వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్‌టెల్ నుంచి మరో అద్భుత ఫీచర్: వైఫై కాలింగ్‌ ద్వారా ఉచిత వాయిస్ కాల్స్

Google Oneindia TeluguNews

ఎయిర్‌టెల్ కొత్తగా ప్రవెశపెట్టిన వై-ఫై కాలింగ్ సర్వీసులతో ఎయిర్‌టెల్ కస్టమర్లు తమకు నచ్చిన వారికి ఎవరికైనా ఉచితంగా ఎంతసేపైన వాయిస్ కాల్స్ చేయొచ్చు. ఎయిర్‌టెల్ సంస్థ ఇండియాలోని టెలికాం పరిశ్రమలో ఉన్న మిగితా వాటి కంటే కూడా తన సేవలతో అందరిని విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఎయిర్‌టెల్ Wi-Fi కాలింగ్ ఫీచర్ టిఘో మరొక అడుగు ముందుకు వేసింది.

నెట్ వర్క్ సమస్యలకు చెక్

ప్రస్తుత సమయంలో టెలికాం పరిశ్రమలో 5G కనెక్టివిటీ కోసం అన్ని టెలికాం సంస్థలు ప్రయత్నాలను ముమ్మరం చేసాయి. దాని కంటే ముందుగా నెట్ వర్క్ సమస్యలతో బాధపడుతున్న వారికి పరిష్కారం కోసం నెట్ వర్క్ తో సంబంధం లేకుండా వాయిస్ కాల్స్ చేయడానికి Wi-Fi కాలింగ్ ఫీచర్ ను ప్రెవేశపెట్టారు. అంటే దీని ద్వారా మీ యొక్క ఫోన్ లో నెట్ వర్క్ సిగ్నల్ ఉన్న లేకపోయినా కూడా మీకు దగ్గరలో ఏదైనా Wi-Fi ఉంటె కనుక వాయిస్ కాల్స్ చేసుకునే సౌలభ్యం ఉ:టుంది. దీనికి మీకు కావలసింది Wi-Fi కనెక్టివిటీ మరియు Wi-Fi కాలింగ్ ను సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్. దీని గురించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

With Free Airtel Wi-Fi Calling, Airtel now puts an end to the call drops

ఎయిర్‌టెల్ ప్రస్థానం

భారతీయ టెలికాం పరిశ్రమలోకి ఎయిర్‌టెల్ ప్రవేశించినప్పటి నుండి గొప్ప వృద్ధిని సాధించింది. ఇది మొదటి నుండి కూడా తక్కువ ధరలతో కాలింగ్ ప్లాన్లను అందించింది. అభివృద్ధిలో భాగంగా అందరి కంటే ముందుగా తమ వినియోగదారులకు 4G ఇంటర్నెట్‌ కనెక్టివిటీలను కూడా అందించింది. ఈ సంస్థ అంతటితో ఆగకుండా తమ ఆపరేటర్ల కోసం వై-ఫై కాలింగ్ సర్వీసులను కూడా మొదలుపెట్టింది. త్వరలో 5G కనెక్టివిటీలను కూడా ప్రారంభించాలనే ఆలోచలనలో సంస్థ యాజమాన్యం ఉంది.

With Free Airtel Wi-Fi Calling, Airtel now puts an end to the call drops

కాలింగ్ ప్రారంభం

ఇండోర్ కనెక్టివిటీ సమస్యలకు పరిష్కారంగా గత డిసెంబర్‌లో టెలికాం ఆపరేటర్‌ ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్ ఫీచర్ ను ప్రారంభించింది. మీకు అందుబాటులో ఉన్న ఏదైనా వై-ఫై నెట్‌వర్క్‌ను ఉపయోగించి మీకు నచ్చిన వారికి మెరుగైన ఫోన్ కాల్స్ చేయడానికి కంపెనీ ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్ సర్వీస్ అనుమతిని ఇస్తుంది. దీని కోసం మీకు కావలసిందల్లా 4G స్మార్ట్‌ఫోన్ మరియు వై-ఫై కనెక్షన్.

