వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘనంగా ఆప్తా తొలి ప్రాంతీయ సమావేశం

By Santaram
|
Google Oneindia TeluguNews

NRI
"అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్(ఎపిటిఎ) తొలి ప్రాంతీయ సమావేశం వర్జీనియా రాష్ట్రంలో ఘనంగా జరిగింది. రీజనల్ మీట్ ని వర్జీనియా సెనటర్ మార్క్ హెర్రింగ్స్, డాక్టర్ సత్యనారయణ మూర్తి సిరం, డాక్టర్ ప్రసాదరావు వెలుగుబంటి, డాక్టర్ శ్రీరామమూర్తి అంకెం డాక్టర్ జగన్ లు ముఖ్య అతిధులుగా విజయవంతంగా నిర్వహించారు. వెంకట్ చలమలశెట్టి స్వాగత వచనాలతో సభ ని ప్రారంభించగా, వర్జీనియా సెనటర్ మార్క్ హెర్రింగ్స్, అప్తా బోర్డ్ డైరెక్టర్స్ మరియు ఎక్జుక్యూటివ్ కమిటీ సమక్షంలో కరతాల ధ్వనుల మధ్య జ్యోతి ప్రజ్వలన కావించారు. సెనటర్ మార్క్ హెర్రింగ్స్ మాట్లాడుతూ, "ఆప్తా" ప్రారంభించిన రెండు సంవత్సరాలలోనే ఆసెప్ ప్రోగ్రాము ద్వారా ఎంతో మంది పేద విద్యార్ధులని దత్తత తీసుకుని చదువు పూర్తి అయ్యేంతవరకు సంస్థ ద్వారా ఆర్ధిక సహాయం చేయటం చాలా గొప్ప విషయమని, సమాజానికి ఉపయోగ పడేటటువంటి ఎన్నో అభివ్రుద్ది కార్యక్రమాలు చేస్తున్న "ఆప్తా" కు తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని కొనియాడారు.

"డాక్టర్ సత్యనారయణ మూర్తి సిరం" మాట్లాడుతూ, ఆర్దిక సహాయం లేక ఇబ్బంది పడుతున్న ఎంతో మంది పేద విద్యార్ధులకు ఆప్తా ఆసెప్ ప్రొగ్రాము ద్వారా చేస్తున్న ఈ సహాయం ఎంతో మంది జీవితాలలో వెలుగు నింపుతుందని, ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న ఆప్తా మరిన్ని మంచి కార్యక్రమాలతో ముందుకెళ్ళాలని కొనియాడారు.

"డాక్టర్ ప్రసాదరావు వెలుగుబంటి" మాట్లాడుతూ, అమెరికాలో అవకాశాలు చాలా ఎక్కువైతే భారతీయులకు ఐడియాలు ఎక్కువని, సమాజానికి ఉపయోగపడే కొన్ని మంచి పనులు చెయ్యటానికి ఒక మంచి ఐడియాతో సంస్థని ప్రారంభించటం గొప్ప విషయమని కొనియాడారు. "మేరిలాండ్ యూనివర్సిటి ప్రొఫెసర్ డాక్టర్ శ్రీరామమూర్తి అంకెం" మాట్లాడుతూ, చదువు దాని ఉపయోగాలు, మేధస్సు వుండికూడా ఆర్ధిక సమస్యలవలన చదువుకోలేకపోతున్న ఎంతో మంది యువతకు ఆప్తాఒక ఆశ్యాజ్యోతని కొనియాడారు.

"డాక్టర్ జగన్ మాట్లాడుతూ", ఆసెప్ ద్వారా ఆప్తా అందిస్తున్న సేవలు విద్యార్ధులకు గొప్ప అవకాశమని, ఎంతో మంది పేద విద్యార్దులకు భవిష్యత్తు నిస్తున్న ఆప్తా నిజంగా చాలా గొప్ప సంస్థని కొనియాడారు. సాంస్క్రతిక కార్యక్రమాల్లో భాగంగా "మల్లిక బృందం" చిన్నారులతో చేసిన కూచిపూడి నృత్యం అందరిని ఆకట్టుకోగా గాయని ఉష పాటలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.

బోర్డ్ చైర్ ప్రసాద్ సమ్మెట ఆప్తా ఆవిర్భవించిన విధానాన్ని వివరించగా, బోర్డ్ డైరెక్టర్ సత్యా అడ్డగార్ల సంస్థ విధివిధానాలు, సమర్దవంతమైన ఎక్జుక్యూటివ్ కమిటీని (అన్ని శాఖలతో సహా) ఎన్నుకొనే విధానాన్ని(ఎలక్షన్ ప్రోసెస్)వివరించారు. "అరోమా హొటల్స్ మేనేజింగ్ పార్ట్నర్ మరియు ఆప్తా బోర్డ్ డైరెక్టర్ విజయ్ గుడిసేవ" మాట్లాడుతూ ఆప్తా మెంబర్లు అందరూ జీవిత భాగస్వామ్యం తీసుకోని మరిన్ని మంచి పనులు చెయ్యటానికి వీలుగా ఆప్తా అభివ్రుద్దికి తోడ్పడాలని కోరారు.

"రమేష్ శీలం ఆప్తా అసెప్" ద్వారా చేసిన మంచి పనులను వివరించి ప్రదర్శించిన పవర్ పాయిట్ ప్రజెంటేషన్ అందరిని ఆకట్టుకుంది.జోనల్ డైరెక్టర్స్ మధు దాసరి, గంగాధర్ చందు, క్రిష్ణ అమ్రుతం మరియు మెంబెర్షిప్ డైరెక్టర్ వెంకట్ చలమలశెట్టి లకు "డాక్టర్ సత్యనారయణ మూర్తి సిరం" షీల్డ్స్ బహుకరించగా, ప్రోగ్రాం వాలంటీర్స్ శ్రీనివాసు శీలంశెట్టి, రజినీకాంత్ సంఘాని, సునీత కానల, సునీత దామిరెడ్డి, సురేష్ గోన, అమర్ కానల, బసవ బడే లకు డాక్టర్ ప్రసాదరావు వెలుగుబంటి చేతులమీదుగ షీల్డ్స్ బహుకరించటం జరిగింది.

ఆప్తా ఎక్జుక్యూటివ్ కమిటీ తరపున అధ్యక్షుడు చందు శ్రీనివాసరావు ముఖ్య అతిధులకి షీల్డ్స్ బహుకరించగా, డాక్టర్ జగన్ సాంస్క్రితిక కార్యక్రమాల వారికి, సింగెర్ ఉష గారికి బోర్డ్ డైరెక్టర్ విజయ్ గుడిసేవ, ఆప్తా అసెప్ఎగ్జిక్యూటివ్ రమేష్ శీలం కి బోర్డ్ డైరెక్టర్ సత్య అడ్డగార్ల, ఈవెంట్ ఆంకర్ మాధవి అమ్రుతం కి బోర్డ్ చైర్ ప్రసాద్ సమ్మెట చేతుల మీదగ షీల్డ్స్ బహుకరించటం జరిగింది.

చివరగా సంస్థ అధ్యక్షుడు చందు శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆప్తాప్రారంభించిన ఈ రెండు సంవత్సరాల కాలం లో సాధించిన విజయాలు, అసెప్ ప్రోగ్రాము ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలు, ఆప్తా జాబ్స్ ద్వారా లబ్ధి పొందిన వారి వివరాల తో పాటు, చేపట్టబోయే కొత్త కార్యక్రమాల గురించి వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X