వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో వాసవి జయంతి ఉత్సవాలు

By Staff
|
Google Oneindia TeluguNews

Vasavi Pooja
అమెరికాలోని బే ఏరియాలో మే 3 నుంచి వాసవి జయంతి/ మదర్స్ డే ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వాసవి జయంతిని లివర్ మోర్ ఆలయంలో పదిహేనేళ్ళుగా ఘనంగా జరుగుతున్నాయి. గతంలో ఈ ఉత్సవాన్ని ఆలయమే స్పాన్సర్ చేసేది. ఈసారి ఆదివారం నాడు నిర్వహించిన ఊత్సవం నేషనల్ వాసవైట్స్ ఆర్గనైజేషన్ (NRIVA) (www.NRIVA.org) చురుకుగా పాల్గొనడం, స్ధానికి వాసవీ సేవా ఫౌండేషన్ సహకార సమన్వయం లభించడంతో మరింత ఘనంగా జరిగింది. దాదాపు వెయ్యిమంది ఈ ఉత్సవంలో పాల్గొనడం విశేషం.

భవ్య పానుగంటి, నీహారిక జలదంకి, వంకారమ్య భజనలతో పూజ ఉదయం పదిన్నరకు ప్రారంభమైంది. భజనలకు మీనాక్షి రామ్మూర్తి మార్గదర్శకత్వం వహించారు. తర్వాత వాసవి మాత అభిషేకం జరిగింది. లివర్ మోర్ ఆలయ పూజారులు సహస్రనామం, అష్టోత్తర అర్చన, మగళ హారతి, మంత్రపుష్పం నిర్వహించారు. వాసవి అమ్మవారి విశిష్టత గురించి వక్తలు వివరించారు. ఆమ్మవారి అహింసా మార్గాన్ని జీసస్ క్రీస్తు, గౌతమ బుద్ధుడు, మహాత్మాగాంధీ, సత్యసాయిబాబాబు, పొట్టిశ్రీరాములు అనుసరించారని చెప్పారు.

రావు పానుగంటి తదితరులు ఉన్న వాసవీ సేవా ఫౌండేషన్ కమిటీ సహాయంతో నాగేంద్ర జలదంకి ఈ సంవత్సరం సమన్వయ కర్తగా వ్యవహరించారు. వాసవి సేవా ఫౌండేషన్ కార్యదర్శిగా రావ్ పానుగంటి, కోశాధికారిగా ఎలిసెట్టి గుప్తా, అధ్యక్షుడుగా వీఅర్ రంగనాధ్ ఉన్నారు. శాన్ జోస్, సిఎ లో వాసవి మాత ఆలయం నిర్మించడంలో కూడా ఈ సంస్ధ కీలక పాత్ర పోషిస్తోంది.

బే ఏరీయాలోని ప్రముఖ ప్రవాస భారతీయులు విజయ చవ్వా, లక్ష్మి, గండే తిరుపతయ్య శివ్వా దీపక్, బాలరాజు గార్లపాటి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నోరూరించే దక్షిణ భారత భోజనాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. జాతీయ స్ధాయి వాసవి జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం ఎన్ ఆర్ ఐవిఎ సమన్వయంతో అమెరికాలోని 50 రాష్ట్రాల్లోను, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోనూ నిర్వహించనున్నారు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X