With Free Airtel Wi-Fi Calling, Airtel now puts an end to the call drops

వై-ఫై కాలింగ్ ఫీచర్ అంటే ఏమిటి?

వై-ఫై కాలింగ్ ఫీచర్లలో భాగంగా సాధారణ నెట్‌వర్క్‌కు బదులుగా వైర్‌లెస్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఉపయోగించి ఫోన్ కాల్స్ చేయడానికి లేదా స్వీకరించడానికి అనుమతిస్తుంది. దీని కోసం వినియోగదారులకు మంచి వై-ఫై నెట్‌వర్క్ ఉంటే సరిపోతుంది. మొబైల్ నెట్‌వర్క్ బలహీనంగా ఉన్నప్పుడు కూడా ఫోన్ కాల్‌లను పొందవచ్చు. ఇండియాలో ఈ సేవను అందించిన వారిలో ఎయిర్‌టెల్ సంస్థ మొదటిది. ఇది కేవలం రెండు నెలల్లో 3 మిలియన్ల యూజర్‌బేస్ ను సాధించింది. ఈ సంవత్సరం చివరి నాటికి ఈ కొత్త టెక్నాలజీ 10 మిలియన్ల యూజర్‌బేస్ ను సాధిస్తుందని కంపెనీ ఆశిస్తోంది.

With Free Airtel Wi-Fi Calling, Airtel now puts an end to the call drops

ఈ కొత్త టెక్నాలజీలో మారేది ఏమిటి?

ఈ కొత్త టెక్నాలజీలో భాగంగా ఫోన్ కాల్ డ్రాప్‌లకు సహాయం చేయడం కంటే చాలా ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్ జనసాంద్రత గల ప్రాంతాలలో సాధారణ సెల్యులార్ నెట్‌వర్క్‌ల యొక్క సమస్యను తీర్చడానికి గొప్ప సాధనంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎయిర్‌టెల్ యొక్క ఈ కొత్త సర్వీస్ ఉచితంగా లభిస్తుంది. వినియోగదారులు వారి ప్రస్తుత మొబైల్ ప్లాన్లలో ఈ సేవను ఉపయోగించడం కొనసాగించవచ్చు.

ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్ యొక్క మరొక ప్రయోజనం ఏమిటంటే HD లేదా VoLTE వాయిస్ సౌకర్యాలు లేని మారుమూల ప్రాంతాల నుండి కూడా HD కాల్‌లను చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మీకు అనుకూలమైన స్మార్ట్‌ఫోన్ మరియు ఎయిర్‌టెల్ సిమ్ ఉన్నాయని నిర్ధారించుకోండి మరియు మీకు నచ్చిన వారికి కాల్స్ చేయవచ్చు.

వైఫై కాల్ సేవలకోసం ఫోన్ సెట్టింగ్స్

ఒక్క జమ్మూ కశ్మీర్ తప్ప వైఫై సేవలను దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ ప్రవేశపెడుతోంది. మీ ఫోను ఎయిర్‌టెల్ వైఫ్ కాలింగ్‌ సదుపాయం ఉంటే బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్‌కు కనెక్ట్ అవ్వండి. అనంతరం VoLTE సర్వీసును ఫోన్‌లో ఆన్ చేయండి. ఇది చేయాలంటే:
సెట్టింగ్స్ > నెట్‌వర్క్స్ > ఎయిర్‌టెల్ సిమ్ >VoLTE సెట్ చేయండి. ఆ తర్వాత వైఫై కాలింగ్ సేవలు వినియోగించుకునేందుకు:
సెట్టింగ్స్ > నెట్‌వర్క్ సెట్టింగ్స్ > ఎయిర్‌టెల్ సిమ్> యాక్టివేట్ మేక్ కాల్స్ యూజింగ్ వైఫై‌కు సెట్ చేసుకోండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X