోర్నీకి దూరమవుతుండటంతో ఏదో తెలియని వెలితి అయితే ఉంటుందని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు.

  English summary
  IPL mega tournament will be missing out the popular female anchor Mayanti Langer this time round as the official broadcaster Star Sports had roped in few new anchors. Mayanti had given birth to a baby boy six week ago.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X