వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పదేళ్ల బుడతడు.. ఐక్యూలో ఐన్‌స్టీన్, హాకింగ్‌లనే దాటేశాడు!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

లండన్: పదేళ్ల వయసున్న భారత సంతతి కుర్రాడు ... దిగ్గజ శాస్త్రవేత్తలు ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌ల ఐక్యూను మించిపోయాడు. బ్రిటన్‌లో ఉంటున్న మెహుల్ గార్గ్ .. మెన్సా ఐక్యూ టెస్ట్‌లో టాప్ మార్క్స్ స్కోర్ చేశాడు.

గత పదేళ్లలో ఆ రికార్డును అందుకున్న అతిపిన్న వయస్కుడిగా మెహుల్ రికార్డు క్రియేట్ చేశాడు. దీంతో ఆ బాలుడు.. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌లను మించిన తెలివితేటలు కలిగిన వాడిగా రికార్డ్ సృష్టించాడు.

మేధావితనానికి కొలమానంగా భావించే 'మెన్సా ఐక్యూ పరీక్ష'లో మెహుల్ గార్గ్ 162 పాయింట్లు సాధించాడు. అతడి అన్న ధృవ్‌ గార్గ్‌ (13) కూడా గతేడాది 162 పాయింట్లు సాధించడం విశేషం. అన్నయ్యను స్పూర్తిగా తీసుకున్న మెహుల్ అతనికి తీసిపోనని నిరూపించుకున్నాడు.

10-year-old boy of Indian-origin in UK beats Einstein, Hawking in Mensa IQ test

మెహుల్ గార్గ్ దక్షిణ ఇంగ్లండ్‌లోని రీడింగ్‌లో ఉన్న రీడింగ్ బాయ్స్ గ్రామర్ స్కూల్‌లో చదువుతున్నాడు. మెన్సా ఐక్యూ పరీక్షలో అతడికి మొత్తం 162 పాయింట్లు వచ్చాయి. అంటే ఐన్‌స్టీన్, హాకింగ్‌లకన్నా రెండు పాయింట్లు ఎక్కువే.

ఈ ఐక్యూ పరీక్షలో 140 స్కోరు సాధించిన వారిని మేధావిగా గుర్తిస్తారు. అలాటిది ఈ అన్నదమ్ములిద్దరూ 162 స్కోరు సాధించడం విశేషం. కాగా ఐన్ స్టీన్, స్టీఫెన్ హాకింగ్ ల స్కోరు 160 కావడం విశేషం.

క్రికెట్, ఐస్ స్కేటింగ్ అంటే మెహుల్‌కు పిచ్చి. ఇక చదువు విషయానికొస్తే.. మ్యాథమేటిక్స్‌ అతడి ఫేవరెట్ సబ్జెక్ట్. ఐక్యూ టెస్ట్ ఫలితాలు రాగానే మెహుల్ గార్గ్ తీవ్ర భావోద్వేగానికి గుయ్యాడు. అంతేకాదు, గూగుల్ కంటే పెద్ద కంపెనీని తయారు చేస్తామని చెబుతున్నాడు.

ఇప్పటికే అన్నదమ్ములిద్దరూ విరాళాల ద్వారా 1300 పౌండ్లు (1,17,000 రూపాయలు) సేకరించారు. వీటితో ఇరుగుపొరుగును అనుసంధానించి, ఒంటరితనం భావనను తగ్గించే యాప్ ను తయారు చేస్తున్నారు.

అంతేకాదు, మెహుల్ గార్గ్ రూబిక్ క్యూబ్‌ను కేవలం వంద సెకన్లలోనే సెట్ చేస్తాడు. ప్రస్తుతం ఛానల్ 4 నిర్వహించే చైల్డ్ జీనియస్ 2018 షోలో పాల్గొనేందుకు కూడా మెహుల్ గార్గ్ ప్రిపేరవుతున్నాడు.

English summary
A 10-year-old Indian-origin boy in the UK has become the youngest applicant in a decade to achieve the highest score in the Mensa IQ test, beating geniuses like Albert Einstein and Stephen Hawking. Mehul Garg, also known by his nickname Mahi, decided to take the test to follow in the footsteps of his older brother, 13-year-old Dhruv Garg, who had also scored the highest score of 162 last year. "Mahi is fiercely competitive. His older brother had achieved the same score last year so he really wanted to prove that he is no less intelligent than his brother," said his mother Divya Garg.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X