వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా టొరంటోలో దీపావళి ఉత్సవాలు

By Santaram
|
Google Oneindia TeluguNews

NRI
గ్రేటర్‌ టొరంటో: తెలుగు కల్చరల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ టొరంటో (టిసిఎజిటి) ఆధ్వర్యంలో దీపావళి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. స్థానిక పోర్ట్‌ క్రెడిట్‌ స్కూల్‌ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ వేడుకల్లో 700 మందికిపైగా తెలుగు వారు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వేడుకల్లో ముందుగా గణపతి స్తోత్రంతో స్వాగతం పలికి, జ్యోతిని వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు.

కొవిరినేని బ్రదర్స్‌ పాడిన బాలల తాత గాంధీజి, రమ్య కంచెర్ల కీర్తన, భరతనాట్యం, సందీప్‌, అమృతల మృదంగం, శ్రీమతి దీప శాస్త్రీయ నృత్యం, స్రవంతి, సత్యజిత్‌, శ్రీహిత, సౌమ్యల డాన్స్‌, శ్రీకర్‌, మానస్వి, శ్రీచక్ర, యషస్వి గ్రూప్‌ డాన్స్‌, సన్నిధి, శ్రెయ, జాషువ నృత్యం, మల్లేశ్వరి నలం, రాజేంద్ర ప్రసాద్‌, రజని పాటలతో ఆహూతులను ఉర్రూతలూగించారు.

టి.సి.ఎ.జి.టి. ప్రస్తుత సంవత్సరానికి ప్రెసిడెంట్‌గా, ఎంతో కాలంగా సభ్యునిగా సేవలందిస్తున్న చారి సమంతపూడిని ఈ సందర్భంగా కమిటి సభ్యులు, ట్రస్టీలు మొమెంటోతో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చారి సమంతపూడి సంస్థ రోజు రోజుకీ బలపడుతున్నందుకు సంతోషం వ్యక్తం చేసారు. ఆ తర్వాత సంప్రదాయ వంటకాలతో ఆహూతులకు విందు చేసారు. భోజనానంతరం అశ్విని, అన్విత, అల 'జెమిని' నృత్యం, శర్మ దోనేపూడి, సందీప్‌ మృదంగ వాయిద్యం, నిక్కి 'ఆనందం' డాన్స్‌, అపర్ణ నలం నిర్వహించిన ఫ్యాషన్‌ షో, ఆరుష్‌ మైఖేల్‌ జాక్సన్‌ నివాళి నృత్యం, నిఖితా సాలూరి గానం, గణపతి రావ్‌, మిమిక్రీ, జోక్స్‌, సుఖవాసి సిస్టర్స్‌చే నిర్వహించబడిన దేసీ గర్ల్స్‌ను అనిష్‌, కీర్తి, టీన, చిత్ర, శ్రావణి, హిమలు అభినయించారు.

అనంతరం రాజేంద్ర ప్రసాద్‌, మాధవిలు ఫోక్‌ సంగీతం పాడారు. శ్రీహిత సినీ నృత్యం, మెగాస్టార్‌ పాటలకు మాధురి, అపర్ణ, అరవిందల మెరుపు నృత్యం, సరికొత్త పాటలతో కూర్చిన మెడ్లీకి అందరూ కలిసి నృత్యం చేసి అలరించారు. అక్కడితో సెక్రటరీ అరుణ్‌ కుమార్‌ లయం నిర్వహించిన 30కి పైగా కార్యక్రమాల సందడికి తెరపడింది.

ఈ కార్యక్రమంలో బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ ఛైర్మన్‌ కొటమర్తి విజయ శాస్త్రి, యలమంచలి కేశవరావు, భాషా షేక్‌, శ్రీమతి విజయ మడుపు, ఎగ్జిక్యూటివ్‌ కమిటి సభ్యులు జాయింట్‌-సెక్రటరీ రవి వారణాసి, ట్రెజరర్‌ గంగాధర్‌ సుఖవాసి, జాయింట్‌-ట్రెజరర్‌ శ్రీమతి మేరి ఫిలిప్‌, డైరెక్టర్లు శ్రీనాథ్‌ కుండూరున్‌, రమేష్‌ మునికుంట్ల, వెంకట్‌ రాయల్పాడు, యూత్‌ డైరెక్టర్‌ అపర్ణ సలీంలు పాల్గొని తమ సహకారాన్ని అందించారు. అలాగే ఉదయ్‌, అరుణ్‌, రఘు, అపర్ణలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. చివరగా మునాఫ్‌ అబ్దుల్‌ వందన సమర్పణ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X